Gold Price: పండుగ వేళ దిగివచ్చిన పసిడి, వెండి ధరలు.. గ్రాముపై ఎంత తగ్గిందంటే..

బంగారం కొనేందుకు ప్రతి ఒక్కరూ ఆసక్తిచూపిస్తారు. అందున పండుగలు ఏవైనా ప్రత్యేక రోజులు వస్తే చాలు ఎగబడి కొనుగోలు చేస్తారు. అయితే పండుగ వేళ పసిడి ధరలు కాస్త తగ్గుముఖం పట్టడం కొనుగోలు దారుల్లో ఆశలు చిగురించేలా చేస్తోంది. దీపావళి సందర్భంగా బంగారం ధరలు కాస్త క్షీణించాయి. ద్రవ్యోల్భణంతో పాటూ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ గోల్డ్ రిజర్వ్‌ వడ్డీరేట్లలో వచ్చిన హెచ్చుతగ్గుల కారణంగా స్వల్ప ఊరట కలిగింది.

Gold Price: పండుగ వేళ దిగివచ్చిన పసిడి, వెండి ధరలు.. గ్రాముపై ఎంత తగ్గిందంటే..
Gold Price Today
Follow us
Srikar T

|

Updated on: Nov 13, 2023 | 7:21 AM

బంగారం కొనేందుకు ప్రతి ఒక్కరూ ఆసక్తిచూపిస్తారు. అందున పండుగలు ఏవైనా ప్రత్యేక రోజులు వస్తే చాలు ఎగబడి కొనుగోలు చేస్తారు. అయితే పండుగ వేళ పసిడి ధరలు కాస్త తగ్గుముఖం పట్టడం కొనుగోలు దారుల్లో ఆశలు చిగురించేలా చేస్తోంది. దీపావళి సందర్భంగా బంగారం ధరలు కాస్త క్షీణించాయి. ద్రవ్యోల్భణంతో పాటూ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ గోల్డ్ రిజర్వ్‌ వడ్డీరేట్లలో వచ్చిన హెచ్చుతగ్గుల కారణంగా స్వల్ప ఊరట కలిగింది. అలాగే అంతర్జాతీయ మార్కెట్లో పెట్టుబడులపై కాస్త హెచ్చుతగ్గులు కనిపించాయి. దీని ప్రభావం బంగారు ధరలపై పడింది.

ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో ఈరోజు 10గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 60,590 కాగా 10గ్రాములు 22 క్యారెట్ల పసిడి ధర రూ. 55,540 గా కొనసాగుతోంది. నిన్న ఇదే 10గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 60,630 పలుకగా 10గ్రాములు 22 క్యారెట్ల పసిడి ధర రూ. 55,550 వద్ద కొనసాగింది. నవంబర్ మొదటి వారం ప్రధమార్థంలో 10పాయింట్లు పెరిగినప్పటికీ వారం చివరలో భారీగా పడిపోయాయి. అదే రెండవ వారం విషయానికొస్తే వారం మొదట్లో 30పాయింట్లు పెరిగినప్పటికీ ప్రస్తుతం బంగారం ధర తగ్గుతూ వస్తోంది. వెండి ధరల్లో ఎలాంటి పెరుగుదల కనిపించడం లేదు. నవంబర్ మొదటి వారంలో కిలో వెండి ధర రూ. 77,000 కాగా రెండవ వారంలో 76,000 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. హైదరాబాద్‌లో ఈరోజు కూడా ఇదే ధరలు కొనసాగే అవకాశం ఉందని చెబుతున్నారు మార్కెట్ నిపుణులు.

దేశవ్యాప్తంగా బంగారం ధరలు

10గ్రాముల 24 క్యారెట్స్ పసిడి..

ఇవి కూడా చదవండి
  • హైదరాబాద్..రూ. 60,590
  • విజయవాడ..రూ. 60,590
  • బెంగళూరు..రూ. 60,590
  • ఢిల్లీ..రూ. 60,740
  • ముంబాయి..రూ. 60,590

10గ్రాముల 22 క్యారెట్ పసిడి..

  • హైదరాబాద్..రూ. 55,540
  • విజయవాడ..రూ. 55,540
  • బెంగళూరు..55,540
  • ఢిల్లీ..రూ. 55,690
  • ముంబాయి..రూ. 55,540

స్టాక్ మార్కెట్ ఇలా..

