Gold Price Today: మళ్లీ అదే జోరు.. భారీగా పెరుగుతున్న బంగారం ధరలు
Gold Price Today: బంగారం ధర మళ్లీ పరుగులు పెడుతోంది. తగ్గేదిలే అన్నట్లు దూసుకుపోతోంది. గత వారం రోజుల కిందట తగ్గుతూ వచ్చిన బంగారం ధర.. మళ్లీ చుక్కలు చూపిస్తోంది. ఇటీవల కాలంలో తులం బంగారం ధర భారీగానే పెరిగింది. అయితే..

Gold Price Today: బంగారం ధరలు మళ్లీ అదే రోజు కనిపిస్తోంది. గత వారం రోజుల కిందటి వరకు తులం ధర లక్షా 20 వేల వరకు ఉన్న బంగారం ధర.. ఇప్పుడు మళ్లీ లక్షా 30 వేలు దాటేసింది. సామాన్యుడు సైతం గ్రాము ధర కొనలేని పరిస్థితిలో బంగారం ధరలు దూసుకుపోతున్నాయి. అదే దారిలో వెండి కూడా పయనిస్తోంది. ప్రస్తుతం వెండికి డిమాండ్ భారీగా ఉంది. ఎందుకంటే ఎలక్ట్రిక్ వాహనాలు, ఇతర పరికరాలలో వెండిని సైతం ఉపయోగిస్తుండటంతో దాని ధర కూడా భారీగా పెరుగుతోంది. ప్రస్తుతం డిసెంబర్ 7వ తేదీన దేశీయంగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,30,150 ఉండగా, అదే 22 క్యారెట్ల ధర రూ.1,19,300 వద్ద కొనసాగుతోంది. ఇక వెండి విషయానికొస్తే రెండు లక్ష చేరువలో ఉంది. కిలో వెండి ధర రూ.1,90,000 వద్ద కొనసాగుతోంది. ఈ ధరలు ఉదయం 6 గంటలకు నమోదైనవి మాత్రమే. రోజులో పెరగవచ్చు.. తగ్గవచ్చు.. లేదా స్థిరంగా కొనసాగవిచ్చు.
ప్రధాన నగరాల్లో ధరల వివరాలు:
- చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,31,350 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,20,400 ఉంది.
- ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,30,150 ఉండగా, 22 క్యారెట్ల ధర రూ.1,19,300 వద్ద కొనసాగుతోంది.
- ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,30,300, ఉండగా, 22 క్యారెట్ల ధర రూ.1,19,450 ఉంది.
- హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,30,150, ఉండగా, 22 క్యారెట్ల ధర రూ.1,19,300 ఉంది.
- విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,30,150, ఉండగా, 22 క్యారెట్ల ధర రూ.1,19,300 ఉంది.
- బెంగళూరులో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,30,150, ఉండగా, 22 క్యారెట్ల ధర రూ.1,19,300 ఉంది.
- కోల్‌కతాలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,30,150, ఉండగా, 22 క్యారెట్ల ధర రూ.1,19,300 ఉంది.
- కేరళలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,30,150, ఉండగా, 22 క్యారెట్ల ధర రూ.1,19,300 ఉంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




