Banking News: ఈ బ్యాంకుల్లో చౌకైన విద్యా రుణం.. వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయంటే..
దేశంలో వివిధ రకాల రుణాలు పొందాలంటే బ్యాంకుల్లో సులభతరంగా మారుతున్నాయి. మీరు విదేశాలకు వెళ్లేందుకు రుణం కావాలంటే మంచి ఆప్షన్స్ ..
దేశంలో వివిధ రకాల రుణాలు పొందాలంటే బ్యాంకుల్లో సులభతరంగా మారుతున్నాయి. మీరు విదేశాలకు వెళ్లేందుకు రుణం కావాలంటే మంచి ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి. ఒకప్పుడు రుణం కావాలంటే ఎంతో ప్రాసెస్ ఉండేది. కానీ టెక్నాలజీ పెరుగుతున్న కారణంగా రుణాలు తీసుకోవడం సులభతరంగా మారుతున్నాయి. ఇక బ్యాంకుల్లో కూడా కొన్ని నిమిషాల్లోనే రుణాలు పొందే సదుపాయం అందుబాటులో ఉంది. అంతేకాకుండా బ్యాంకుల్లో రుణాలు కావాలంటే తక్కువ వడ్డీతో పొందవచ్చు. వినియోగదారులను దృష్టిలో ఉంచుకుని బ్యాంకులు కూడా తక్కువ వడ్డీకే రుణాలను అందిస్తున్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ),ఇతర ప్రభుత్వ ప్రైవేటు బ్యాంకుల్లో తక్కువ వడ్డీకే రుణాలు తీసుకోవచ్చు. ఇక టెక్నాలజీ పెరుగుతున్న దృష్టి ఇంట్లోనే ఉండి ఆన్‌లైన్‌లో కూడా బంగారం,ఇతర లోన్స్ కోసం దరఖాస్తుచే చేసుకోవచ్చు.
కొన్ని బ్యాంకుల్లో రుణం పొందాలంటే ప్రాసెసింగ్ ఫీజు కూడా ఉండదు. తక్కువ ఖర్చులతోనే రుణాలు పొందే సౌలభ్యం ఉంది. ఎలాంటి లోన్‌పై ఎంత వడ్డీ ఉంటుందోననే విషయాన్ని బ్యాంకుల వెబ్‌సైట్ల ద్వారా తెలుసుకోవచ్చు.
వడ్డీతో పాటు, మీరు ఎడ్యుకేషన్ లోన్ ప్రాసెసింగ్ ఫీజు, లోన్ పొందడానికి అర్హత మొదలైనవాటిని కూడా గుర్తుంచుకోవాలి. ఏ బ్యాంకు ఎంత రేటుకు రుణం ఇస్తుందో తెలుసుకోవడానికి, మీరు ఆ బ్యాంక్ వెబ్‌సైట్‌ని సందర్శించవచ్చు లేదా ఆ బ్యాంక్ బ్రాంచ్‌ని సందర్శించడం ద్వారా సమాచారాన్ని పొందవచ్చు. ఉదాహరణకు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 7.95 నుండి 11.15 శాతానికి, బ్యాంక్ ఆఫ్ బరోడా 8.45 నుండి 10.75 శాతానికి మరియు పంజాబ్ నేషనల్ బ్యాంక్ 8.65 నుండి 11.40 శాతానికి విద్యా రుణాలను అందిస్తోంది.
- స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) ప్రస్తుతం అతి తక్కువ రేటుకు విద్యా రుణాన్ని అందిస్తోంది. ఈ బ్యాంకు వడ్డీ రేటు 7.95 శాతం నుంచి 11.15 శాతం వరకు ఉంటుంది. ఎస్‌బీఐ విద్యార్థులకు రూ.50 లక్షల వరకు విద్యా రుణం ఇస్తోంది. 20 లక్షల వరకు రుణం తీసుకున్నట్లయితే, దానిపై ఎటువంటి ప్రాసెసింగ్ రుసుము విధించబడదు. 20 లక్షలకు పైబడిన రుణాలకు రూ.10,000 ప్రాసెసింగ్ ఫీజు ఉంటుంది. స్కాలర్ లోన్ కోసం ప్రాసెసింగ్ ఫీజు సున్నా. రూ.4 లక్షల వరకు రుణాలకు మార్జిన్ లేదు, రూ.4 లక్షలకు పైబడిన రుణాలకు 5% మార్జిన్ ఉంటుంది. ఎస్‌బిఐ విద్యా రుణం రూ.7.5 లక్షలకు ఎలాంటి సెక్యూరిటీ లేదు. అయితే అంతకంటే ఎక్కువ మొత్తంలో సెక్యూరిటీ ఇవ్వాల్సి ఉంటుంది.
- బ్యాంక్ ఆఫ్ బరోడా: బ్యాంక్ ఆఫ్ బరోడా 8.45 శాతం నుండి 10.75 శాతం వరకు విద్యా రుణాన్ని అందిస్తోంది. ఈ బ్యాంకు ఖాతాదారులకు రూ.1.25 కోట్ల వరకు రుణాలు ఇస్తోంది. రూ. 7.5 లక్షల వరకు రుణాలకు ప్రాసెసింగ్ రుసుము లేదు. అయితే అంతకంటే ఎక్కువ రుణాలకు 1% రుసుము ఉంటుంది. ప్రాసెసింగ్ ఫీజు గరిష్ట మొత్తం రూ. 10,000. రూ. 4 లక్షల వరకు రుణంపై ఎలాంటి మార్జిన్ ఉండదు. అయితే మీరు అంతకంటే ఎక్కువ రుణం తీసుకుంటే, మీరు 5% మార్జిన్ చెల్లించాలి. 4 లక్షల వరకు రుణంపై ఎలాంటి సెక్యూరిటీ లేదు. 4 లక్షల నుంచి 7.5 లక్షల రుణంపై థర్డ్ పార్టీ గ్యారెంటీ అవసరం. 7.5 లక్షలకు పైబడిన రుణాలకు, రుణ మొత్తంలో పావు వంతును సెక్యూరిటీగా డిపాజిట్ చేయాల్సి ఉంటుంది.
- పంజాబ్ నేషనల్ బ్యాంక్: పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఎడ్యుకేషన్ లోన్ వడ్డీ రేటు 8.65 నుండి 11.40 శాతం. రుణ మొత్తంపై పరిమితి లేదు. ఎంత డబ్బు కావాలన్నా రుణంగా తీసుకోవచ్చు. లోన్ మొత్తంలో 1% ప్రాసెసింగ్ ఫీజుగా చెల్లించాలి. 4 లక్షల వరకు రుణాలపై మార్జిన్ లేదు. కానీ 4 లక్షల కంటే ఎక్కువ రుణాలపై 5 శాతం మార్జిన్ ఉంది. 7.5 లక్షల వరకు రుణాలపై ఎలాంటి సెక్యూరిటీ లేదు. అంతకంటే ఎక్కువ భద్రత అవసరం.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి