AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Loan Tips : బంగారంపై రుణం తీసుకుంటున్నారా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి

బ్యాంకులు కూడా బంగారు ఆభరణాలను కుదువ పెట్టుకుని తక్కువ వడ్డీకే రుణాలిస్తాయి. ఎలాంటి పరిమితులు లేకుండా మీ అన్ని అవసరాలను నిర్వహించడానికి మీరు ఈ లోన్‌ని ఉపయోగించవచ్చు. వివాహం, పిల్లల చదువుకు, వైద్య అత్యవసర ఖర్చులకు లేదా కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఇలా ఏ అవసరానికైనా గోల్డ్ లోన్‌ను ఉపయోగించుకోవచ్చు.

Gold Loan Tips : బంగారంపై రుణం తీసుకుంటున్నారా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి
Gold
Nikhil
|

Updated on: Mar 31, 2023 | 4:00 PM

Share

భారతదేశంలో బంగారాన్ని కేవలం పెట్టుబడి మాత్రమే కాకుండా అలంకారానికి కూడా ఎక్కువ మంది కొనుగోలు చేస్తూ ఉంటారు. కష్ట సమయంలో బంగారాన్ని కుదవ పెట్టి లోన్ తీసుకోవచ్చని మధ్యతరగతి వారు బంగారాన్ని కొంటూ ఉంటారు. దీంతో బ్యాంకులు కూడా బంగారు ఆభరణాలను కుదువ పెట్టుకుని తక్కువ వడ్డీకే రుణాలిస్తాయి. ఎలాంటి పరిమితులు లేకుండా మీ అన్ని అవసరాలను నిర్వహించడానికి మీరు ఈ లోన్‌ని ఉపయోగించవచ్చు. వివాహం, పిల్లల చదువుకు, వైద్య అత్యవసర ఖర్చులకు లేదా కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఇలా ఏ అవసరానికైనా గోల్డ్ లోన్‌ను ఉపయోగించుకోవచ్చు. అయితే రుణం తీసుకునే సమయంలో మనం చేసే కొన్ని తప్పులు వడ్డీ రేటుపై ప్రభావాన్ని చూపుతాయి. తద్వారా మనం లోన్ తీర్చే సమయంలో ఎక్కువ డబ్బు చెల్లించాల్సి రావచ్చు. అయితే బంగారు రుణం తీసుకునే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఓ సారి చూద్దాం.

బంగారు ఆభరణాల విలువ

త్వరితగతిన డబ్బు కోసం గోల్డ్ లోన్ అనుకూలమైన ఎంపిక. అయితే మీరు పొందగలిగే లోన్ మొత్తం మీ బంగారం స్వచ్ఛత స్థాయిపై ఆధారపడి ఉంటుంది. చాలా మంది రుణదాతలు 22 క్యారెట్ల బంగారు ఆభరణాలను మాత్రమే అంగీకరిస్తారు. కొన్ని బ్యాంకులు లేదా సంస్థలు బంగారు ఆభరణాలకు బదులుగా గరిష్ట విలువను పొందారని నిర్ధారించుకోవడానికి వారు ఉత్తమమైన క్యారెట్ మీటర్లను ఉపయోగిస్తారు. రుణదాత, లోన్ టు వాల్యూ (ఎల్టీవీ) నిష్పత్తిని బట్టి, మీరు మీ బంగారం విలువలో దాదాపు 75 శాతం వరకూ లోన్ పొందవచ్చు.

వడ్డీ రేటు

గోల్డ్ లోన్ విషయంలో వడ్డీ రేటు పరిగణనలోకి తీసుకోవాల్సిన ముఖ్యమైన అంశం. ఎందుకంటే ఇది మీ బంగారంపై డబ్బు తీసుకునే ఖర్చును నిర్ణయిస్తుంది. గోల్డ్ లోన్ వడ్డీ రేట్లు రుణదాత, లోన్ మొత్తం, లోన్ కాలవ్యవధి వంటి ఇతర అంశాలపై ఆధారపడి మారవచ్చు. గోల్డ్ లోన్ కోసం వడ్డీ రేటు నెలకు 0.83 శాతం నుంచి తక్కువగా ప్రారంభమవుతుంది. మీరు సాధ్యమైనంత తక్కువ వడ్డీకి రుణం పొందాలంటే గోల్డ్ లోన్‌ను ఎంచుకునే ముందు వివిధ రుణదాతలు, వారి వడ్డీ రేట్లను సరిపోల్చడం ముఖ్యం.

ఇవి కూడా చదవండి

రుణదాత మార్కెట్ విశ్వశనీయత

గోల్డ్ లోన్‌లను అందించే అనేక బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు చాలా ఉన్నాయి. అందువల్ల గోల్డ్ లోన్ కోసం అప్లై చేసే ముందు రుణదాత పలుకుబడి, నమ్మదగిన వ్యక్తి అని మీరు నిర్ధారించుకోవాలి. మీరు మీ విలువైన ఆభరణాలను తాకట్టుగా ఉంచుతున్నారు కాబట్టి, రుణదాత విషయలో మార్కెట్ ఎలా ఉంది? అనే అంశంపై అప్రమత్తంగా ఉండాలి. 

అర్హత ప్రమాణాలు, డాక్యుమెంటేషన్

గోల్డ్ లోన్ కోసం అర్హత పారామితులు చాలా సులభంగా ఉంటాయి. గోల్డ్ లోన్ పొందాలనుకునే వారు 21 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న భారతీయ పౌరుడిగా ఉండాలి. అలాగే ప్రాథమిక కేవైసీ పత్రాలను ధ్రువీకరణ కోసం సిద్ధంగా ఉంచుకోవాలి. చాలా సందర్భాలలో మీ లోన్ ఆమోదం పొందడానికి మీ చిరునామా రుజువుతో పాటు ఆధార్ కార్డ్, ఓటర్ ఐడీ కార్డ్, పాస్‌పోర్ట్ లేదా డ్రైవింగ్ లైసెన్స్ వంటి పత్రాలు సరిపోతాయి.

రుణం తిరిగి చెల్లింపు

తిరిగి చెల్లింపు వ్యవధి, ఎంపికలు రుణదాత నుండి రుణదాతకు మారుతూ ఉంటాయి. మీరు గోల్డ్ లోన్‌పై వడ్డీని నెలవారీ, ద్వైమాసిక, త్రైమాసిక, అర్ధ-వార్షిక లేదా వార్షిక ప్రాతిపదికన చెల్లించడానికి ఎంచుకోవచ్చు. మీరు మీ సౌలభ్యం ప్రకారం లోన్ ప్రారంభంలో మొత్తం వడ్డీని చెల్లించడానికి, పదవీకాలం ముగిసే సమయానికి అసలు మొత్తాన్ని తిరిగి చెల్లించడానికి కూడా ఎంచుకోవచ్చు. అదనంగా, మీరు తరచుగా వాయిదాలతో రీపేమెంట్ ప్లాన్‌ని ఎంచుకుంటే మీకు తక్కువ వడ్డీకే రుణం పొందే అవకాశం ఉంటుంది. 

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి