Home Loan: హోమ్‌ లోన్‌ తీసుకోవాలనుకుంటున్నారా.? తక్కువ వడ్డీకి రుణం ఇచ్చే బ్యాంకులివే..

బ్యాంకుల మధ్య పెరిగిన పోటీ నేపథ్యంలో వడ్డీ రేట్లను కూడా బాగా తగ్గిస్తూ వస్తున్నారు. సులభమైన వాయిదాల్లో లోన్‌ను చెల్లించే వెసులుబాటు కల్పించడంతో హోమ్‌ లోన్స్‌కు డిమాండ్ పెరుగుతోంది. ఎక్కువ కాలం వాయిదాలను ఎంపిక చేసుకొని తక్కువ మొత్తంలో ఈఎమ్‌ఐ చెల్లించేలా బ్యాంకులు అవకాశం కల్పిస్తున్నాయి. మరి మీరు కూడా ప్రస్తుతం హోన్‌ లోన్‌ తీసుకోవాలని చూస్తుంటే. తక్కువ వడ్డీ రేటుకే హోమ్‌ లోన్స్‌ని...

Home Loan: హోమ్‌ లోన్‌ తీసుకోవాలనుకుంటున్నారా.? తక్కువ వడ్డీకి రుణం ఇచ్చే బ్యాంకులివే..
Home Loan
Follow us
Narender Vaitla

| Edited By: Janardhan Veluru

Updated on: Nov 13, 2023 | 7:39 AM

సొంతింటి కలను నిజం చేసుకోవాలనే కోరిక ప్రతీ ఒక్కరికీ ఉంటుంది. అందుకోసం ఎన్నో ఏళ్లు కృషి చేస్తుంటారు. సంపాదించినదాంట్లో కొంత మొత్తాన్ని దాచుకుంటూ ఇంటి నిర్మాణం చేపడుతుంటారు. ఇక బ్యాంకింగ్‌ రంగం విస్తరించడం, బ్యాంకులు తక్కువ వడ్డీకే రుణాలు అందిస్తుండడంతో చాలా మంది హోమ్‌ లోన్స్‌ తీసుకుంటూ తమ సొంతింటి కలను నిజం చేసుకుంటున్నారు.

బ్యాంకుల మధ్య పెరిగిన పోటీ నేపథ్యంలో వడ్డీ రేట్లను కూడా బాగా తగ్గిస్తూ వస్తున్నారు. సులభమైన వాయిదాల్లో లోన్‌ను చెల్లించే వెసులుబాటు కల్పించడంతో హోమ్‌ లోన్స్‌కు డిమాండ్ పెరుగుతోంది. ఎక్కువ కాలం వాయిదాలను ఎంపిక చేసుకొని తక్కువ మొత్తంలో ఈఎమ్‌ఐ చెల్లించేలా బ్యాంకులు అవకాశం కల్పిస్తున్నాయి. మరి మీరు కూడా ప్రస్తుతం హోన్‌ లోన్‌ తీసుకోవాలని చూస్తుంటే. తక్కువ వడ్డీ రేటుకే హోమ్‌ లోన్స్‌ని అందిస్తున్న కొన్ని బ్యాంకులకు సంబంధించిన వివరాలు మీకోసం..

* దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్‌ అయిన స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా.. ప్రస్తుతం హోమ్‌ లోన్స్‌పై 8.40 శాతం నుంచి వడ్డీ రేట్లను అందిస్తోంది. ఇక హోమ్‌ లోన్స్‌పై 0.17 శాతం ప్రాసెసింగ్ ఫీజును వసూలు చేస్తుంది. ఇక హౌసింగ్ లోన్స్‌పై ఎస్‌బీఐ బ్యాంక్‌ వడ్డీపై 60 బేసిస్‌ పాయింట్ల తగ్గింపును అందిస్తుంది. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఈ ఆఫర్‌ను డిసెంబర్ 31వ తేదీ వరకు అందుబాటులో ఉంచనుంది.

* బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా ప్రస్తుతం హోమ్‌ లోన్స్‌పై 8.60 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. హోమ్‌ లోన్స్‌పై 0.50 ప్రాసెసింగ్ ఫీజును కూడా వసూలు చేస్తున్నారు. ప్రాసెసింగ్ ఫీజు గరిష్టంగా రూ. 25,000 వరకు ఉంటుంది. ఇక వడ్డీ రేట్లు కస్టమర్ సిబిల్ స్కోర్‌పై ఆధారపడి ఉంటుంది. సిబిల్ స్కోర్ 750 పాయింట్స్‌ కంటే ఎక్కువగా ఉంటే.. వడ్డీ రేటు 8.60 శాతంగా ఉంటుంది. సిబిల్‌ 750 కంటే తక్కువ ఉంటే వడ్డీ రేటు పెరుగుతుంది.

* ఇక ప్రభుత్వ రంగ బ్యాంకులకు పోటీగా ప్రైవేట్ సంస్థలు సైతం తక్కువ వడ్డీకే రుణాలు అందిస్తున్నాయి. దేశంలో అతిపెద్ద ప్రైవేట్‌ రంగ బ్యాంక్‌ అయిన ఐసీఐసీఐ బ్యాంక్‌ హోమ్‌ లోన్స్‌ని 9 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. సిబిల్‌ స్కోర్‌ 750 నుంచి 800 వరకు ఉన్న వారికే ఈ వడ్డీ రేటు వర్తిస్తుంది. ఇంతకంటే సిబిల్ తక్కువ ఉంటే.. వడ్డీ రేటు 9.25 శాతంగా ఉంటుంది.

* ఇండియన్‌ బ్యాంక్‌ ప్రస్తుతం హోమ్‌ లోన్స్‌పై 8,50 శాతం నుంచి 9.90 శాతం వరకు వడ్డీని అందిస్తోంది. అలాగే హోమ్ లోన్స్ పై 0.23 శాతం ప్రాసెసింగ్ ఫీజును బ్యాంకు వసూలు చేస్తుంది. అయితే సిబిల్ స్కోర్ ఆధారంగా వడ్డీ రేటు మారుతుంది. సిబిల్‌ స్కోర్‌ ఆధారంగా వడ్డీ రేట్లలో మార్పు ఉంటుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..

జాతకంలో గురు దోషమా.. గురువారం ఈ పరిహారాలు చేసి చూడండి..
జాతకంలో గురు దోషమా.. గురువారం ఈ పరిహారాలు చేసి చూడండి..
ఇంటర్‌ పరీక్షల ఫీజు తుది గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
ఇంటర్‌ పరీక్షల ఫీజు తుది గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
ట్రావిస్ హెడ్ 2.0.. భారత బౌలర్ల బెండ్ తీసిన 19 ఏళ్ల కుర్రాడు
ట్రావిస్ హెడ్ 2.0.. భారత బౌలర్ల బెండ్ తీసిన 19 ఏళ్ల కుర్రాడు
ఇవాళ సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీ
ఇవాళ సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీ
మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..