దీపావళి దేశవ్యాప్తంగా వెలుగులు నింపింది. దీని ప్రభావం బంగారం, వెండి ధరలపై మాత్రమే కాకుండా.. స్టాక్ మార్కెట్లపై కూడా దీపావళి శోభ కనిపించింది. మంచి లాభాల పంట పండింది. దలాల్ స్ట్రీట్‌లో తక్కువ ధరలకే షేర్లు అందుబాటులో ఉండటంతో కొనుగోలుదారులు అందులో పెట్టుబడులు పెట్టారు. దీని ప్రభావంతో బిజినెస్ స్టాక్ ఎక్స్‌ఛేంజ్‌లోని లిస్టెడ్ కంపెనీలు లాభాల బాట పట్టాయి. దీంతో ఇన్వెస్టర్ల సంపద అమాంతం పెరిగిపోయింది. రూ. 2లక్షల కోట్లకుపైగా పెరిగిందని సూచీ తెలుపుతోంది.

నేషనల్ స్టాక్ ఎక్స్‌ఛేంజ్ ముగింపు దశలో 355 పాయింట్ల వద్ద లాభాల్లో కొనసాగింది. నిఫ్టీ 19,500 వద్ద కొనసాగుతోంది. దీంతో అన్ని రంగాలు ఆకుపచ్చ రంగులో మెరిసిపోతున్నాయి. బిఎస్‌ఈ సెన్సెక్స్ 354.77 పాయింట్లు చేరుకుంది. అంటే 0.55 శాతం పెరిగి 65,259.45 వద్దకు చేరుకుంది. దీంతో నేషనల్ స్టాక్ ఎక్స్‌ఛేంజ్ నిఫ్టీ 50 పాయింట్ల ఇండెక్స్ చూచిస్తోంది. దీని ప్రభావంతో 0.52 శాతం పెరిగి 100.20 పాయింట్లు పురోగమించింది. ప్రస్తుతం 19,525.55 వద్దకు చేరుకుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
మీ వాహనంపై చలాన్‌ విధించారో.. లేదో తెలుసుకోవడం ఎలా?
మీ వాహనంపై చలాన్‌ విధించారో.. లేదో తెలుసుకోవడం ఎలా?
అరెరే ఎంతపనైపాయే.. గూగుల్ తల్లి కొంప కొల్లేరు చేసిందిగా.. పాపం.!
అరెరే ఎంతపనైపాయే.. గూగుల్ తల్లి కొంప కొల్లేరు చేసిందిగా.. పాపం.!
ఒకే ఓవర్‌లో 4,4,4,4,4,4.. వామ్మో ఇలా ఉన్నావ్ ఏంది సామీ..!
ఒకే ఓవర్‌లో 4,4,4,4,4,4.. వామ్మో ఇలా ఉన్నావ్ ఏంది సామీ..!
రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. ఆమె పేరు చెబితే పూనకాలే..
రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. ఆమె పేరు చెబితే పూనకాలే..
హిట్‌మ్యాన్, ట్రావిస్ హెడ్ కాదు.. 23 సిక్సర్లతో ఆ క్రికెటర్ తోపు
హిట్‌మ్యాన్, ట్రావిస్ హెడ్ కాదు.. 23 సిక్సర్లతో ఆ క్రికెటర్ తోపు
ఫాదర్ అఫ్ ట్రావిస్ హెడ్ అంటూ ఫుల్లు ట్రోలింగ్..
ఫాదర్ అఫ్ ట్రావిస్ హెడ్ అంటూ ఫుల్లు ట్రోలింగ్..
135 ఏళ్ల తర్వాత సరికొత్త రికార్డు.. డెబ్యూ మ్యాచ్​లోనే..
135 ఏళ్ల తర్వాత సరికొత్త రికార్డు.. డెబ్యూ మ్యాచ్​లోనే..
మీరూ ఈ తప్పు చేస్తున్నారా.? జిరాక్స్ షాపుకెళ్లి ఆ పని మాత్రం..
మీరూ ఈ తప్పు చేస్తున్నారా.? జిరాక్స్ షాపుకెళ్లి ఆ పని మాత్రం..
ఇక 10 నిమిషాల డెలివరీ రంగంలో ఓలా..ఎంత డిస్కౌంట్‌ ఇస్తుందో తెలుసా?
ఇక 10 నిమిషాల డెలివరీ రంగంలో ఓలా..ఎంత డిస్కౌంట్‌ ఇస్తుందో తెలుసా?