Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Petrol Pump: మోసపోతున్నారు జాగ్రత్త! బంకులో పెట్రోల్ కొట్టించుకునేటప్పుడు ఇవి పాటించండి..

వాహనంలో ఇంధనాన్ని నింపుకొనేటప్పుడు చాలా అప్రమత్తంగా ఉండాలి. కొన్ని చోట్ల మోసాలు, రీడింగ్ లో తేడాలు, నాణ్యత లేని పెట్రోలు పొసే అవకాశం ఉంది. కేవలం మీరు అప్రమత్తంగా ఉంటే ఈ సమస్యలు అన్నింటికీ దూరంగా ఉండవచ్చు. ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా డబ్బులు పోగొట్టుకుంటాం. అయితే కొన్ని చిట్కాలను పాటిస్తే పెట్రోల్ పంపుల వద్ద మోసాల నుంచి బయటపడవచ్చు.

Petrol Pump: మోసపోతున్నారు జాగ్రత్త! బంకులో పెట్రోల్ కొట్టించుకునేటప్పుడు ఇవి పాటించండి..
Petrol Scam
Madhu
|

Updated on: Sep 12, 2024 | 4:18 PM

Share

వాహనం అనేది నేడు ప్రతి ఒక్కరికీ కనీస అవసరంగా మారింది. అవసరం, ఆదాయాన్ని బట్టి ప్రతి ఒక్కరూ మోటారు సైకిళ్ల, కార్లు కొనుగోలు చేసుకుంటున్నారు. అవి పనిచేయాలంటే వాటికి పెట్రోలు లేదా డీజిల్ చాలా అవసరం. వీటితో పాటు లారీలు, వ్యాన్లు, ఇతర రవాణా సాధనాలలో ప్రతి రోజూ పెట్రోలు లేదా డీజిల్ నింపాలి. ఇందుకోసం బంకులకు వెళ్లడం తెలిసిందే. అయితే వాహనంలో ఇంధనాన్ని నింపుకొనేటప్పుడు చాలా అప్రమత్తంగా ఉండాలి. కొన్ని చోట్ల మోసాలు, రీడింగ్ లో తేడాలు, నాణ్యత లేని పెట్రోలు పొసే అవకాశం ఉంది. కేవలం మీరు అప్రమత్తంగా ఉంటే ఈ సమస్యలు అన్నింటికీ దూరంగా ఉండవచ్చు. ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా డబ్బులు పోగొట్టుకుంటాం. అయితే కొన్ని చిట్కాలను పాటిస్తే పెట్రోల్ పంపుల వద్ద మోసాల నుంచి బయటపడవచ్చు. అప్రమత్తంగా వ్యవహరిస్తే అన్ని విధాలా లాభం కలుగుతుంది.

