AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video Viral: మీ అనుమతి లేకుండా ఎవరైనా మీ వీడియోను సోషల్‌ మీడియాలో లీక్‌ చేశారా? ఇలా డిలీట్‌ చేయండి

Video Viral: ఒక ప్రధాన హోటల్‌లో ఒక జంట అభ్యంతరకరమైన వీడియో కెమెరాలో బంధించారు. తరువాత అది సోషల్ మీడియాలో పోస్ట్ అయ్యింది. ఇది మొదటి, కొత్త కేసు కాదు. దీనికి ముందు కూడా కొందరు సిక్రెట్‌ కెమెరాల ద్వారా కొందరివి..

Video Viral: మీ అనుమతి లేకుండా ఎవరైనా మీ వీడియోను సోషల్‌ మీడియాలో లీక్‌ చేశారా? ఇలా డిలీట్‌ చేయండి
Subhash Goud
|

Updated on: Jun 20, 2025 | 3:45 PM

Share

డిజిటల్ ప్రపంచంలో ప్రయోజనాలతో పాటు నష్టాలు కూడా ఉన్నాయి. ప్రతిరోజూ సోషల్ మీడియాలో ఏదో ఒక వీడియో వైరల్ అవుతోంది. ఇది ఒకరి వ్యక్తిగత జీవితానికి సంబంధించినది. చాలాసార్లు వీడియోలు లేదా ఫోటోలు కూడా మార్ఫింగ్ చేసి సోషల్‌ మీడియాలో వైరల్‌ చేస్తుంటారు. ఇటీవలి సంఘటన రాజస్థాన్‌లోని జైపూర్‌కు చెందినది. జైపూర్‌లోని ఒక ప్రధాన హోటల్‌లో ఒక జంట అభ్యంతరకరమైన వీడియో కెమెరాలో బంధించారు. తరువాత అది సోషల్ మీడియాలో పోస్ట్ అయ్యింది. ఇది మొదటి, కొత్త కేసు కాదు. దీనికి ముందు కూడా కొందరు సిక్రెట్‌ కెమెరాల ద్వారా కొందరివి సృష్టించి నకిలీలు, AI- జనరేటెడ్ ఫోటోలు లేదా వీడియోలు, హోటళ్లలో డిజిటల్ అరెస్టులకు బాధితులుగా మారారు. ఇలాంటి సంఘటనలు మీకు కూడా జరిగితే అలాంటి వీడియోలను సోషల్‌ మీడియా నుంచి డిలీట్‌ చేసుకోవచ్చు. మరి వాటిని ఎలా తొలగించాలో తెలుసుకుందాం..

ఇది కూడా చదవండి: Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో ఇలాంటి కీటకాలు వస్తున్నాయా? ఇలా చేస్తే క్షణాల్లో పరార్‌!

జైపూర్‌లోని హోటల్ హాలిడే ఇన్‌లో ఒక జంట అభ్యంతరకరమైన వీడియోను కెమెరాలో బంధించారు కొందరు. ఆ జంట హోటల్ గదిలో సన్నిహితంగా ఉన్నప్పుడు కొంతమంది దుండగులు బయటి నుండి వారి వీడియోను తీశారు. ఇది చట్టవిరుద్ధం. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా, ఆ వీడియో వైరల్ అయింది. ఇలాంటివి చాలా మందికి జరుగుతుంటాయి. ఇలాంటి వీడియోలు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసి భయభ్రాంతులకు గురి చేస్తుంటారు. అంతేకాదు వారి పరువు భంగం కలుగుతుంది.

ఇవి కూడా చదవండి

StopNCII.org నుండి వైరల్ ఫుటేజ్‌ను తొలగించవచ్చు:

మీ అనుమతి లేకుండా మీకు తెలిసిన వ్యక్తి ప్రైవేట్ వీడియో లేదా ఫోటోగ్రాఫ్ వెబ్‌సైట్ లేదా సోషల్ మీడియా సైట్‌లో పోస్ట్ చేస్తే మీరు StopNCII.org సహాయంతో దాన్ని తీసివేయవచ్చు. ఈ వెబ్‌సైట్ SWGfL (స్టాప్ నాన్-కాన్సెన్సువల్ ఇంటిమేట్ ఇమేజ్ అబ్యూజ్) అనే అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థలో భాగం. వారు ఇంటర్నెట్ నుండి అనుమతి లేకుండా ఆన్‌లైన్‌లో షేర్ చేసిన ప్రైవేట్ ఫోటోలు, వీడియోలను తొలగించడానికి పని చేస్తారు. అనుమతి లేకుండా తీసిన ఛాయాచిత్రాల దుర్వినియోగం నుండి బాధితులను రక్షించే ఉచిత సాధనం ఇది. ఈ వెబ్‌సైట్‌లోకి వెళ్లి మీ సమస్యను విన్నవించి డిలీట్‌ చేసేలా చేయవచ్చు.

3 సంవత్సరాలు జైలు శిక్ష:

రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం భారతదేశంలోని ప్రతి పౌరుడికి గోప్యత హక్కు ఉంది. దీని అర్థం ఏ వ్యక్తి మరొక వ్యక్తి గోప్యతను ఉల్లంఘించే ఏ పని చేయకూడదు. అలా చేసినందుకు శిక్ష విధించే నిబంధన ఉంది. ఒక వ్యక్తి తన ఇష్టానికి విరుద్ధంగా ఒకరి వీడియోను తీసి, ఆపై అతను నిరాకరించినప్పటికీ దానిని వైరల్ చేస్తే, అతను ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం 2000 (IT చట్టం 2000) లోని సెక్షన్ 66E ప్రకారం దోషిగా పరిగణిస్తారు. దీని కోసం దోషికి 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష, రూ. 2 లక్షల వరకు జరిమానా విధించవచ్చు.

మీరు ఈ విధంగా ఫిర్యాదు చేయవచ్చు:

  • అభ్యంతరకరమైన వీడియో స్క్రీన్‌షాట్ తీసుకోవడం ద్వారా మీరు నేరుగా సైబర్ సెల్‌కు ఫిర్యాదు చేయవచ్చు. వీడియో లింక్, URL ఇవ్వడం ద్వారా మీరు సంఘటన గురించి సైబర్ సెల్‌కు తెలియజేయవచ్చు.
  • ఐటీ చట్టం కింద ఇప్పటికే కేసు నమోదై ఉంటే మీరు దాని ఎఫ్‌ఐఆర్ కాపీ ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చు.
  • మీరురాష్ట్ర పోలీసు వెబ్‌సైట్‌లో కూడా నేరుగా ఫిర్యాదు చేయవచ్చు. కానీ ఆ తర్వాత మీరు సైబర్ సెల్‌ను కలిసి కేసు పూర్తి వివరాలను అందించాలి.

మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి