AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BMW R18 Classic Bike: బీఎండబ్ల్యూ నుంచి రూ.24 లక్షల బైక్‌.. ఇందులో అదిరిపోయే ఫీచర్స్‌…

BMW R18 Classic Bike: వాహన రంగంలో బీఎండబ్ల్యూ దూసుకుపోతోంది. ఇందులో కారైనా..బైకైనా.. తనదైన కొత్త ప్రత్యేకతలతో వినియోగదారులను ఆకట్టుకుంటుంది. తాజాగా ఈ సంస్థ ...

BMW R18 Classic Bike: బీఎండబ్ల్యూ నుంచి రూ.24 లక్షల బైక్‌.. ఇందులో అదిరిపోయే ఫీచర్స్‌...
Subhash Goud
|

Updated on: Feb 23, 2021 | 8:32 PM

Share

BMW R18 Classic Bike: వాహన రంగంలో బీఎండబ్ల్యూ దూసుకుపోతోంది. ఇందులో కారైనా..బైకైనా.. తనదైన కొత్త ప్రత్యేకతలతో వినియోగదారులను ఆకట్టుకుంటుంది. తాజాగా ఈ సంస్థ ద్విచక్ర వాహనాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. బీఎండబ్ల్యూ ఆర్‌18 క్లాసిక్‌ పేరిట వచ్చిన ఈ కొత్త బైక్‌ క్రూయిజర్‌ సెగ్మెంట్‌లో సంస్థ తీసుకువచ్చిన రెండో బైక్‌. దీని ధర రూ.24 లక్షలుగా (ఎక్స్‌షోరూం) నిర్ణయించారు. గతంలో తీసుకొచ్చిన ఆర్‌18కు మరిన్ని అధునాతన ఫీచర్లు అందుబాటులోకి తెచ్చింది. ఈ బైక్‌ 1802 సీసీ ట్విన్‌ సిలిండర్‌ ఎయిర్‌ కూల్డ్‌, ఆయిల్‌ కూల్డ్‌ బాక్సర్‌ ఇంజన్‌ను కలిగి ఉంది. ఆరు గేర్లతో వస్తోంది. బైక్‌, ఇంజిన్‌ 3,000 ఆర్‌పీఎం వద్ద 157.57 ఎన్‌ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది.

2000-4000 ఆర్‌పీఎం వద్ద 135.58 ఎన్‌ఎం టార్క్‌ను విడుదల చేస్తుంది. ఇక 4,750 ఆర్‌పీఎం వద్ద 91 హెచ్‌పీ శక్తిని ఉత్పత్తి చేస్తుంది. అతి పెద్ద విండ్‌ స్క్రీన్‌, ప్యాసెంజర్‌ సీట్‌, స్యాడిల్‌ బ్యాగ్స్‌, ఎల్‌ఈడీ అదనపు హెడ్‌లైట్లు, 16 ఇంచ్‌ ఫ్రంట్‌ వీల్‌ దీనిలోకి ప్రత్యేక ఫీచర్లు ఉన్నాయి. అంతేకాకుండా ట్రాక్షన్‌ కంట్రోల్‌, ఇంజిన్‌ బ్రేక్‌ కంట్రోల్‌, హిల్‌ స్టార్ట్‌ కంట్రోల్‌, కీలెస్‌, రైడ్‌ సిస్టం,ఎలక్ట్రానిక్‌ క్రూయిజ్‌ కంట్రోల్‌ అదనపు ఆకర్షణలు ఉన్నాయి. కాగా, పూర్తి నిర్మాణ యూనిట్‌ కింద ఈ బైక్‌లను భారత్‌కు దిగుమతి కానున్నట్లు బీఎండ్ల్యూ ఇండియా ప్రెసిడెంట్‌ విక్రమ్‌ పవా తెలిపారు. ఈ రోజు నుంచే బుకింగ్‌ ప్రారంభమైనట్లు పేర్కొన్నారు.

Also Read:

Airtel Recharge Plans: వావ్‌.. ఎయిర్‌టెల్‌ సూపర్‌ ప్లాన్‌.. రూ. 19తో రీచార్జ్‌ చేసుకుంటే ఎంతసేపైనా మాట్లాడుకోవచ్చు

Gold, Silver Price: మళ్లీ పరుగులు పెడుతున్న బంగారం.. వెండి కూడా అదే దారిలో.. దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో తాజా ధరలు ఇలా

Hero Electric Scooter : పెట్రోల్ చింత వద్దు.. ఎలక్ట్రిక్ స్కూటర్లు ముద్దు.. ఈ వాహనాలపై హీరో బంపర్ ఆఫర్..