E Scooter: ఎలక్ట్రిక్‌ స్కూటర్స్‌ కోసం సెర్చ్‌ చేస్తున్నారా.? రూ. 55 వేలలో స్టన్నింగ్ ఫీచర్స్‌..

ప్రస్తుతం వినియోగదారులకు ఎలక్ట్రిక్‌ వాహనాలపై అభిరుచి పెరుగుతుంది. పెట్రోల్‌ ధరలు రోజురోజుకీ పెరిగిపోవడం, ఎలక్ట్రిక్‌ వాహనాలపై ప్రభుత్వాలు సైతం రాయితీలు ప్రకటిస్తుండడంతో వీటి అమ్మకాలు భారీగా పెరుగుతున్నాయి. ఇక కంపెనీలు సైతం అదిరిపోయే ఆఫర్లతో..

E Scooter: ఎలక్ట్రిక్‌ స్కూటర్స్‌ కోసం సెర్చ్‌ చేస్తున్నారా.? రూ. 55 వేలలో స్టన్నింగ్ ఫీచర్స్‌..
Mini Lithino
Follow us
Narender Vaitla

|

Updated on: Jan 17, 2023 | 1:44 PM

ప్రస్తుతం వినియోగదారులకు ఎలక్ట్రిక్‌ స్కూటర్లపై అభిరుచి పెరుగుతుంది. పెట్రోల్‌ ధరలు రోజురోజుకీ పెరిగిపోవడం, ఎలక్ట్రిక్‌ వాహనాలపై ప్రభుత్వాలు సైతం రాయితీలు ప్రకటిస్తుండడంతో వీటి అమ్మకాలు భారీగా పెరుగుతున్నాయి. ఇక కంపెనీలు సైతం అదిరిపోయే ఆఫర్లతో వాహనాలను మార్కెట్లోకి తీసుకొస్తున్నాయి. ఇలా తక్కువ ధరకు అందుబాటులో ఉన్న స్కూటర్లలో తన్వల్‌ కంపెనీకి చెంది మిని లిథియో ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. తక్కువ ధరలో అధునాతన ఫీచర్లతో ఈ స్కూటర్‌ను తీసుకొచ్చారు. ఇంతకీ ఈ స్కూటర్‌ ధర ఎంత, ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

ఈ స్కూటర్‌ ఎక్స్‌షోరూమ్‌ ప్రైజ్‌ కేవలం రూ. 55 వేలు మాత్రమే ఉంది. ఈ స్కూటర్‌లో 48వీ 26 ఏహెచ్ కెపాసిటీ లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్‌ను అందించారు. అలాగే కంపెనీ ఇందులో బీఎల్‌డీసీ మోటార్‌ను అమర్చింది. 4 నుంచి 5 గంటల్లో బ్యాటరీ ఫుల్‌ అవుతుంది. ఒక్కసారి చార్జింగ్ ఫుల్ చేస్తే.. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ద్వారా 55 నుంచి 70 కిలోమీటర్ల వరకు దూసుకెళ్లొచ్చు. ఎలక్ట్రిక్‌ స్కూటర్‌లో డ్రమ్‌ బ్రేక్స్‌ను అందించడం విశేషం.

ట్యూబ్ లెస్ టైర్లు, హైడ్రాలిక్ సస్పెన్షన్ వంటి ఫీచర్లను అందించారు. ఈ స్కూటర్ ఐదు రకాల రంగుల్లో కస్టమర్లకు అందుబాటులో ఉంది. దీంతో పాటు వెనుక భాగంలో స్ప్రింగ్ బేస్డ్ షాక్ అబ్జార్బర్ సిస్టమ్‌ను అందించారు. డిజిట్ల ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, డిజిటల్ ట్రిప్ మీటర్, డిజిటల్ స్పీడో మీటర్, పుష్ బటన్ స్టార్ట్, ఈబీఎస్, ఎల్ఈడీ లైట్, ఎల్ఈడీ టెయిల్ లైట్, ఎల్ఈడీ టర్న్ సిగ్నల్ల్యాంప్ వంటి ఫీచర్లు ఈ స్కూటర్‌ ప్రత్యేకతలుగా చెప్పొచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..

గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో