Gold Price Today: పండుగ వేళ భారీగా తగ్గిన పసిడి, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో రేట్లు ఎలా ఉన్నాయంటే..?
Gold and Silver Latest Prices: బంగారం, వెండికి ఎప్పుడూ డిమాండే ఉంటుంది. అంతర్జాతీయ పరిణామాల ప్రకారం పసిడి, వెండి ధరల్లో మార్పులు, చేర్పులు చోటుచేసుకుంటాయి. కొన్నిసార్లు ధరలు తగ్గితే.. మరికొన్నిసార్లు పెరుగుతుంటాయి. అయితే, వివాహాది శుభకార్యాలు, పండుగల సమయంలో బంగారం, వెండిని ఎక్కువగా కొనుగోలు చేస్తారు.
Gold and Silver Latest Prices: బంగారం, వెండికి ఎప్పుడూ డిమాండే ఉంటుంది. అంతర్జాతీయ పరిణామాల ప్రకారం పసిడి, వెండి ధరల్లో మార్పులు, చేర్పులు చోటుచేసుకుంటాయి. కొన్నిసార్లు ధరలు తగ్గితే.. మరికొన్నిసార్లు పెరుగుతుంటాయి. అయితే, వివాహాది శుభకార్యాలు, పండుగల సమయంలో బంగారం, వెండిని ఎక్కువగా కొనుగోలు చేస్తారు. ప్రత్యేకించి దీపావళి సమయంలో బంగారం, వెండిని ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు. తాజాగా, దీపావళి పర్వదినాన బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. ఆదివారం (నవంబర్ 12) ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.55,550 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,600 లుగా ఉంది. 22 క్యారెట్ల బంగారంపై రూ.450, 24 క్యారెట్లపై 490 మేర ధర తగ్గింది. వెండి కిలో ధర రూ.1000 మేర తగ్గి.. 73,000 లుగా కొనసాగుతోంది. దేశంలోని ప్రధాన నగరాలు, తెలుగు రాష్ట్రాల్లో పసిడి, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..
ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,700 ఉంటే.. 24 క్యారెట్ల ధర రూ.60,750 గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం రూ.55,550, 24 క్యారెట్ల ధర రూ.60,600, కోల్‌కతాలో 22 క్యారెట్ల ధర రూ.55,550, 24 క్యారెట్లు రూ.60,630, చెన్నైలో 22 క్యారెట్ల ధర రూ.56,000, 24 క్యారెట్ల ధర రూ.60,600, బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,550, 24 క్యారెట్ల ధర రూ.60,630, కేరళలో 22 క్యారెట్ల ధర రూ.55,550, 24 క్యారెట్ల ధర రూ.60,630 గా ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో రేట్లు..
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.55,550 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.60,630 గా ఉంది. విజయవాడ, విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.55,550, 24 క్యారెట్ల ధర రూ.60,630 గా ఉంది.
వెండి ధరలు..
ఢిల్లీలో వెండి కిలో ధర రూ.73,000 గా ఉంది. ముంబైలో రూ.73,000 ఉండగా.. చెన్నైలో రూ.76,000, బెంగళూరులో రూ.72,750 ఉంది.. కేరళలో రూ.76,000, కోల్‌కతాలో రూ.73,000 లుగా ఉంది. హైదరాబాద్‌లో వెండి కిలో ధర రూ.76,000, విజయవాడలో రూ.76,000, విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ.76,000 లుగా ఉంది.
గమనిక.. బంగారం, వెండి ధరలు బులియన్ మార్కెట్ వెబ్‌సైట్‌లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి.. అయితే, ఈ ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు, చేర్పులు జరిగే అవకాశం ఉంటుంది.. కావున, కొనేముందు ఒకసారి బంగారం, వెండి ధరలను పరిశీలించి వెళ్లడం మంచిది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..