AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SBI Rules Change: ఎస్‌బీఐ క్రెడిట్‌ కార్డు వాడేవారికి బిగ్‌ అలర్ట్‌.. జూలై 15 నుంచి పెద్ద మార్పులు

SBI Credit Card Rules: ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ కనీస మొత్తం బకాయి నిబంధనలో మార్పుతో ఎస్‌బీఐ కార్డ్ ఎలైట్, ఎస్‌బీఐ కార్డ్ మైల్స్ ఎలైట్, ఎస్‌బీఐ కార్డ్ మైల్స్ ప్రైమ్ వినియోగదారులకు క్రెడిట్ కార్డ్‌తో లభించే కాంప్లిమెంటరీ ఎయిర్ యాక్సిడెంట్..

SBI Rules Change: ఎస్‌బీఐ క్రెడిట్‌ కార్డు వాడేవారికి బిగ్‌ అలర్ట్‌.. జూలై 15 నుంచి పెద్ద మార్పులు
Subhash Goud
|

Updated on: Jun 19, 2025 | 7:39 PM

Share

మీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రెడిట్ కార్డును ఉపయోగిస్తుంటే ఈ వార్త మీకు ప్రత్యేకమైనది. క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు చాలా పెద్ద మార్పులు జరగబోతున్నాయి. ఈ మార్పులు జూలై 15 తేదీ నుంచి జరగనున్నాయి. SBI తన క్రెడిట్ కార్డ్ వినియోగదారుల కోసం అనేక మార్పులను ప్రకటించింది. దాని సమాచారాన్ని వెబ్‌సైట్‌లో కూడా అందుబాటులో ఉంచారు. ఈ మార్పు క్రెడిట్ కార్డ్ బిల్లుపై చెల్లించాల్సిన కనీస మొత్తానికి సంబంధించినది.

ఇది కూడా చదవండి: Akshay Kumar: అక్షయ్ కుమార్ తాగే వాటర్‌ ఏంటో తెలుసా? అందుకే 57 ఏళ్లలో కూడా ఫిట్‌గా.. ఆశ్చర్యపరిచే సిక్రెట్‌!

ఎస్‌బీఐ కార్డు కొత్త నిబంధనల ప్రకారం.. ఇప్పుడు మొత్తం బకాయి బిల్లు మొత్తంలో 2% తో పాటు, 100% GST మొత్తం, EMI బ్యాలెన్స్, ఫీజులు, ఫైనాన్స్ ఛార్జీలు, ఓవర్‌లిమిట్ మొత్తం (ఏదైనా ఉంటే) కూడా కనీస బకాయి మొత్తంలో చేర్చనున్నారు. అందుకే మీరు మినిమమ్‌ బిల్లు చెల్లించకుండా పూర్తి బిల్లు చెల్లించడం ఉత్తమం. కనీస మొత్తం చెల్లించినట్లయితే చార్జీల వడ్డన భారీగా ఉండనుంది.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి: HIV Injection: గుడ్‌న్యూస్‌.. ఇక హెచ్‌ఐవీకి వ్యాక్సిన్‌ వచ్చేసింది.. ఎఫ్‌డీఏ ఆమోదం

కనీస మొత్తం ఎంత చెల్లించాలి?

క్రెడిట్ కార్డ్ చెల్లించాల్సిన కనీస మొత్తం ఎంత అనేది ఇక్కడ తెలుసుకోవడం ముఖ్యం. అందుకే ఇది మీ బకాయి బిల్లులో భాగం. మీరు ఖచ్చితంగా ప్రతి నెలా చెల్లిస్తారు. తద్వారా ఆలస్య చెల్లింపును నివారించవచ్చు. ఇది సాధారణంగా మీ మొత్తం బకాయి మొత్తంలో 2% లేదా 5% ఉంటుంది. కానీ ఇది డిఫాల్ట్‌ను నివారించడానికి ఒక మార్గం మాత్రమే అని గుర్తుంచుకోండి. ఎందుకంటే దానిని చెల్లించిన తర్వాత కూడా మీపై వడ్డీ వసూలు చేస్తుంది బ్యాంకు. అటువంటి పరిస్థితిలో ప్రతి నెలా బకాయి ఉన్న క్రెడిట్ కార్డ్ బిల్లును సకాలంలో చెల్లించడం ముఖ్యం.

విమాన ప్రమాద బీమా కవర్ ముగుస్తుంది.

ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ కనీస మొత్తం బకాయి నిబంధనలో మార్పుతో ఎస్‌బీఐ కార్డ్ ఎలైట్, ఎస్‌బీఐ కార్డ్ మైల్స్ ఎలైట్, ఎస్‌బీఐ కార్డ్ మైల్స్ ప్రైమ్ వినియోగదారులకు క్రెడిట్ కార్డ్‌తో లభించే కాంప్లిమెంటరీ ఎయిర్ యాక్సిడెంట్ కవర్ జూలై 15 నుండి నిలిపివేయనుంది. కంపెనీ నుండి కార్డుదారులకు రూ.1 కోటి వరకు ఉచిత బీమా కవర్ నిలిపివేనున్నారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన ప్రీమియం క్రెడిట్ కార్డ్ హోల్డర్లకు ఈ సౌకర్యాన్ని అందిస్తుందని గమనించాలి. ఎస్‌బీఐ కార్డ్ ప్రైమ్, కార్డ్ పల్స్‌పై ఈ కవర్ రూ. 50 లక్షల వరకు ఉంటుంది. ఇది కూడా నిలిపివేయనుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి