Airtel Recharge Plans: వావ్‌.. ఎయిర్‌టెల్‌ సూపర్‌ ప్లాన్‌.. రూ. 19తో రీచార్జ్‌ చేసుకుంటే ఎంతసేపైనా మాట్లాడుకోవచ్చు

Airtel Recharge Plans: ఎయిర్‌టెల్‌ వినియోగదారులకు అతి తక్కువ రీచార్జ్‌ ప్లాన్‌ అందుబాటులోకి తీసుకువచ్చింది. కేవలం రూ.19 మాత్రమే రీచార్జ్‌ చేసుకుంటే ఎంతసేపై...

Airtel Recharge Plans: వావ్‌.. ఎయిర్‌టెల్‌ సూపర్‌ ప్లాన్‌.. రూ. 19తో రీచార్జ్‌ చేసుకుంటే ఎంతసేపైనా మాట్లాడుకోవచ్చు
Follow us
Subhash Goud

|

Updated on: Feb 23, 2021 | 7:55 PM

Airtel Recharge Plans: ఎయిర్‌టెల్‌ వినియోగదారులకు అతి తక్కువ రీచార్జ్‌ ప్లాన్‌ అందుబాటులోకి తీసుకువచ్చింది. కేవలం రూ.19 మాత్రమే రీచార్జ్‌ చేసుకుంటే ఎంతసేపైనా మాట్లాడుకోవచ్చు. అయితే ఎయిర్‌టెల్‌ తాజాగా ఈ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్‌తో రీచార్జ్‌ చేసుకుంటే ఎంతసేపైనా మాట్లాడుకోవచ్చని భారతీయ ఎయిర్‌టెల్‌ తెలిపింది. ప్లాన్‌ వాలిడిటీ కేవలం రెండు రోజులు మాత్రమే. ఎయిర్‌టెల్ ఈ రీచార్జ్ ప్లాన్‌ను ‘ట్రూలీ అన్‌లిమిటెడ్’ కేటగిరి కింద అందిస్తోంది. అంటే ఎంతసేపైనా మాట్లాడుకోవచ్చని అర్థం. మొత్తంమీద రెండు రోజులు వాలిడిటీ అయినా రూ.19కే అన్‌లిమిటెడ్ కాల్స్ అనేది మంచి ప్లానేనని వినియోగదారులు చెప్పుకొంటున్నారు. అంతేకాదు.. 200 ఎంబీ డేటా కూడా వస్తుంది.

కాగా, ఇదే కాకుకుండా ప్రతీనెలా , లేదంటే మూడు నెలలకోసారి రీచార్జ్‌ చేసుకోవడం ఇబ్బందిగా ఉంటే ఒకేసారి సంవత్సరానికి రీచార్జ్‌ చేసుకోవచ్చు కూడా. దీనికి రూ. 2698 ప్లాన్ అందుబాటులో ఉంది. దీని వాలిడిటీ 365 రోజులు. రోజుకు 2 జీబీ డేటా వస్తుంది. దీంతో పాటు… డిస్నీ హాట్‌స్టర్ సబ్‌స్క్రిప్షన్ కూడా ఉచితంగానే లభించనుండడం విశేషం. తమ కొత్త ప్లాన్ వినియోగదారులకు పూర్తి వెసులుబాటుగా ఉంటుందని ఎయిర్‌టెల్ చెబుతోంది.

Also Read: Gold, Silver Price: మళ్లీ పరుగులు పెడుతున్న బంగారం.. వెండి కూడా అదే దారిలో.. దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో తాజా ధరలు ఇలా..