Anant Ambani Watch: అనంత్ అంబానీ ధరించిన వాచ్ ధర ఎంతో తెలిస్తే మతిపోతుంది!
Anant Ambani Watch: రిచర్డ్ మిల్లే RM 52-04 బ్లూ సఫైర్ ఒకే పీస్‌తో తయారు చేశారు. ఇది చూడటానికి చాలా ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఇక ఐపీఎల్ 2025 వేలం సందర్భంలో నీతా అంబానీ వజ్రాలు, రత్నాలతో కూడిన ఖరీదైన వాచ్ ధరించారు..

Anant Ambani Watch: చేతి గడియారం.. టైమ్ చూపించే పరికరం నుంచి ట్రెండ్, టేస్ట్, టాలెంట్ చూపించే ఆయుధంగా మారిపోయింది. కాస్ట్లీ వాచ్ అంటే సమయం కచ్చితంగా చూపిస్తుందని కాదు, ఆ మనిషి ఎక్కడకు ఎదిగాడో చూపించే స్టేటస్ సింబల్. నేటి రోజుల్లో గడియారం బ్రాండ్ చూసి మనిషి స్థాయిని అంచనా వేయడం అలవాటైపోయింది. చేతికి పెట్టుకునేది “వాచ్” కాదు.. ఇమేజ్ అనే లెవల్‌కు ఎదిగింది. ఒమేగా, రిచర్డ్ మిల్లే, రోలెక్స్, ఆడమార్ పిగ్వెట్ లాంటి చేతిగడియారాల కోసం ఎగబడే పరిస్థితి వచ్చింది. “నాకు టైమ్‌నే కాదు… టైమ్ మీదే కంట్రోల్ ఉంది అని చెప్పడానికి కూడా కొందరు కాస్ట్లీ వాచ్‌ల కోసం ఎగబడతారు. తర్వాత ప్రత్యర్ధుల చేతుల్లో బుక్కవుతుంటారు. అంబానీ కొడుకు పెళ్లి దేశం మొత్తం చూసింది. కానీ సీఈవోల చేతికి బహుమతిగా ఇచ్చిన వాచ్ మాత్రం ప్రపంచంలోనే టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచింది.
అంబానీ వాచీలు:
“ఇది వాచ్‌నా? లేక చిన్న బంగారు భవనమా?”అనేంతగా మిరిమిట్లు గొలిపే వజ్రవైఢూర్యాలు పొదిగిన గడియారాలను గిప్ట్‌గా ఇచ్చి అతిధులను ఆనందపరిచింది అంబానీ కుటుంబం. అనంత్ అంబానీ తన స్నేహితులకు అడ్మర్స్ పిగెట్ లిమిటెడ్ వాచీలను బహుమతిగా ఇచ్చాడు. ఒక్కో వాచ్ ధర దాదాపు 2 కోట్లకు పైమాటే. పెళ్లి వేడుకలో అనంత్ స్వయంగా పటేక్ పిలిఫ్ వంటి బ్రాండ్ వాచీలను ధరించాడు. అనంత్ అంబానీ ధరించిన వాచ్ ధర ఎంతో తెలుసా? ఏకంగా రూ. 22 కోట్లు ఉంటుందట. ఇది ది రిచర్డ్ మిల్లే RM 52-04 స్కల్ బ్లూ సఫైర్. ప్రపంచంలోనే అత్యంత అరుదైన వాచీలలో ఇదొకటి. ఇలాంటివి ప్రపంచంలో కేవలం మూడు మాత్రమే ఉన్నాయట. ఇలాంటి వాచే రష్యా అధ్యక్షుడు ‘వ్లాదిమిర్ పుతిన్’ ప్రెస్ సెక్రటరీ ‘డిమిత్రి పెస్కోవ్’ వద్ద కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
రిచర్డ్ మిల్లే RM 52-04 స్కల్ బ్లూ సఫైర్ ప్రత్యేకతలు:
ఒకే పీస్‌తో తయారైన ఈ వాచ్ మధ్య భాగంలో ఒక పుర్రె ఆకారం.. క్రాస్‌బోన్ ఉండటం చూడవచ్చు. దీని కింద వంతెనల లాంటి నిర్మాణాలను చూడవచ్చు. ఇవన్నీ ఖరీదైన మెటల్‌తో రూపొందించడం వల్ల చాలా ప్రత్యేకంగా కనిపిస్తుంది. పేరుకు తగ్గట్టుగానే ఇది నీలం రంగులో ఉంటుంది. ఇది ఐస్ క్యూబ్ మాదిరిగా ఉంటుంది.
రిచర్డ్ మిల్లే RM 52-04 బ్లూ సఫైర్ ఒకే పీస్‌తో తయారు చేశారు. ఇది చూడటానికి చాలా ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఇక ఐపీఎల్ 2025 వేలం సందర్భంలో నీతా అంబానీ వజ్రాలు, రత్నాలతో కూడిన ఖరీదైన వాచ్ ధరించారు. సంపన్నుల ఇళ్లలోనూ, రాజకీయ నేతలకు ముఖ్యమైన కలెక్షన్ పాయింట్‌గా మారింది చేతి గడియారం. వెయ్యిరూపాయల వాచ్ చూపించే టైమే, కోటి రూపాయల వాచ్ కూడా చూపిస్తుంది.
అంతేకాదు ధరించిన గడియారం వార్తల్లోకెళ్తే వాచ్‌కూ పబ్లిసిటీ.. లీడర్‌కూ పబ్లిసిటీనే పెద్ద వ్యాపారవేత్తలు, NRIలు ఇచ్చే “గిఫ్ట్” వాచెస్ వెనుక ఉన్నది టైమ్ కాదు… టైమింగ్. ఇది ఇరువురి మధ్య సంబంధాలు బలపడే వారధిగా ఉంటుందంటారు పరిశీలకులు. సో.. చివరగా ఒక్క మాటలో చెప్పాలంటే.. చేతి గడియారం మనిషికి టైమ్ చూపిస్తుంది. కానీ ఖరీదైన చేతి గడియారం? ఆ మనిషి ఎవరో తెలుసుకునే టైమ్ వచ్చిందని ప్రపంచానికి చెబుతుంది.
View this post on Instagram
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




