స్వల్ప లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు!
దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు స్వల్ప లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 38 పాయింట్ల లాభంతో 37,350 వద్ద, నిఫ్టీ 18 పాయింట్ల లాభంతో 11,047 వద్ద ట్రేడింగ్‌ను ముగించాయి. ప్రభుత్వం పన్ను ఉపసంహరణలపై ఎటువంటి ప్రకటన చేయకపోవడంతో మార్కెట్లు అత్యంత అప్రమత్తంగా ట్రేడ్ అయ్యాయి. చివరి వరకు ఊగిసలాట ధోరణి కనిపించింది. నేటి మార్కెట్లో పవర్ గ్రిడ్, మారుతీ సుజుకీ, యస్‌బ్యాంక్, ఇండస్‌ఇండ్ బ్యాంక్ షేర్లు లాభపడగా.. టీసీఎస్, వేదాంతా, హెచ్‌సీఎల్ టెక్, హెచ్‌డీఎఫ్‌సీ షేర్లు నష్టపోయాయి. […]
దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు స్వల్ప లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 38 పాయింట్ల లాభంతో 37,350 వద్ద, నిఫ్టీ 18 పాయింట్ల లాభంతో 11,047 వద్ద ట్రేడింగ్‌ను ముగించాయి. ప్రభుత్వం పన్ను ఉపసంహరణలపై ఎటువంటి ప్రకటన చేయకపోవడంతో మార్కెట్లు అత్యంత అప్రమత్తంగా ట్రేడ్ అయ్యాయి. చివరి వరకు ఊగిసలాట ధోరణి కనిపించింది. నేటి మార్కెట్లో పవర్ గ్రిడ్, మారుతీ సుజుకీ, యస్‌బ్యాంక్, ఇండస్‌ఇండ్ బ్యాంక్ షేర్లు లాభపడగా.. టీసీఎస్, వేదాంతా, హెచ్‌సీఎల్ టెక్, హెచ్‌డీఎఫ్‌సీ షేర్లు నష్టపోయాయి. ప్రభుత్వ రంగ బ్యాంకుల షేర్లు లాభాల్లో ట్రేడింగ్‌ను ముగించాయి. ఆర్తి ఇండస్ట్రీస్ షేర్లు 8శాతం కుంగాయి. 2020 ఆర్థిక సంవత్సరం ఆదాయం తగ్గవచ్చనే అంచనాలు వెలువడటంతో ఈ మేరకు మార్కెట్లు స్పందించాయి. అపోలో హాస్పటల్స్ షేర్లు 7శాతం లాభపడ్డాయి. దీంతో 52వారాల గరిష్ఠానికి చేరుకొన్నాయి. జూన్ త్రైమాసిక ఫలితాలు బలంగా ఉండటంతో ఈ షేర్లు ర్యాలీ చేసింది. మరోపక్క యూరప్ మార్కెట్లు లాభాల్లో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి.