AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

లారెన్స్‌తో ఉన్న ఈ బుడ్డోడిని గుర్తు పట్టారా? ఇప్పుడు తెలుగులో హీరో కమ్ డైరెక్టర్.. ఒక్క సినిమాతోనే సంచలనం

ఈ హీరోకు సరిగ్గా 25 ఏళ్లు కూడా లేవు. అయినా హీరోగా, డైరెక్టర్ గా, ప్లే బ్యాక్ సింగర్ గా, మ్యూజిక్ కంపోజర్ గా సత్తా చాటుతున్నాడు. ఇటీవల అతను హీరోగా నటించిన ఒక సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది.

లారెన్స్‌తో ఉన్న ఈ బుడ్డోడిని గుర్తు పట్టారా? ఇప్పుడు తెలుగులో హీరో కమ్ డైరెక్టర్.. ఒక్క సినిమాతోనే సంచలనం
Actor Ken Karunas
Basha Shek
|

Updated on: Apr 22, 2026 | 7:48 PM

Share

పై ఫొటోలో రాఘవ లారెన్స్ తో ఉన్న బుడ్డోడిని గుర్తు పట్టారా? ఇతను ఇప్పుడు ఒక ఫేమస్ హీరో. అంతేకాదు డైరెక్టర్ కూడా. ఇంకా సింగర్, మ్యూజిక్ కంపోజర్ కూడా. పట్టుమని 25 ఏళ్లు కూడా లేని ఈ యువకుడు ఇప్పుడు ఇండస్ట్రీలో మల్టీ ట్యాలెంటెడ్ పర్సన్ గా మంచి పాపులారిటీ సొంతం చేసుకున్నాడు. ముఖ్యంగా యూత్ తో ఎనలేని క్రేజ్ సొంతం చేసుకున్నాడు. తండ్రి సినీ వారసత్వాన్ని కొనసాగిస్తూ ఛైల్డ్ ఆర్టిస్టుగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. చిన్నతనంలోనే ధనుష్, విజయ్ సేతుపతి లాంటి స్టార్ హీరోలతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. ముఖ్యంగా ధనుష్ తో కలిసి రెండు సూపర్ హిట్ సినిమాల్లో నటించాడు. కట్ చేస్తే.. ఆ ఛైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు హీరోగా సెన్సేషన్ అయ్యాడు. అది కూడా మొదటి సినిమాతోనే . ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. తన మొదటి మూవీకి తనే దర్శకత్వం వహించాడు. అలాగే లిరిసిస్ట్ గా కూడా చేశాడు. గత నెలలో థియేటర్లలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ సెన్సేషన్ గా నిలిచింది. చాలా తక్కువ బడ్జెట్ తో తెరకెక్కి ఏకంగా రూ. 50 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. తమిళంతో పాటు తెలుగులోనూ సాలిడ్ వసూళ్లు రాబట్టిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో దుమ్మురేపుతోంది.

ఈ పాటికే అర్థమై ఉంటుంది మనం ఎవరి గురించి మాట్లాడుకుంటున్నామో? యస్. పై ఫొటోలో లారెన్స్ తో ఉన్నది మరెవరో కాదు యూత్ మూవీ హీరో కెన్ కరుణాస్. అసురన్, వాతి (తెలుగులో సార్), విడుదలై సినిమాల్లో ఛైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన కెన్ కరుణాస్ కు యూత్ మొదటి సినిమా కావడం గమనార్హం. అయితేనేం తన నటనతో అదరగొట్టేశాడు. ముఖ్యంగా యూత్ కు ఇప్పుడు ఫేవరెట్ గా మారిపోయాడీ హీరో. అన్నట్లు కెన్ కరుణాస్ తండ్రి పేరు కూడా కరుణాస్‌. ఆయన కూడా పలు సినిమాల్లో నటుడిగా, కమెడియన్ గా, సహాయక నటుడిగా మెప్పించాడు. ఇప్పుడు ఆయన సినీ వారసత్వాన్ని కొనసాగిస్తూ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు కెన్ కరుణాస్. యూత్ సినిమా ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. తమిళంతో పాటు తెలుగు తదితర భాషల్లోనూ అందుబాటులో ఉంది. మంచి యూత్ ఫుల్ రొమాంటిక్ మూవీ చూడాలనుకునేవారికి యూత్ ఒక మంచి ఛాయిస్ అని చెప్పుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

నెట్ ఫ్లిక్స్ ట్రెండింగ్ లో యూత్ సినిమా..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
భర్తను లేపేసింది.. అండమాన్‌లో లవర్‌తో ఎంజాయ్.. చివరకు..
భర్తను లేపేసింది.. అండమాన్‌లో లవర్‌తో ఎంజాయ్.. చివరకు..
సైకాలజిస్ట్‌ను సంప్రదిస్తే ఇన్సూరెన్స్ కవర్ చేస్తుందా?
సైకాలజిస్ట్‌ను సంప్రదిస్తే ఇన్సూరెన్స్ కవర్ చేస్తుందా?
సాయంత్రం పూట ఇవి గుప్పెడు తింటే చాలు.. పొట్టలో గుడ్ బ్యాక్టీరియా
సాయంత్రం పూట ఇవి గుప్పెడు తింటే చాలు.. పొట్టలో గుడ్ బ్యాక్టీరియా
అతను చాలా లవ్లీ బాయ్.. ఒక్క ఫోటో దిగడానికి చాలా కష్టపడ్డా
అతను చాలా లవ్లీ బాయ్.. ఒక్క ఫోటో దిగడానికి చాలా కష్టపడ్డా
ఇంద్రకీలాద్రిసై నేడు శ్రీగాయత్రీ దేవి అలంకారంలో అమ్మవారి దర్శనం
ఇంద్రకీలాద్రిసై నేడు శ్రీగాయత్రీ దేవి అలంకారంలో అమ్మవారి దర్శనం
పెద్ద మ‌న‌సులు.. ర‌హ‌దారి విస్త‌ర‌ణ‌కు రూ.కోట్ల స్థ‌లం అప్ప‌గింత‌
పెద్ద మ‌న‌సులు.. ర‌హ‌దారి విస్త‌ర‌ణ‌కు రూ.కోట్ల స్థ‌లం అప్ప‌గింత‌
దీపికా పదుకొణె ప్లేస్‌లోకి కుర్రాళ్ల ఫేవరెట్ హీరోయిన్
దీపికా పదుకొణె ప్లేస్‌లోకి కుర్రాళ్ల ఫేవరెట్ హీరోయిన్
రాష్ట్ర ప్రజలకు ఏపీ సర్కార్ అదిరిపోయే గుడ్‌న్యూస్..
రాష్ట్ర ప్రజలకు ఏపీ సర్కార్ అదిరిపోయే గుడ్‌న్యూస్..
సిమెంట్, కాంక్రీట్ రెండూ ఒక్కటేనా? ఈ రెండింటిల్లో ఏది బెటర్..?
సిమెంట్, కాంక్రీట్ రెండూ ఒక్కటేనా? ఈ రెండింటిల్లో ఏది బెటర్..?
APPSC సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు
APPSC సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు