విజయవాడలోని ట్రైకోవియా హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ క్లినిక్ భారీ మోసానికి పాల్పడింది. బట్టతల చికిత్స పేరుతో లోన్లు ఇప్పిస్తామంటూ వేలాది రూపాయలు వసూలు చేసి, బోర్డు తిప్పేసింది. నాగలక్ష్మి అనే బాధితురాలు తన భర్త చికిత్సకు లోన్ అప్లై చేయించి డబ్బులు తీసుకున్నారని, చికిత్స అడిగితే తప్పించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బాధితులు అధికారులకు ఫిర్యాదు చేశారు.