BSNL: వై-ఫై వాడేవారికి బీఎస్‌ఎన్‌ఎల్ అదిరిపోయే ప్లాన్.. రూ.వెయ్యికే 3 నెలల పాటు హైస్పీడ్ ఇంటర్నెట్..
బీఎస్‌ఎన్ఎల్ కస్టమర్లను ఆకట్టుకునేందుకు అనేక మొబైల్, వై-ఫై రీఛార్జ్ ప్లాన్లను ప్రవేశపెడుతోంది. అందులో భాగంగా మరో కొత్త వై-ఫై ప్లాన్ లాంచ్ చేసింది. తక్కువ ధరకే మూడు నెలల వ్యాలిడిటీతో కూడిన ప్లాన్ తీసుకొచ్చింది. ఈ ప్లాన్ తీసుకున్నవారికి హైస్పీడ్ ఇంటర్నెట్ లభించనుంది.

కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్(బీఎస్‌ఎన్‌ఎల్) అదిరిపోయే వై-ఫై రీఛార్జ్ ప్లాన్ అందుబాటులోకి తెచ్చింది. హోమ్ వైఫై ప్లాన్ పేరుతో తీసుకొచ్చిన ఈ రీఛార్జ్ ప్లాన్ అతి తక్కువ ధరకే లభిస్తోంది. అతి తక్కువ ధరకే మూడు నెలల పాటు వై-ఫై రీఛార్జ్ పొందవచ్చు. కస్టమర్లను ఆకట్టుకునేందుకు బీఎస్‌ఎన్‌ఎల్ ఈ బంపర్ ఆఫర్ ప్రకటించింది. తక్కువ రీఛార్జ్‌తో హైస్పీడ్ డేటా మీరు పొందవచ్చు. అసలు ఈ ప్లాన్ ధర ఎంత..? ఎంత జీబీ హైస్పీడ్ డేటా వస్తుంది? అనే వివరాలు తెలుసుకుందాం.
కేవలం రూ.1099కే 3 నెలల పాటు వై-ఫై
బీఎస్‌ఎన్‌ఎల్ హోమ్ వై-ఫై పేరుతో కొత్త రీఛార్జ్ వై-ఫై ప్లాన్ ప్రారంభించింది. ఈ ప్లాన్ వ్యాలిడిటీ మూడు నెలలు ఉంటుంది. దీని ధర కేవలం రూ.1099 మాత్రమే. ఈ మూడు నెలల పాపటు 1400 జేబీ హైస్పీడ్ డేటా పొందవచ్చు. 40 ఎంబీపీఎస్ స్పీడ్‌తో ఇంటర్నెట్ ఉపయోగించుకోవచ్చు. ఇక ఈ ప్లాన్‌లో అన్ లిమిటెడ్ కాల్స్ కూడా పొందవచ్చు. నగరాలు, పట్టణాలు మాత్రమే కాకుండా గ్రామీణ ప్రాంతాల ప్రజలు కూడా ఇబ్బందులు లేకుండా ఇంటర్నెట్ సౌకర్యం పొందవచ్చని బీఎస్‌ఎన్‌ఎల్ తన ఎక్స్ అకౌంట్‌లో పేర్కొంది.
రూ.1కే ఫ్రీడమ్ ప్లాన్
ఇక ఇటీవల బీఎస్‌ఎన్‌ఎల్ రూ.1కే ఫ్రీడమ్ ప్లాన్ ప్రవేశపెట్టింది. కొత్త సిమ్ తీసుకునేవారి కోసం ఈ ప్లాన్ మళ్లీ తీసుకొచ్చింది. ఏప్రిల్ 30వ తేదీ వరకు మాత్రమే ఈ ప్లాన్ అందుబాటులో ఉంటుంది. కొత్తగా బీఎస్‌ఎన్‌ఎల్ సిమ్ తీసుకోవాలనుకునేవారికి ఈ ఆఫర్ వర్తిస్తుంది. బీఎస్‌ఎన్‌ఎల్ సర్వీస్ సెంటర్లు లేదా రిటైలర్ల ద్వారా ఈ ఆఫర్ పొందవ్చు. ఫ్రీడమ్ ప్లాన్ వివరాల్లోకి వెళ్తే.. రూ.1కే సిమ్ లభిస్తుంది. నెలల రోజుల పాటు అన్ లిమిటెడ్ కాల్స్, రోజు 2జీబీ డేటా పొందవచ్చు. ఇక రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌ల సౌకర్యం ఉంటుంది.
