AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Meta Facebook: ఫేస్‌బుక్‌ ఉద్యోగులకు భారీ షాక్‌ ఇచ్చిన సీఈవో జుకర్ బర్గ్! 11 వేల మందిపై వేటు..

ఫేస్‌బుక్‌ పేరెంట్‌ కంపెనీ మెటాలో పనిచేసే ఉద్యోగులను భారీ సంఖ్యలో తొలగించింది. దాదాపు11 వేల మందిని రోడ్డున పడేసింది. ప్రపంచవ్యాప్తంగా 87 వేల మంది మెటా ఉద్యోగులు ఉండగా వీరిలో దాదాపు 13 శాతం ఉద్యోగాలపై కోత విధించినట్లైంది..

Meta Facebook: ఫేస్‌బుక్‌ ఉద్యోగులకు భారీ షాక్‌ ఇచ్చిన సీఈవో జుకర్ బర్గ్! 11 వేల మందిపై వేటు..
Facebook parent Meta sacks employees
Srilakshmi C
|

Updated on: Nov 09, 2022 | 9:44 PM

Share

ఫేస్‌బుక్‌ పేరెంట్‌ కంపెనీ మెటాలో పనిచేసే ఉద్యోగులను భారీ సంఖ్యలో తొలగించింది. దాదాపు11 వేల మందిని రోడ్డున పడేసింది. ప్రపంచవ్యాప్తంగా 87 వేల మంది మెటా ఉద్యోగులు ఉండగా వీరిలో దాదాపు 13 శాతం ఉద్యోగాలపై కోత విధించినట్లైంది. జాబ్‌ కోల్పోయిన వారికి 16 వారాల ఆదనపు జీతంతోపాటు, కుటుంబ సభ్యులకు 6 నెలలపాటు హెల్త్‌ ఇన్సూరెన్స్‌ ఇవ్వనున్నట్లు మెటా ప్రకటించింది. కాగా 2004లో సంస్థను ప్రారంభించిన తర్వాత ఇంత పెద్ద సంఖ్యలో ఉద్యోగులకు ఉద్వాసన పలకడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. అంతేకాకుండా మునుముందు రాబోయే రోజుల్లో మరిన్ని ఉద్యోగాలకు కోత విధించే అవకాశం ఉన్నట్లు సమాచారం. మెటాలో జాబ్‌ కోల్పోయిన ఉద్యోగులకు ఇమ్మిగ్రేషన్‌ సదుపాయం కల్పించనున్నామని, ఇమ్మిగ్రేషన్‌ స్పెషలిస్టులను సైతం అందుబాటులో ఉంచుతున్నట్లు జుకర్‌ బర్గ్‌ ఈ సందర్భంగా తెలిపారు. పూర్తిగా ఉద్యోగం నుంచి తొలగించే ముందు నోటీస్‌ పీరియడ్‌, వీసా గ్రేస్‌ పీరియడ్‌ ఉంటుంది. ఈ టైంలో ప్లాన్‌ చేసుకోవాలని జుకర్‌బర్గ్‌ సూచించారు.

సాధారణంగా భారత్‌, చైనాల నుంచి హెచ్‌1బి వీసాపై అమెరికాలో ఉద్యోగం చేసేవారి సంఖ్య తక్కువేమీకాదు. హెచ్‌1బి వీసాతో విదేశాల్లో మూడేళ్లపాటు ఉద్యోగం చేయవచ్చు. ఆ తర్వాత మరో మూడేళ్లు పొడిగించుకునేందకు అవకాశం ఉంటుంది. ఉద్యోగాలు కోల్పోయిన వారిలో హెచ్‌1బి వీసాదారులకు 60 రోజులు డెడ్‌లైన్‌ ఉంటుంది. ఈలోగా కొత్త ఉద్యోగాన్ని వెతుక్కుంటే.. ఆ ఉద్యోగం ఇచ్చిన కంపెనీ హెచ్‌1బి వీసాకు స్పాన్సర్‌ చేయాల్సి ఉంటుంది. ఇదంతా 60 రోజుల గ్రేస్‌ పిరియడ్‌లో జరగకపోతే అమెరికా నుంచి వెనుదిరగాల్సి ఉంటుంది. దీంతో ఉద్యోగుల్లో గుబులు నెలకొంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని కెరీర్‌ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

Follow Us
SRH vs RR Result: రాజస్థాన్‌ను చిత్తు చేసిన హైదరాబాద్..
SRH vs RR Result: రాజస్థాన్‌ను చిత్తు చేసిన హైదరాబాద్..
పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేసిన హీరో రామ్ పోతినేని
పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేసిన హీరో రామ్ పోతినేని
వీరింట లక్ష్మీదేవి ఉండదు.. గరుడ పురాణం చెబుతున్న పచ్చి నిజాలివే!
వీరింట లక్ష్మీదేవి ఉండదు.. గరుడ పురాణం చెబుతున్న పచ్చి నిజాలివే!
సీలింగ్ ఫ్యాన్ vs టేబుల్ ఫ్యాన్.. మీ ఇంటికి ఏ ఫ్యాన్ కరెక్ట్?
సీలింగ్ ఫ్యాన్ vs టేబుల్ ఫ్యాన్.. మీ ఇంటికి ఏ ఫ్యాన్ కరెక్ట్?
శుక్రుడి మార్పుతో ఈ రాశుల వారికి లక్ష్మీ కటాక్షం..
శుక్రుడి మార్పుతో ఈ రాశుల వారికి లక్ష్మీ కటాక్షం..
పుట్టినరోజు వేడుకల్లోనే అమెరికాలో యువ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతి
పుట్టినరోజు వేడుకల్లోనే అమెరికాలో యువ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతి
1,W,0,W,0,W.. రాజస్థాన్‌ను వణికించిన సన్‌రైజర్స్ నయా ‘స్పీడ్ గన్
1,W,0,W,0,W.. రాజస్థాన్‌ను వణికించిన సన్‌రైజర్స్ నయా ‘స్పీడ్ గన్
ఆరోగ్యానికి మంచిదని తీసుకునే ఈ ఆహారాల్లోనూ ఉప్పు ఎక్కువగా ఉంటుందట
ఆరోగ్యానికి మంచిదని తీసుకునే ఈ ఆహారాల్లోనూ ఉప్పు ఎక్కువగా ఉంటుందట
మూడింట ఒక వంతు సీట్లు చట్టసభల్లో మహిళలకు దక్కుతాయా?
మూడింట ఒక వంతు సీట్లు చట్టసభల్లో మహిళలకు దక్కుతాయా?
OTTలో ట్రెండ్ అవుతోన్నతెలుగు క్రైమ్ థ్రిల్లర్..IMDBలో 8.3 రేటింగ్
OTTలో ట్రెండ్ అవుతోన్నతెలుగు క్రైమ్ థ్రిల్లర్..IMDBలో 8.3 రేటింగ్