AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మరింత ‘రాయల్‌’గా డుగ్గు డుగ్గు బండి.. క్లాసిక్‌ 350 అప్‌డేటెడ్‌ వెర్షన్‌ ఇది..

2024 Royal Enfield Classic 350: ఇప్పటికే మార్కెట్లో మంచి డిమాండ్‌ ఉన్న నియో రెట్రో క్లాసిక్‌ 350కి అప్‌డేటెడ్‌ వెర్షన్‌ను లాంచ్‌ చేసింది. రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ క్లాసిక్‌ 350 2024 వెర్షన్‌ను మార్కెట్లోకి గ్రాండ్‌గా లాంచ్‌ చేసింది. ఈ బైక్ ప్రారంభ ధర రూ. 1,99,500 (ఎక్స్-షోరూమ్), అత్యంత ఖరీదైన వేరియంట్ రూ.2.30 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంది. ఈ కొత్త వేరియంట్లో బ్రాండ్‌ పెయింట్‌ స్కీమ్‌లలో మార్పులు, కొన్ని ఫీచర్లు, స్టైలింగ్‌లో మార్పులు చేసినట్లు రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ ప్రకటించింది.

మరింత ‘రాయల్‌’గా డుగ్గు డుగ్గు బండి.. క్లాసిక్‌ 350 అప్‌డేటెడ్‌ వెర్షన్‌ ఇది..
2024 Royal Enfield Classic 350
Madhu
|

Updated on: Sep 04, 2024 | 5:23 PM

Share

రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌.. ఈ బ్రాండ్‌కే పెద్ద ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉంది. ఒకప్పుడు స్టేటస్‌ సింబల్‌గా వినియోగించిన ఈ బైక్‌.. యువకులకు కలల బైక్‌. ఈ బైక్‌ సౌండ్‌కే ఫిదా అయ్యే వారున్నారంటే అతిశయోక్తి కాదు. ఇప్పుడు ఈ బ్రాండ్‌ నుంచి కొత్త మోడల్‌ ఒకటి లాంచ్‌ అయ్యింది. ఇప్పటికే మార్కెట్లో మంచి డిమాండ్‌ ఉన్న నియో రెట్రో క్లాసిక్‌ 350కి అప్‌డేటెడ్‌ వెర్షన్‌ను లాంచ్‌ చేసింది. రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ క్లాసిక్‌ 350 2024 వెర్షన్‌ను మార్కెట్లోకి గ్రాండ్‌గా లాంచ్‌ చేసింది. ఈ బైక్ ప్రారంభ ధర రూ. 1,99,500 (ఎక్స్-షోరూమ్), అత్యంత ఖరీదైన వేరియంట్ రూ.2.30 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంది. ఈ కొత్త వేరియంట్లో బ్రాండ్‌ పెయింట్‌ స్కీమ్‌లలో మార్పులు, కొన్ని ఫీచర్లు, స్టైలింగ్‌లో మార్పులు చేసినట్లు రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ ప్రకటించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

2024 రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌క్లాసిక్‌ 350 డిజైన్‌..

కొత్త వెర్షన్‌ బైక్‌ లుక్‌ రెట్రో ఉంటుంది. హెడ్‌ ల్యాంప్, టెయిల్ లైట్లను కొత్త ఎల్‌ఈడీ లైట్లను ఇచ్చారు. ఎల్‌ఈడీ సిగ్నల్స్‌ అదనపు ఆకర్షణగా నిలుస్తాయి. సర్దుబాటు చేయగల క్లబ్‌తో పాటు బ్రేక్ లివర్లు, గేర్ పొజిషన్ ఇండికేటర్ను కూడా వస్తోంది. యూఎస్‌బీ టైప్- సీ ఛార్జర్ను కూడా జోడించింది. ఇవన్నీ మెడాలియన్ బ్రాంజ్, సాండ్ గ్రే, మద్రాస్ రెడ్, కమాండో శాండ్, జోధ్పూర్ బ్లూ, ఎమరాల్డ్, స్పెషల్ ఫైల్త్ బ్లాక్ వంటి బహుళ పెయింటింగ్‌ స్కీమ్లతో ఈ బైక్స్‌ అందుబాటులో ఉన్నాయి. అల్లాయ్ వీల్స్ కేవలం స్టీల్ బ్లాక్ కలర్‌లో అందుబాటులో ఉన్నాయి.

ఐదు వేరియంట్లలో 2024 రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌క్లాసిక్‌ 350..

కలర్‌ ఆప్షన్లను బట్టి ఈ బైక్‌ ధరల్లో హెచ్చుతగ్గులున్నాయి. మొత్తం ఐదు వేరియంట్లుగా ఇవి అందుబాటులో ఉన్నాయి. హెరిటేజ్ (ధర రూ. 1,99,500), హెరిటేజ్ ప్రీమియం (ధర రూ. 2.04 లక్షలు), సిగ్నల్స్ (ధర రూ. 2.16 లక్షలు), డార్క్ (ధర రూ. రూ.2.25 లక్షలు), క్రోమ్ (ధర రూ. 2.30 లక్షలు). ఇవన్నీ ఎక్స్‌ షోరూం ధరలు.ఈ బైక్‌ 349 సీసీ సింగిల్-సిలిండర్ ఇంజన్‌తో వస్తుంది. ఇది 20.2బీహెచ్‌పీ శక్తిని, 27ఎన్‌శ్రీం గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ యూనిట్ ఐదు-స్పీడ్ గేర్బాక్స్ తో జత చేసి ఉంటుంది. ఈ 2024 రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ క్లాసిక్‌ 350 బైక్ ఇప్పటికే మార్కెట్లో ఉన్న జావా 350, హెూండా హైనెస్ సీబీ350, ట్రయంఫ్ స్పీడ్ 400 వంటి మోడళ్లతో పోటీపడనుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..