AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Best phones under 25k: పాతికవేలకే పసందైన స్మార్ట్ ఫోన్లు.. అదిరే ఫీచర్స్ ఇవే..!

దేశ మార్కెట్ లోకి నిత్యం వివిధ బ్రాండ్ల నుంచి అనేక రకాల స్మార్ట్ ఫోన్లు విడుదలవుతున్నాయి. ఆధునిక ఫీచర్లు, సాంకేతికతలో ఒకదానికి మించి మరొకటి ఉంటున్నాయి. పనితీరు, నాణ్యత, ప్రత్యేకతల్లో పోటీ పడుతూ కొనుగోలుదారులకు మెరుగైన సేవలు అందిస్తున్నాయి. ఈ కంపెనీల మధ్య నెలకొన్న పోటీ నేపథ్యంలో తక్కువ ధరకే ఫోన్లు అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం మిడ్ రేంజ్ ఫోన్ల అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. సుమారు రూ.25 వేల కంటే తక్కువ ధరలో ఉన్న ఫోన్లను కొనడానికి ప్రజలు ఇష్టపడుతున్నారు. ఆ విభాగంలో అందుబాటులో ఉన్న బెస్ట్ కంపెనీల ఫోన్ల వివరాలు తెలుసుకుందాం.

Nikhil
|

Updated on: Jun 20, 2025 | 4:00 PM

Share
మార్కెట్ లోకి కొత్తగా విడుదలైన మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్లలో మోటోరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ ఒకటి. దీనిలో 6.7 అంగుళాల ఆల్ కర్వ్ పీవోలెడ్ స్క్రీన్, 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజీ, 5500 ఎంఏహెచ్ బ్యాటరీ ఏర్పాటు చేశారు. 50 ఎంపీ సోనీ ప్రైమరీ కెమెరా, 13 ఎంపీ అల్ట్రావైడ్ సెన్సార్, వెనుక భాగంలో ప్రత్యేకంగా 3 ఇన్ 1 లైట్ సెన్సార్ బాగున్నాయి. సెల్ఫీలు, వీడియోల కోసం ముందు భాగంలో 32 మెగా పిక్సల్ కెమెరా ఉంది. దీనిలోని 8 జీబీ ర్యామ్, 256 జీబీ వేరియంట్ రూ.22,999కు, 12 జీబీ ర్యామ్, 256 జీబీ వేరియంట్ రూ.24,999కు అందుబాటులో ఉన్నాయి.

1 / 5
మంచి పనితీరు కలిగిన ఫోన్ కావాలనుకునే వారికి నథింగ్ ఫోన్ 3ఏ మంచి ఎంపిక. పాండా గ్లాస్ ప్రొటెక్షన్ తో కూడిన 6.7 అంగుళాల ఫెక్సిబుల్ అమోలెడ్ డిస్ ప్లే, ఆక్టా కోర్ స్నాప్ డ్రాగన్ 7ఎస్ జెన్ 3 ఎస్ వోసీ, ట్రిపుల్ కెమెరా సెటప్ ఆకట్టుకుంటున్నాయి. 50 ఎంపీ ప్రధాన సెన్సార్, 8 ఎంపీ అల్ట్రావైడ్ కెమెరా, 50 ఎంపీ టెలీ ఫొటో లైన్,  ముందు భాగంలో 32 ఎంపీ సెన్సార్ బాగున్నాయి. 50 వాట్స్ వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్ సపొర్డు కలిగిన 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఏర్పాటు చేశారు. దీనిలోని 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.24,999, అలాగే 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.26,999కి అందుబాటులో ఉన్నాయి.

2 / 5
అత్యాధునిక ఫీచర్లు, లేటెస్టు అప్ డేట్లతో వన్ ప్లస్ నార్డ్ సీఈ 4 అందుబాటులోకి వచ్చింది. దీనిలో 6.7 అంగుళాల పూర్తి హెచ్ డీ అమోలెడ్ డిస్ ప్లే, ఆక్టా కోర్ స్నాప్ డ్రాగన్ 7 జెన్ చిప్ సెట్, 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజీ, ముందు 16 ఎంపీ, వెనుక 50 ఎంపీ మెగా పిక్సల్, 8 ఎంపీ అల్ట్రావైడ్ కెమెరాలు ఆకట్టుకుంటున్నాయి. 5,500 ఎంఏహెచ్ బ్యాటరీ, ఆక్సిజన్ ఓఎస్ 15తో కూడిన ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టమ్ బాగున్నాయి. దీనిలో 128 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.24,999కు, 256 స్టోరేజీ వేరియంట్ రూ.26,999కు అందుబాటులో ఉన్నాయి.

3 / 5
ప్రస్తుతం మార్కెట్ లో అత్యధికంగా అమ్ముడవుతున్న బ్రాండ్లలో పోకో ఒకటి. దీని నుంచి విడుదలైన పోకో ఎక్స్ 7 ఫోన్ లో అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. 6.67 అంగుళాల 1.5 కర్వ్డ్ అమోలెడ్ డిస్ ప్లే, మీడియా టెక్ డైమెన్సిటీ 7300 అల్ట్రా చిప్ సెట్, 5,500 ఎంఏహెచ్ బ్యాటరీతో అందుబాటులోకి తీసుకువచ్చారు. 50 ఎంపీ ప్రైమరీ కెమెరా, 8 ఎంపీ అల్ట్రావైడ్ కెమెరా, సెల్ఫీలు, వీడియోల కోసం 20 ఎంపీ కెమెరా ఏర్పాటు చేశారు. దీనిలోని 8 జీబీ ర్యామ్, 128 జీబీ వేరియంట్ ను రూ.21,999, అలాగే 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజీ వేరియట్ ను రూ.23,999కు కొనుగోలు చేయవచ్చు.

4 / 5
మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్లలో రెడ్ మీ నోట్ ప్రో 5జీ ఒకటి. దీనిలో 6.67 అంగుళాల కర్వ్డ్ అమోలెడ్ డిస్ ప్లే ఏర్పాటు  చేశారు. మీడియా టెక్ డైమెన్సిటీ 7300 అల్ట్రా ప్రాసెసర్, 5,500 ఎంఏహెచ్ బ్యాటరీ బాగున్నాయి. కెమెరా విషయానికి వస్తే 50 ఎంపీ ప్రధాన కెమెరా, 8 ఎంపీ అల్ట్రా వైడ్ లెన్స్, 2 ఎంపీ మాక్రో కెమెరాతో ట్రిపుల్ రియల్ సెటప్ ఉంది. ఇక ముందు భాగంలో సెల్ఫీల కోసం 20 ఎంపీ సెన్సార్ అమర్చారు. దీనిలోని 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.24,999 నుంచి మొదలవుతుంది. అలాగే 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజీ మోడల్ ధరను రూ.25,999గా నిర్దారణ చేశారు.

5 / 5