AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bank Holidays: ఈ వారంలో నాలుగు రోజులు బ్యాంకులు బంద్‌.. ఏయే రోజుల్లో అంటే..

Bank Holidays: డిసెంబర్ 2025లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 18 బ్యాంకు సెలవులను ప్రకటించింది. వీటిలో చాలా వరకు రాష్ట్రాల వారీగా మారుతూ ఉంటాయి. డిసెంబర్ 25న క్రిస్మస్ కోసం దేశవ్యాప్తంగా బ్యాంకులు మూసి ఉంటాయి. మరికొన్ని సెలవులు కొన్ని నగరాలకు మాత్రమే..

Bank Holidays: ఈ వారంలో నాలుగు రోజులు బ్యాంకులు బంద్‌.. ఏయే రోజుల్లో అంటే..
Subhash Goud
|

Updated on: Dec 07, 2025 | 10:09 AM

Share

Bank Holidays: డిసెంబర్‌లో క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకలతో సహా అనేక సందర్భాలలో బ్యాంకులు మూసి ఉండనున్నాయి. రాబోయే వారం విషయానికొస్తే డిసెంబర్ 8, 14 మధ్య నాలుగు రోజులు బ్యాంకులు మూసి ఉంటాయి. వచ్చే వారం బ్యాంకులు మూసివేసే రోజుల గురించి తెలుసుకుందాం. తద్వారా మన బ్యాంకింగ్ కార్యకలాపాలను తదనుగుణంగా ప్లాన్ చేసుకోవచ్చు.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) సెలవుల జాబితా ప్రకారం.. ప్రతి ఆదివారం, నెలలో రెండవ, నాల్గవ శనివారాల్లో బ్యాంకులు మూసి ఉంటాయి. ఈ సమయాల్లో దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు. ఇంకా ప్రాంతీయ, స్థానిక పండుగల ఆధారంగా రాష్ట్రం నుండి రాష్ట్రానికి బ్యాంకు సెలవులు మారుతూ ఉంటాయి. ఈ రాబోయే వారం శనివారం, ఆదివారం సహా నాలుగు రోజులు బ్యాంకులు మూసి ఉంటాయి. ఈ రెండు బ్యాంకు సెలవులు ప్రాంతం నుండి ప్రాంతానికి మారవచ్చు.

ఇది కూడా చదవండి: Gold Price Today: మళ్లీ అదే జోరు.. భారీగా పెరుగుతున్న బంగారం ధరలు

డిసెంబర్ 9, 12 తేదీలలో ఎక్కడ సెలవు ఉంటుంది?

డిసెంబర్ 9వ తేదీ మంగళవారం కొచ్చి, తిరువనంతపురంలో బ్యాంకులు మూసి ఉంటాయి. ఈ రోజు కేరళలో బ్యాంకులు మూసివేయబడతాయి. 2025 స్థానిక ప్రభుత్వ సంస్థలకు సార్వత్రిక ఎన్నికలు జరగనున్నందున బ్యాంకులకు సెలవు. ఈ రెండు ప్రదేశాలు కాకుండా దేశంలోని మిగిలిన ప్రాంతాలలో మంగళవారం బ్యాంకులు తెరిచి ఉంటాయి. డిసెంబర్ 12వ తేదీ శుక్రవారం మేఘాలయలో బ్యాంకులకు సెలవు ఉంటుంది. పా టోగన్ నెంగ్మింజా సంగ్మా వర్ధంతి సందర్భంగా షిల్లాంగ్‌లో బ్యాంకులకు సెలవు. ఇది కాకుండా శుక్రవారం దేశవ్యాప్తంగా బ్యాంకింగ్ కార్యకలాపాలు యథావిధిగా కొనసాగుతాయి.

ఇది కూడా చదవండి: Anant Ambani Watch: అనంత్ అంబానీ ధరించిన వాచ్ ధర ఎంతో తెలిస్తే మతిపోతుంది!

డిసెంబర్‌లో 18 సెలవులు:

దీని తరువాత సెప్టెంబర్ 13వ తేదీ శనివారం నెలలో రెండవ శనివారం కావడంతో దేశవ్యాప్తంగా బ్యాంకులు మూసి ఉంటాయి. ప్రతి నెలా రెండవ, నాల్గవ శనివారాల్లో బ్యాంకులకు సెలవులు ఇవ్వాలని ఆర్‌బిఐ ఆదేశించింది. అదనంగా ఆదివారాలు కూడా బ్యాంకులకు సెలవు ఉంటుంది.

డిసెంబర్ 2025లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 18 బ్యాంకు సెలవులను ప్రకటించింది. వీటిలో చాలా వరకు రాష్ట్రాల వారీగా మారుతూ ఉంటాయి. డిసెంబర్ 25న క్రిస్మస్ కోసం దేశవ్యాప్తంగా బ్యాంకులు మూసి ఉంటాయి. మరికొన్ని సెలవులు కొన్ని నగరాలకు మాత్రమే వర్తిస్తాయి. బ్రాంచ్‌ను సందర్శించే ముందు స్థానిక సమయాలను తనిఖీ చేయాలని కస్టమర్లకు సూచించారు. ఈ సెలవులు అన్ని రాష్ట్రాలకు వర్తించవని గుర్తించుకోండి. ఆయా ప్రాంతాల పండగలు, ఇతర కార్యక్రమాలను బట్టి ఉండవచ్చు. అందుకే బ్యాంకు పనులకు వెళ్లేవారు ముందస్తుగా సెలవుల సమాచారం తెలుసుకొని వెళ్లడం మంచిది.

ఇది కూడా చదవండి: High Court: భార్య అలా చేయడం క్రూరత్వమే.. హైకోర్టు సంచలన తీర్పు!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఈ వారంలో నాలుగు రోజులు బ్యాంకులు బంద్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఈ వారంలో నాలుగు రోజులు బ్యాంకులు బంద్‌.. ఏయే రోజుల్లో అంటే..
సర్పంచ్ స్థానానికి భార్యభర్తలు ఇద్దరూ నామినేషన్
సర్పంచ్ స్థానానికి భార్యభర్తలు ఇద్దరూ నామినేషన్
ఇతగాడు మాములోడు కాదు.. RTI దరాఖాస్తు పెట్టిన అర్జీదారుడ్ని
ఇతగాడు మాములోడు కాదు.. RTI దరాఖాస్తు పెట్టిన అర్జీదారుడ్ని
అయ్యో.. అమ్మను అనాథలా వదిలేశారు.. ఈ తల్లి కథ తెలిస్తే గుండె..
అయ్యో.. అమ్మను అనాథలా వదిలేశారు.. ఈ తల్లి కథ తెలిస్తే గుండె..
కేక్ ముక్క వద్దన్న రోహిత్ శర్మ.. నవ్వులు పూయించిన హిట్‌మ్యాన్
కేక్ ముక్క వద్దన్న రోహిత్ శర్మ.. నవ్వులు పూయించిన హిట్‌మ్యాన్
అంజీర పండ్లు శాఖాహారమా లేక మాంసాహారమా? తినే ముందు ఇది తెలుసుకోండి
అంజీర పండ్లు శాఖాహారమా లేక మాంసాహారమా? తినే ముందు ఇది తెలుసుకోండి
ప్రభాస్, నానిలాంటి హీరోలతో బ్లాక్ బస్టర్స్ అందుకుంది
ప్రభాస్, నానిలాంటి హీరోలతో బ్లాక్ బస్టర్స్ అందుకుంది
ఫ్లిప్‌కార్ట్ బై బైలో సేల్‌లో హెయిర్‌ డ్రైయర్లపై భారీ డిస్కౌంట్‌
ఫ్లిప్‌కార్ట్ బై బైలో సేల్‌లో హెయిర్‌ డ్రైయర్లపై భారీ డిస్కౌంట్‌
సూర్యకాంతి లేకున్నా ఇంట్లో పెంచదగిన అద్భుతమైన మొక్కలు!
సూర్యకాంతి లేకున్నా ఇంట్లో పెంచదగిన అద్భుతమైన మొక్కలు!
వెనక్కి నడిస్తే ఆరోగ్యంలో ముందడుగు వేసినట్టేనని తెలుసా?
వెనక్కి నడిస్తే ఆరోగ్యంలో ముందడుగు వేసినట్టేనని తెలుసా?