AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bank strike today: నేడు దేశవ్యాప్తంగా బ్యాంకుల సమ్మె.. సర్వీసులపై ఎఫెక్ట్

రాజకీయ ఒత్తిళ్లతోనే కేరళలోని.. 13 మంది బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ యూనియన్ ఆఫీస్ బేరర్లపై బ్యాంక్ ఆఫ్ ఇండియా ఛార్జిషీట్ వేసిందని ఆరోపిస్తూ.. AIBEA సమ్మెకు పిలుపునిచ్చింది. దీంతో బ్యాంకు సర్వీసులు ప్రభావితం అయ్యే అవకాశాలు ఉన్నాయి.

Bank strike today:  నేడు దేశవ్యాప్తంగా బ్యాంకుల సమ్మె.. సర్వీసులపై ఎఫెక్ట్
Bank
Ram Naramaneni
|

Updated on: Aug 28, 2024 | 9:45 AM

Share

ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఈరోజు దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా బ్యాంకింగ్ సేవలు, లావాదేవీలు ప్రభావితం అయ్యే అవకాశాలు ఉన్నాయి. బ్యాంక్ స్టాఫ్ యూనియన్‌లోని పదమూడు మంది ఆఫీస్ బేరర్లపై బ్యాంక్ ఆఫ్ ఇండియా చార్జిషీట్ వేసిన నేపథ్యంలో..  నిరసనగా ఈరోజు AIBEA దేశవ్యాప్తంగా సమ్మెకు పిలుపునిచ్చింది. AIBEA జనరల్ సెక్రటరీ CH వెంకటాచలం, ఈ రోజు బ్యాంక్ సమ్మె గురించి మీడియాకు అప్‌డేట్ ఇచ్చారు.  చార్జిషీట్‌‌లో ఉన్నవారిలో నలుగురు మాజీ సైనికులేనని, వారిలో ముగ్గురు కార్గిల్ యుద్ధంలో పాల్గొన్నారని వెంకటాచలం చెప్పారు. ప్రభుత్వం నుంచి తమ డిమాండ్‌ను ప్రస్తావిస్తూ అసోసియేషన్ పత్రికా ప్రకటనను పంచుకున్నారు.

ఈరోజు బ్యాంకుల సమ్మె ఎందుకు?

బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ యూనియన్-కేరళ 23వ ద్వైవార్షిక సదస్సుకు హాజరైనందుకు పదమూడు మంది అధికారులపై బ్యాంక్ ఆఫ్ ఇండియా చార్జిషీట్ వేసిన నేపథ్యంలో.. నిసరనగా AIBEA దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చింది. బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ యూనియన్ కేరళకు చెందిన 13 మంది ఆఫీస్ బేరర్లకు BOI ఛార్జిషీట్ అందించింది.

నేటి బ్యాంక్ సమ్మెలో యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్, ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్, నేషనల్ కాన్ఫెడరేషన్ ఆఫ్ బ్యాంక్ ఎంప్లాయీస్, బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేటూన్ మొదలైన దాదాపు ఐదు ఇతర బ్యాంక్ యూనియన్‌ల సభ్యులు పాల్గొంటారు.