Star Dhan Vriddhi: ఎఫ్‌డీ పెట్టుబడిదారులకు ఆ బ్యాంకు గుడ్ న్యూస్.. ప్రత్యేక ఎఫ్‌డీ స్కీమ్ ద్వారా బోలెడంత వడ్డీ

భారతదేశంలోని పెట్టుబడిదారులు ప్రాంతంతో సంబంధం లేకుండా ఫిక్స్‌డ్ డిపాజిట్స్‌లో పెట్టుబడికి ఆసక్తి చూపుతూ ఉంటారు. చాలా ఏళ్లుగా బ్యాంకులు నమ్మకంగా ఎఫ్‌డీలపై వడ్డీను చెల్లిస్తుండడంతో రాబడి తక్కువైన పెట్టుబడికి హామీ ఉంటుందనే ఉద్దేశంతో ఎఫ్‌డీల్లో పెట్టుబడికి ముందుకు వస్తున్నారు. అయితే క్రమేపి ప్రజల ఆలోచనా విధానం మార్పులు రావడంతో పాటు ఆర్థిక అక్షరాస్యత పెరగడంతో గత కొన్నేళ్ల నుంచి స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడికి ఆసక్తి చూపుతున్నారు. ఇలా చేసే వారు రోజురోజుకూ ఎక్కువ కావడం వల్ల బ్యాంకుల్లో ఎఫ్‌డీలు చేసే వారి సంఖ్య క్రమంగా తగ్గిపోతుంది.

Star Dhan Vriddhi: ఎఫ్‌డీ పెట్టుబడిదారులకు ఆ బ్యాంకు గుడ్ న్యూస్.. ప్రత్యేక ఎఫ్‌డీ స్కీమ్ ద్వారా బోలెడంత వడ్డీ
Money Astrology
Follow us
Srinu

|

Updated on: Sep 04, 2024 | 7:00 PM

భారతదేశంలోని పెట్టుబడిదారులు ప్రాంతంతో సంబంధం లేకుండా ఫిక్స్‌డ్ డిపాజిట్స్‌లో పెట్టుబడికి ఆసక్తి చూపుతూ ఉంటారు. చాలా ఏళ్లుగా బ్యాంకులు నమ్మకంగా ఎఫ్‌డీలపై వడ్డీను చెల్లిస్తుండడంతో రాబడి తక్కువైన పెట్టుబడికి హామీ ఉంటుందనే ఉద్దేశంతో ఎఫ్‌డీల్లో పెట్టుబడికి ముందుకు వస్తున్నారు. అయితే క్రమేపి ప్రజల ఆలోచనా విధానం మార్పులు రావడంతో పాటు ఆర్థిక అక్షరాస్యత పెరగడంతో గత కొన్నేళ్ల నుంచి స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడికి ఆసక్తి చూపుతున్నారు. ఇలా చేసే వారు రోజురోజుకూ ఎక్కువ కావడం వల్ల బ్యాంకుల్లో ఎఫ్‌డీలు చేసే వారి సంఖ్య క్రమంగా తగ్గిపోతుంది. ఇటీవల బడ్జెట్ ప్రసంగంలో కూడా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ బ్యాంకులు పెట్టుబడిదారులను ఆకర్షించడానికి ప్రత్యేక ఎఫ్‌డీ స్కీమ్‌లను లాంచ్ చేయాలని సూచించారు. దీంతో చాలా బ్యాంకులు ఇప్పటికే ఉన్న ప్రత్యేక ఎఫ్‌డీ స్కీమ్‌లకు పొడగింపు ప్రకటించారు. కొన్ని బ్యాంకులు కొత్తగా ప్రత్యేక ఎఫ్‌డీ స్కీమ్‌లను లాంచ్ తాజాగా ప్రముఖ బ్యాంకు అయిన బ్యాంకు ఆఫ్ ఇండియా స్టార్ ధన్ వృద్ధి పేరుతో ప్రత్యేక ఎఫ్‌డీ స్కీమ్ లాంచ్ చేసింది. ఈ నేపథ్యంలో బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టార్ ధన్‌వృద్ధి స్కీమ్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల రూ. 3 కోట్ల లోపు డిపాజిట్లపై ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను సవరించింది. ఈ అప్‌డేట్‌లో భాగంగా అధిక వడ్డీ రేట్లను అందిస్తూ స్టార్ ధన్ వృద్ధి అనే కొత్త ప్రత్యేక ఎప్‌డీ పథకాన్ని బ్యాంక్ ప్రవేశపెట్టింది. సవరించిన రేట్లు సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చాయి. ఈ మార్పులను అనుసరించి బ్యాంకు ఆఫ్ ఇండియా ఇప్పుడు 7 రోజుల నుంచి 10 సంవత్సరాల కాలవ్యవధి కలిగిన ఎఫ్‌డీలపై 3 శాతం నుంచి 7.25 శాతం వరకు వడ్డీ రేట్లను అందిస్తుంది. ఈ రేట్లు రూ. 3 కోట్ల లోపు డిపాజిట్లకు వర్తిస్తాయి. అలాగే సాధారణ ప్రజలతో పాటు సీనియర్ సిటిజన్లకు కూడా ప్రత్యేక ఎఫ్‌డీ రేట్లను అందిస్తుంది.

స్టార్ ధన్ వృద్ధి పథకం 333 రోజుల ఎఫ్‌డీను ఎంచుకునే కస్టమర్ల కోసం రూపొందించారు. ఈ పథకం కింద బ్యాంక్ ఆఫ్ ఇండియా గరిష్టంగా 7.25 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. అయితే మీరు సీనియర్ సిటిజన్ అయితే మీకు 7.75 శాతం వడ్డీ లభిస్తుంది. సూపర్ సీనియర్ సిటిజన్లకు బ్యాంకు 7.90 శాతం వడ్డీ ఇస్తోంది. సీనియర్ సిటిజన్లు అంటే 60 ఏళ్ల నుంచి 80 ఏళ్ల మధ్య వయసున్నవారేనని గమనించాలి. అయితే 80 ఏళ్లు దాటిన వాళ్లను సూపర్ సీనియర్ సిటిజన్లుగా పరిగణిస్తారు. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

హిజాబ్‌లో దర్శనమిచ్చిన ప్రముఖ హీరోయిన్.. షాక్‌లో ఫ్యాన్స్..వీడియో
హిజాబ్‌లో దర్శనమిచ్చిన ప్రముఖ హీరోయిన్.. షాక్‌లో ఫ్యాన్స్..వీడియో
అత్యవసర పరిస్థితి విధించినందుకు అరెస్ట్..!
అత్యవసర పరిస్థితి విధించినందుకు అరెస్ట్..!
రణ్‌బీర్‌తో ఉన్న ఈ చిన్నారి ఇప్పుడు క్రేజీ హీరోయినా.?
రణ్‌బీర్‌తో ఉన్న ఈ చిన్నారి ఇప్పుడు క్రేజీ హీరోయినా.?
ఎండుద్రాక్షను పాలలో నానబెట్టి తింటే అద్భుత ప్రయోజనాలు.. తెలిస్తే
ఎండుద్రాక్షను పాలలో నానబెట్టి తింటే అద్భుత ప్రయోజనాలు.. తెలిస్తే
"సచిన్ కో బోలో": యోగరాజ్ వ్యాఖ్యలతో క్రికెట్ లో కొత్త చర్చలు
అబార్షన్‌తో కన్నీరు మున్నీరైన టాలీవుడ్ యాంకర్.. వీడియో
అబార్షన్‌తో కన్నీరు మున్నీరైన టాలీవుడ్ యాంకర్.. వీడియో
భారత క్రికెట్ జట్టులో మంటలు: గంభీర్ ధోరణి పై చర్చలు
భారత క్రికెట్ జట్టులో మంటలు: గంభీర్ ధోరణి పై చర్చలు
ముఖానికి అలోవెరా జెల్ రాసుకుని నిద్రపోతున్నారా..?ఏమవుతుందో తెలుసా
ముఖానికి అలోవెరా జెల్ రాసుకుని నిద్రపోతున్నారా..?ఏమవుతుందో తెలుసా
రికార్డ్ స్థాయిలో అమృత స్నానం ఆచరించిన భక్తులు
రికార్డ్ స్థాయిలో అమృత స్నానం ఆచరించిన భక్తులు
"కౌన్ హైన్?".. కపిల్ అంత మాట అంటాడని ఎవరు ఊహించలేదు..!