Bulletproof Car: బుల్లెట్ ప్రూఫ్ కారు కొనాలంటే ఎవరి అనుమతులు కావాలి? ధర ఎంత ఉంటుంది?
ఇప్పుడు వాహనాన్ని బుల్లెట్ ప్రూఫ్ చేయడానికి ఎలాంటి అనుమతులు అవసరమో తెలుసుకుందాం. మీరు బుల్లెట్ ప్రూఫ్ వాహనం కొనుగోలు చేయాలంటే ముందుగా మీరు జిల్లా మేజిస్ట్రేట్, ఎస్పీ పోలీస్, హోం మంత్రిత్వ శాఖ నుండి అనుమతి తీసుకోవాలి. మీరు లగ్జరీ లేదా పెద్ద వాహనాన్ని బుల్లెట్ ప్రూఫ్ తయారీకి

సెలబ్రిటీ అయినా, రాజకీయ నాయకుడైనా… ప్రతిరోజూ చాలా మందికి హత్య బెదిరింపులు వస్తున్నాయి. అటువంటి పరిస్థితిలో ఈ వ్యక్తులు తమ భద్రత కోసం బుల్లెట్ ప్రూఫ్ కార్లను ఉపయోగిస్తారు. రాజకీయ నాయకులు, నటులు, చాలా మంది VIPలు బుల్లెట్ ప్రూఫ్ కార్లలో ప్రయాణిస్తుంటారు. ఈ బుల్లెట్ ప్రూఫ్ కార్లు ఎలా తయారు చేస్తారు అనే ప్రశ్న మీ మనసులో ఎప్పుడైనా వచ్చిందా? దీనితో పాటు, ఒక పెద్ద ప్రశ్న ఏమిటంటే, ఒక వ్యక్తి తన కారును బుల్లెట్ ప్రూఫ్ కారు కొనాలంటే ఎంత ఖర్చు అవుతుంది.
బుల్లెట్ ప్రూఫ్ గా తయారు చేసిన తర్వాత మీ కారు ఎంత బలంగా ఉంటుందంటే, ఎలాంటి వారు అయినా ఏమి చేయలేరు. కారు హ్యాండ్ గ్రెనేడ్ల నుండి AK-47 వరకు దాడులను తట్టుకోగలదు. ఏదైనా సాధారణ కారును బుల్లెట్ ప్రూఫ్ గా మార్చడానికి కారు అసలు నిర్మాణం మారిపోతుంది. కారును బలంగా తయారు చేయడంతో పాటు, విండో గ్లాస్, ఇంటీరియర్ వైరింగ్ కూడా మారుస్తారు.
పాలికార్బోనేట్ పొరతో గ్లాస్ తయారీ:
బుల్లెట్ ప్రూఫ్ వాహనాలకు ఉండే గ్లాసు ప్రత్యేక రకం బలమైన గాజుతో (పాలికార్బోనేట్ పొర) తయారు చేస్తారు. ఇది అధిక క్యాలిబర్ బుల్లెట్లను కూడా ఆపగలదు. అదే సమయంలో వాహనం బాడీపై అమర్చబడిన ఆర్మర్డ్ ప్లేట్లు బాంబు పేలుళ్ల నుండి కూడా సురక్షితంగా ఉంటాయి. ఈ వాహనాలు అత్యవసర పరిస్థితుల్లో తక్షణ సహాయం అందించడానికి GPS ట్రాకింగ్, పానిక్ బటన్, ఆటోమేటిక్ పోలీస్ కాంటాక్ట్ సిస్టమ్‌తో కూడా అమర్చబడి ఉంటాయి.
ఈ కారుకు అమర్చే గ్లాస్ (30 మి.మీ నుండి 40 మి.మీ మందం) ధర రూ.7 లక్షల కంటే ఎక్కువ ఉంటుందని చెబుతుంటారు. ప్రత్యేక టైర్లు సాధారణంగా జర్మనీ నుండి దిగుమతి చేసుకుంటారు. వీటి ధర రూ.2 నుండి రూ.5 లక్షల వరకు ఉంటుందట. అదే సమయంలో, ఆస్ట్రేలియా, ఆస్ట్రియా, యునైటెడ్ కింగ్‌డమ్ నుండి దిగుమతి చేసుకున్న ఆర్మర్డ్ స్టీల్ ధర కిలోకు దాదాపు $7. వాహనాన్ని బుల్లెట్ ప్రూఫ్ చేయడానికి దాదాపు ఒక టన్ను ఉక్కు అవసరం అవుతుంది.
లోపలి భాగంలో అల్యూమినియంతో తయారీ:
కారు లోపలి భాగంతో పాటు బాహ్య భాగాన్ని కూడా అల్యూమినియం, స్టీల్‌తో తయారు చేస్తారు. ఈ మార్పు వెనుక కారణం ఏమిటంటే, బుల్లెట్లు తగిలినా, అది కారులో ఉన్న వ్యక్తులపై ప్రభావం చూపదు. అలాగే, కారు తలుపులు కూడా బలమైన లోహంతో తయారు చేస్తారు. దీనితో పాటు, బుల్లెట్లు ఎటువంటి ప్రభావాన్ని చూపకుండా అధునాతన గాజును ఏర్పాటు చేస్తారు. అంతేకాకుండా పంక్చర్ తర్వాత కూడా కారును సులభంగా ప్రయాణించగలదు.
కారు తయారీకి ఎలాంటి అనుమతులు కావాలి?
ఇప్పుడు వాహనాన్ని బుల్లెట్ ప్రూఫ్ చేయడానికి ఎలాంటి అనుమతులు అవసరమో తెలుసుకుందాం. మీరు మీ వాహనాన్ని బుల్లెట్ ప్రూఫ్ చేయాలనుకుంటే మీరు జిల్లా మేజిస్ట్రేట్, ఎస్పీ పోలీస్, హోం మంత్రిత్వ శాఖ నుండి అనుమతి తీసుకోవాలి. మీరు లగ్జరీ లేదా పెద్ద వాహనాన్ని బుల్లెట్ ప్రూఫ్ తయారీకి మీరు 1 కోటి రూపాయలకుపైనే ఖర్చు చేయాల్సి రావచ్చు. భారతదేశంలో, సాధారణంగా బుల్లెట్ ప్రూఫ్‌గా తయారు చేయబడిన వాహనాల్లో టాటా సఫారీ, మహీంద్రా స్కార్పియో, మిత్సుబిషి పజెరో, టయోటా ఇన్నోవా, ఫోర్డ్ ఎండీవర్, టయోటా ఫార్చ్యూనర్, BMW, ఆడి వంటి SUVలు ఉన్నాయి.
బుల్లెట్ ప్రూఫింగ్ ఎన్ని రకాలు ఉన్నాయి?
మొత్తం నాలుగు స్థాయిల బుల్లెట్ ప్రూఫింగ్ ఉన్నాయి:
- లెవల్-1, లెవల్-2: ఇవి సాధారణ పిస్టల్స్ వంటి చిన్న ఆయుధాల నుండి బుల్లెట్ల నుండి రక్షణ కల్పిస్తాయి.
- లెవెల్-3: ఇది AK-47, SLR వంటి రైఫిల్స్ నుండి బుల్లెట్లను ఆపగలదు.
- లెవల్-4: ఇది అత్యున్నత రక్షణ స్థాయిలో ఉన్నవారికి అవసరం. బుల్లెట్ల నుండి కూడా రక్షణను అందిస్తుంది. ఇటువంటి బుల్లెట్లను సాధారణంగా సైనిక కార్యకలాపాలలో ఉపయోగిస్తారు.
ఇది కూడా చదవండి: Video Viral: మీ అనుమతి లేకుండా ఎవరైనా మీ వీడియోను సోషల్ మీడియాలో లీక్ చేశారా? ఇలా డిలీట్ చేయండి
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి








