SBI Personal Loan: మీకు ఎస్‌బీఐలో పర్సనల్‌ లోన్‌ కావాలా..? ఆన్‌లైన్‌లో సులభంగా పొందండిలా..!

SBI Personal Loan: ప్రస్తుతం టెక్నాలజీ పెరిగిపోతున్న నేపథ్యంలో వివిధ రకాల సేవలు ఆన్‌లైన్‌లోనే పొందవచ్చు. ముఖ్యంగా బ్యాంకింగ్‌ రంగంలో ఇంట్లోనే ఉండి..

SBI Personal Loan: మీకు ఎస్‌బీఐలో పర్సనల్‌ లోన్‌ కావాలా..? ఆన్‌లైన్‌లో సులభంగా పొందండిలా..!
Follow us
Subhash Goud

|

Updated on: Dec 13, 2021 | 9:53 PM

SBI Personal Loan: ప్రస్తుతం టెక్నాలజీ పెరిగిపోతున్న నేపథ్యంలో వివిధ రకాల సేవలు ఆన్‌లైన్‌లోనే పొందవచ్చు. ముఖ్యంగా బ్యాంకింగ్‌ రంగంలో ఇంట్లోనే ఉండి బ్యాంకుకు సంబంధించిన వివిధ రకాల సేవలు పొందవచ్చు. ఇక ప్రభుత్వరంగ బ్యాంకు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) వ్యక్తిగత రుణాలపై ప్రత్యేక రాయితీ కల్పించడమే కాకుండా వేగంగా రుణాలు అందించే సదుపాయాన్ని కల్పిస్తోంది. బ్యాంకుకు వెళ్లకుండా ఆన్‌లైన్‌లోనే వ్యక్తిగత రుణాల కోసం దరఖాస్తు చేసుకునే విధంగా సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. లోన్‌ పొందేందుకు ఎలాంటి డాక్యుమెంటేషన్‌ అవసరం లేకుండా ఆన్‌లైన్‌ ద్వారా ప్రీ-అప్రూవ్డ్ పర్సనల్‌ లోన్‌ పొందవచ్చు. వ‌డ్డీరేటు 9.60 శాతం నుంచి ప్రారంభం అవుతుంది. అలాగే రుణం కోసం ప్రాసెసింగ్‌ ఫీజులో కూడా ఆఫర్‌ కల్పిస్తోంది. జనవరి 31, 2022 వరకు ప్రాసెసింగ్‌ ఫీజుల్లో మినహాయింపు కల్పిస్తోంది ఎస్‌బీఐ.

ఇక ఆన్‌లైన్‌లో రుణం కోసం దరఖాస్తు చేసుకోవాలంటే..

► ముందుగా ఎస్‌బీఐ యోనో యాప్‌లోకి లాగిన్ కావాలి.

► ఆ తర్వాత అవైల్ నౌ బ‌ట‌న్‌పై క్లిక్ చేయాలి.

► అందులో రుణం మొత్తం, కాల వ్యవధిని ఎంచుకోవాలి.

► బ్యాంకు అకౌంట్‌కు లింక్‌ చేయబడ్డ మొబైల్‌ నెంబర్‌కు వచ్చిన ఓటీపీని నమోదు చేయాలి.

► కేవలం నాలుగు క్లిక్స్‌తోనే మీ పర్సనల్‌ లోన్‌ పొందేందుకు ప్రాసెసింగ్‌ జరుగుతుంది.

ఇవి కూడా చదవండి:

EPFO Nominee: మీ పీఎఫ్‌ ఖాతాకు నామినీ పేరు చేర్చారా..? గడువు దగ్గర పడుతోంది..!

Post Office: మూడేళ్ల కనిష్టానికి పడిపోయిన పోస్టాఫీసు డిపాజిట్లు, ఇతర చిన్న పొదుపు ఖాతాలు: కేంద్రం వెల్లడి