Home Loan: ఈ బ్యాంకుల్లో వడ్డీ రేట్లు తక్కువ.. గృహ రుణాల కోసం ఇక్కడ ట్రై చేయండి..
ఒక్కో బ్యాంకులో ఒక్కోలా ఉంటాయి. అందుకే లోన్లు తీసుకునే ముందే ఏ బ్యాంకులో తక్కువ వడ్డీ ఉందో తెలుసుకోవాలి. ఏ బ్యాంకులో నిబంధనలు సులభంగా ఉన్నాయి. ప్రాసెసింగ్ చార్జీల వంటి అంశాలను పరిశీలించుకోవాలి. ఈ కాగా ఇటీవల దేశంలోని ప్రధాన పబ్లిక్ రంగ బ్యాంకులు తమ హోమ్ లోన్ వడ్డీ రేట్లను సవరించాయి. ఏ బ్యాంకులో ఎంత వడ్డీ రేటు ఉందో ఇప్పుడు తెలుసుకుందాం..
సొంత ఇల్లు అనేది ప్రతి ఒక్కరి కల. దాని కోసం జీవితాంతం శ్రమించే వారు ఉంటారు. అయినప్పటికీ అది సాధ్యం కాక నిరుత్సాహ పడేవారు ఉంటారు. అయితే కష్టసాధ్యమైన సొంతింటి కలను సాకారం చేసుకునేందుకు ఉపకరిస్తుంది గృహ రుణం. ఇటీవల కాలంలో ఇల్లు నిర్మించుకునేవారు, ఉన్న ఇంటిని ఆధునికీకరించుకునే వారు ఎక్కువగా ఈ హోమ్ లోన్లను తీసుకుంటున్నారు. వీటి వడ్డీ రేట్లు కూడా తక్కువగానే ఉండటంతో పాటు బ్యాంకర్లు కూడా సులభంగా ఈ లోన్లను మంజూరు చేస్తున్నాయి. అయితే వీటి వడ్డీ రేట్లు అన్ని బ్యాంకుల్లో ఒకేలా ఉండవు. ఒక్కో బ్యాంకులో ఒక్కోలా ఉంటాయి. అందుకే లోన్లు తీసుకునే ముందే ఏ బ్యాంకులో తక్కువ వడ్డీ ఉందో తెలుసుకోవాలి. ఏ బ్యాంకులో నిబంధనలు సులభంగా ఉన్నాయి. ప్రాసెసింగ్ చార్జీల వంటి అంశాలను పరిశీలించుకోవాలి. ఈ కాగా ఇటీవల దేశంలోని ప్రధాన పబ్లిక్ రంగ బ్యాంకులు తమ హోమ్ లోన్ వడ్డీ రేట్లను సవరించాయి. ఏ బ్యాంకులో ఎంత వడ్డీ రేటు ఉందో ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ బ్యాంకులు బెస్ట్..
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆగస్ట్ 8న జరిగిన పాలసీ సమీక్షలో వరుసగా తొమ్మిదోసారి వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచింది. దీంతో రుణగ్రహీతలు ఇప్పుడు పోటీతత్వ హెూమ్ లోన్ ఎంపికల కోసం చూస్తున్నారు. అనేక ప్రభుత్వ రంగ బ్యాంకులు ఆకర్షణీయమైన వడ్డీ రేట్లను అందిస్తున్నాయి. ముఖ్యంగా 20 సంవత్సరాల కాలపరిమితితో రూ. 50 లక్షల నుంచి రూ. 80 లక్షల వరకు రుణాన్ని అందజేస్తున్నాయి. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర అత్యంత సరసమైన గృహ రుణాలను అందిస్తున్నాయ., వడ్డీ రేట్లు 8.35 శాతం నుంచి ప్రారంభమవుతాయి. 20 ఏళ్లలో రూ. 75 లక్షల రుణం కోసం, నెలవారీ ఈఎంఐ రూ. 64,376 అవుతుంది. బడ్జెట్ అనుకూలమైన రీపేమెంట్ ఆప్షన్ల కోసం వెతుకుతున్న వారికి ఈ బ్యాంకులు బెస్ట్ ఆప్షన్ గా నిలుస్తున్నాయి.
మరో ఆరు ప్రభుత్వ రంగ బ్యాంకులు – బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ – 8.40 శాతం నుంచి గృహ రుణాలను అందిస్తాయి. రూ. 75 లక్షల లోన్ కోసం, నెలవారీ ఈఎంఐ సుమారు రూ. 64,613గా ఉంటుంది.
అలాగే యూకో బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హోమ్ లోన్లను 8.45శాతం వడ్డీ రేట్ల నుంచి ప్రారంభింస్తున్నాయి. వీటిల్లో ఈఎంఐ రూ. 75లక్షల లోన్, 20 ఏళ్ల కాలపరిమితికి రూ. 64,850 భారతదేశపు అతి పెద్ద బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ), 8.50 శాతం నుంచి గృహ రుణాలను అందిస్తోంది. రూ. 75 లక్షల రుణం కోసం ఈఎంఐ 20 సంవత్సరాల కాలవ్యవధికి దాదాపు రూ.65,087 అవుతుంది. ఈ వడ్డీ రేట్లు ఆగస్టు 27 నాటికి ప్రతి బ్యాంకు వద్ద అందుబాటులో ఉన్న రేట్ల ఆధారంగా ఇస్తున్నాం. అయితే ఇప్పుడు ఇవి మారవచ్చు. కాబట్టి రుణగ్రహీతలు తాజా సమాచారం కోసం బ్యాంకులను సంప్రదించాలి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..