AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jamuna: నేను క్షమాపణ చెప్పనని తెగేసి చెప్పా.. అప్పుడు ఎన్టీఆర్ పిలిచి ఏమన్నారంటే.?

నటి జమున తన కెరీర్‌లో ఎదుర్కొన్న అతిపెద్ద సవాలు.. ఎన్టీఆర్, ఏఎన్ఆర్‌తో ఏర్పడిన విభేదాలు. తప్పు చేయకుండా క్షమాపణ చెప్పనని భీష్మించుకున్న ఆమె ఆత్మాభిమానం, చివరికి 'గుండమ్మ కథ' సినిమా కోసం పెద్దల సమక్షంలో ఎలా రాజీకి దారితీసిందో ఇప్పుడు తెలుసుకుందామా..

Jamuna: నేను క్షమాపణ చెప్పనని తెగేసి చెప్పా.. అప్పుడు ఎన్టీఆర్ పిలిచి ఏమన్నారంటే.?
Ntr, Anr & Jamuna
Ravi Kiran
|

Updated on: Apr 22, 2026 | 7:49 PM

Share

టాలీవుడ్ ఇండస్ట్రీలో ‘జమున’ అంటేనే ఒక ధైర్యం, ఒక ఆత్మాభిమానం. అందం, అభినయంతో పాటు తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆమె.. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ లాంటి అగ్ర హీరోలతో తలపడిన తీరు నేటికీ ఒక సంచలనమే. సినిమా రంగంలో గొడవలు సహజం, కానీ ఒక హీరోయిన్‌ను మూడు ఏళ్ల పాటు అగ్ర హీరోలు బహిష్కరించడం అనేది అప్పట్లో పెద్ద చర్చకు దారితీసింది. ఈ వివాదం సర్దుమణిగి, ఆమె మళ్ళీ వారితో కలిసి నటించడానికి దారితీసిన పరిస్థితుల గురించి జమున ఒక ఇంటర్వ్యూలో పంచుకున్న విషయాలు ఆసక్తికరంగా ఉన్నాయి. ముఖ్యంగా ‘గుండమ్మ కథ’ సినిమా సమయంలో ఈ రాజీ ప్రయత్నాలు జరిగాయి. అప్పట్లో నిర్మాతలు చక్రపాణి, కె.వి.రెడ్డి జమునని పిలిచి, “నువ్వు పెద్ద నటులకు క్షమాపణ చెబుతూ ఒక లేఖ రాయి, అప్పుడు అంతా సర్దుకుంటుంది” అని సూచించారు. కానీ, ఆత్మాభిమానం గల జమున అందుకు నిరాకరించారు. “నేను ఏ తప్పూ చేయనప్పుడు క్షమాపణ ఎందుకు చెప్పాలి? నాకూ ఆత్మాభిమానం ఉంటుంది కదా” అని ఆమె నిలదీశారు.

చివరికి ఎన్టీఆర్‌తో ముఖాముఖి చర్చలు జరిగాయి. ఆ సమయంలో రామారావు ఎంతో హుందాగా వ్యవహరిస్తూ, “మనం భవిష్యత్తు తరాలకు ఒక మంచి మార్గం చూపాలి, ఇలాంటి చిన్న విషయాలను వదిలేద్దాం” అని సర్దిచెప్పారు. అటు నాగేశ్వరరావు కూడా పాత విషయాలను మర్చిపోయి ఆమెను ఆహ్వానించారు. అలా వారి మధ్య ఉన్న విభేదాలు తొలగిపోయి, తెలుగు సినిమా చరిత్రలో క్లాసిక్ చిత్రమైన ‘గుండమ్మ కథ’ రూపుదిద్దుకుంది. వ్యక్తిగత ఈగోల కంటే కళ గొప్పదని నిరూపించిన ఈ సంఘటన ఇప్పటికీ ఎందరికో ఆదర్శం.

ఇది చదవండి: ప్రామిసరీ నోటు ఉన్నా డబ్బులు ఎగ్గొట్టారా.? ఈ ఒక్క పని చేస్తే చాలు ఇంటికి తిరిగొస్తాయ్..

Follow Us