  • ఇంధనం నింపే ముందు పంప్‌ అమరికను గమనించాలి. స్థానిక అధికారుల ధృవీకరించినట్టు సూచించే సీల్, స్టిక్కర్ ను పరిశీలించాలి. సీల్ చేయని పైపు ద్వారా మనకు రీడింగ్ లో సూచించిన దానికంటే తక్కువ ఇంధనం నింపే అవకాశం ఉంటుంది. మీరు వాటిలో వ్యత్యాసాలు, ట్యాంపరింగ్ సంకేతాలను గమనిస్తే స్టేషన్ మేనేజర్ , స్థానిక అధికారులకు నివేదించండి.
  • ఇంధనం నింపే ముందు, తర్వాత పంపులో మీటర్ రీడింగ్‌ను గమనించండి. పంపిన ఇంధనం మొత్తం చూపిన పరిమాణంతో సక్రమంగా ఉందో లేదో నిర్ధారణ చేసుకోండి. డిస్‌ప్లే దూకుతున్నట్లు, అస్థిరంగా ప్రవర్తిస్తున్నట్లు అనిపిస్తే వేరే పంపు కోసం అడగండి.
  • ఇంధన నాణ్యతలో లోపం ఉంటే మీ వాహనం మైలేజ్ తగ్గుతుంది. ఇంజిన్ పనితీరు సక్రమంగా ఉండదు. ఇలాంటివి గమనిస్తే చాలా జాగ్రత్తగా ఉండాలి.
  • ఒక్కోసారి కొన్ని బంకుల వద్ద పెట్రోలు ధర తక్కువగా ఉండవచ్చు. సమీపంలోని స్టేషన్ల కంటే తక్కువకు వారు ఆఫర్ చేయవచ్చు. వాటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇవి మోసపూరిత మార్గాల ద్వారా కస్టమర్లను ఆకర్షించడానికి వేసే ఎత్తులు కావచ్చు.
  • ఇంధనం నింపే వ్యక్తి చర్యలను నిశితంగా పరిశీలించండి. సరైన అనుమతి లేకుండా వారు పంప్‌ను ట్యాంపర్ చేయకూడదు, మీటర్‌ను సర్దుబాటు చేయకూడదు. అనుమానాస్పద ప్రవర్తనను గమనించినట్లయితే అప్రమత్తంగా ఉండాలి.
  • ఇంధనం నింపుకొన్న తర్వాత రశీదును తీసుకోండి. ఏవైనా వ్యత్యాసాలు వచ్చినప్పుడు ఆ రశీదు చాలా బాగా ఉపయోగపడుతుంది.
  • బంకులలో మోసాలు, అనుమానాస్పద వ్యవహారాలు కనిపిస్తే వెంటనే స్టేషన్ నిర్వహణ, స్థానిక వినియోగదారుల రక్షణ ఏజెన్సీలకు తెలియజేయండి.
  • సాధారణ పెట్రోల్ పంప్ స్కామ్‌లపై అవగాహన కలిగి ఉండాలి. అప్పుడే మీరు ఏదైనా మోసం జరుగుతుంటే గుర్తించగలరు.
  • ఇంధనం ధర ఎక్కువగా ఉంటుంది. అలాగే బంకులలో అనేక మోసాలు జరుగుతున్నాయి. కాబట్టి వాహన చోదకులు, కార్ల డ్రైవర్లు అప్రమత్తంగా ఉండాలి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

IND vs ENG 4th Test: కరుణ్ నాయర్ ఔట్.. గిల్ బెస్ట్ ఫ్రెండ్ ఇన్..
IND vs ENG 4th Test: కరుణ్ నాయర్ ఔట్.. గిల్ బెస్ట్ ఫ్రెండ్ ఇన్..
ఇదేందయ్యా ఇది.. యాడా చూడలే.. రోడ్డు మధ్య కరెంట్ పోల్స్..
ఇదేందయ్యా ఇది.. యాడా చూడలే.. రోడ్డు మధ్య కరెంట్ పోల్స్..
అందాల లక్క బొమ్మలకు మరో అరుదైన గౌరవం.. ప్రతిష్టాత్మక అవార్డు
అందాల లక్క బొమ్మలకు మరో అరుదైన గౌరవం.. ప్రతిష్టాత్మక అవార్డు
బ్యాక్‌ బెంచర్స్‌ అనే పదం ఇక చరిత్రే.. ఆ స్కూల్‌లో నయా విప్లవం!
బ్యాక్‌ బెంచర్స్‌ అనే పదం ఇక చరిత్రే.. ఆ స్కూల్‌లో నయా విప్లవం!
ముఖానికి రోజూ పెరుగు రాస్తే..మచ్చల్లేని అందమైన ముఖం మీ సొంతం!
ముఖానికి రోజూ పెరుగు రాస్తే..మచ్చల్లేని అందమైన ముఖం మీ సొంతం!
తల్లిదండ్రులకు బిగ్ అప్డేట్.. ఇలా చేయకపోతే మీ పిల్లల ఆధార్ రద్దు
తల్లిదండ్రులకు బిగ్ అప్డేట్.. ఇలా చేయకపోతే మీ పిల్లల ఆధార్ రద్దు
ఇన్‌స్టాలో 5 హిల్ స్టేషన్లు హల్చల్.. ఢిల్లీ చేరువలో స్వర్గధామాలు.
ఇన్‌స్టాలో 5 హిల్ స్టేషన్లు హల్చల్.. ఢిల్లీ చేరువలో స్వర్గధామాలు.
కేంద్ర క్రీడాశాఖ మంత్రితో సీఎం చంద్రబాబు కీలక సమావేశం!
కేంద్ర క్రీడాశాఖ మంత్రితో సీఎం చంద్రబాబు కీలక సమావేశం!
ప్రేమలో పడిన టాలీవుడ్ హీరోయిన్..
ప్రేమలో పడిన టాలీవుడ్ హీరోయిన్..
మేక పాలు మాకొద్దని దూరం పెడుతున్నారా.?ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే
మేక పాలు మాకొద్దని దూరం పెడుతున్నారా.?ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే