OnePlus 12R: వన్‌ప్లస్ 12ఆర్ కొన్నవారికి డబ్బులు వెనక్కి.. ఎందుకంటే.?
వన్‌ప్లస్ 12ఆర్ స్మార్ట్‌ఫోన్ కొనుగోలుదారులకు పూర్తి రిఫండ్ చెల్లించనున్నట్టు వన్‌ప్లస్ ప్రకటించింది. మార్చి 16 వరకు ఇది అందుబాటులో ఉంటుందని తెలిపింది. కంపెనీ ఇలా రిఫండ్ ప్రకటించడం వెనక కారణం ఉంది. నిజానికి ఈ స్మార్ట్‌ఫోన్ యూఎఫ్ఎస్ 3.1 కాగా, దానిని పొరపాటున యూఎఫ్ఎస్ 4.0గా లిస్ట్ చేసింది. యూఎఫ్ఎస్ 3.1 అనేది బేస్ స్టోరేజీ ఆప్షన్‌తో సమానం.
వన్‌ప్లస్ 12ఆర్ స్మార్ట్‌ఫోన్ కొనుగోలుదారులకు పూర్తి రిఫండ్ చెల్లించనున్నట్టు వన్‌ప్లస్ ప్రకటించింది. మార్చి 16 వరకు ఇది అందుబాటులో ఉంటుందని తెలిపింది. కంపెనీ ఇలా రిఫండ్ ప్రకటించడం వెనక కారణం ఉంది. నిజానికి ఈ స్మార్ట్‌ఫోన్ యూఎఫ్ఎస్ 3.1 కాగా, దానిని పొరపాటున యూఎఫ్ఎస్ 4.0గా లిస్ట్ చేసింది. యూఎఫ్ఎస్ 3.1 అనేది బేస్ స్టోరేజీ ఆప్షన్‌తో సమానం. ఈ నేపథ్యంలో అధిక ధర చెల్లించి ఫోన్‌ను కొనుగోలు చేసిన వారికి రిఫండ్ ఇవ్వాలని నిర్ణయించింది. ఈ ఫోన్‌ను వన్‌ప్లస్ 12 మోడల్‌తోపాటు వన్‌ప్లస్ 12ఆర్‌ను కంపెనీ లాంచ్ చేసింది. ఇందులో స్నాప్‌డ్రాగన్ 8వ జనరేషన్ సెకండ్ చిప్‌సెట్, 16 జీబీ ర్యామ్, 256 జీబీ ఇన్‌బిల్ట్ స్టోరేజీ ఉంది. ఫోన్‌ను పొరపాటుగా లిస్ట్ చేయడంపై వన్‌ప్లస్ ప్రెసిడెంట్, సీవోవో కిండెర్ లియు ఓ ప్రకటన చేస్తూ.. వన్‌ప్లస్ 12ఆర్ 256 స్టోరేజీ వేరియంట్ కొనుగోలు చేసిన వినియోగదారులు మార్చి 16 వరకు రిఫండ్ పొందొచ్చని తెలిపారు. వన్‌ప్లస్ 12ఆర్ స్పెసిఫికేషన్ల విషయానికొస్తే.. ఆండ్రాయిడ్ 14 ఆధారిత ఆక్సిజన్ ఓఎస్, 6.78 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లే, గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్, క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 చిప్‌సెట్, 16 జీబీ ర్యామ్, 50 మెగాపిక్సెల్ ప్రధాన సెన్సార్‌తో వెనకవైపు మూడు కెమెరాలు, 16 ఎంపీ సెల్ఫీ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..