Success Story: టెకీ మహిళ ‘స్వీట్’ నిర్ణయం.. ఆశ్చర్యమే కానీ ఫలితం అద్భుతం.. పూర్తి వివరాలు

ఒక మహిళ మాత్రం తనకు వచ్చిన ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీల ఆఫర్లను వదులుకుని వేరే రంగాన్ని ఎంచుకుంది. అదే బిజినెస్. లక్షల రూపాయలు వచ్చే ఉద్యోగాలను వదులుకుని మిఠాయి దుకాణం(స్వీట్ షాపు) నిర్వహించాలని నిర్ణయించుకుంది. ఈ నిర్ణయం వెనుక ఉన్న కారణం ఏమిటి? తాను తీసుకున్న నిర్ణయం తనను విజయవంతం చేసిందా?

Success Story: టెకీ మహిళ ‘స్వీట్’ నిర్ణయం.. ఆశ్చర్యమే కానీ ఫలితం అద్భుతం.. పూర్తి వివరాలు
Lil Sweet Treat Shop
Follow us

|

Updated on: Sep 04, 2024 | 6:25 PM

ఆధునిక కాలంలో చదువుకున్న యువత అందరూ సాఫ్ట్ వేర్ రంగంలో స్థిరపడుతున్నారు. ఆకర్షణీయమైన జీతాలు, మంచి ఉద్యోగాలు, నగర జీవనం వారిని ఎంతో ప్రోత్సహిస్తున్నాయి. ఈ ఉద్యోగాల చేయడానికి తమ సొంతూళ్ల వదిలి నగరాల బాట పడుతున్నారు. చదువుకుంటున్న వారిలో సైతం చాలామంది సాఫ్ట్ వేర్ రంగం వైపే అడుగులు వేస్తున్నారు. అయితే ఒక మహిళ మాత్రం తనకు వచ్చిన ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీల ఆఫర్లను వదులుకుని వేరే రంగాన్ని ఎంచుకుంది. అదే బిజినెస్. లక్షల రూపాయలు వచ్చే ఉద్యోగాలను వదులుకుని మిఠాయి దుకాణం(స్వీట్ షాపు) నిర్వహించాలని నిర్ణయించుకుంది. ఈ నిర్ణయం వెనుక ఉన్న కారణం ఏమిటి? తాను తీసుకున్న నిర్ణయం తనను విజయవంతం చేసిందా? తెలుసుకోవాలంటే ఇది చదవండి.

స్వీట్ షాప్ కోసం..

న్యూయార్క్ నగరంలో లిల్ స్వీట్ ట్రీట్ అనే మిఠాయి దుకాణం ప్రారంభించడం కోసం ఓ టెక్ ప్రొఫెషనల్ తమ కెరీర్ ను వదులుకుంది. ఇందుకోసం గూగుల్, యాపిల్ తో సహా ప్రపంచంలోని ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీల నుంచి వచ్చిన ఆఫర్లను వదిలేసింది. చివరకు తాను అనుకున్న విధంగా సొంత వ్యాపారం మొదలుపెట్టింది. టెక్ ప్రొఫెషన్ ఆమెకు బోరింగ్ అనిపించడంతో దాని నుంచి మారాలని నిర్ణయం తీసుకుంది. ఉద్యోగ విరామంలో భోజనం చేస్తున్నసమయంలో ఆమె బాగా ఆలోచించేది. చివరకు తనకు ఇష్టమైన మిఠాయి దుకాణం ప్రారంభించాలని నిర్ణయం తీసుకుంది.

టెకీగా జీవితం ప్రారంభం..

ఎల్లీ రోజ్ అనే మహిళ చదువు పూర్తయిన తర్వాత టెక్ ప్రొఫెషనల్ గా జీవితాన్ని ప్రారంభించింది. గూగుల్ లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ గా ఇంటర్న్ షిప్ చేసింది. ఆ తర్వాత బ్లాక్‌స్టోన్ గ్రూప్, ఆపిల్, మైక్రోసాఫ్ట్‌లో పనిచేసింది. ఆ అనుభవంతో ఆమెకు అనేక ఆఫర్లు వచ్చాయి. మంచి జీతం, ఇతర సౌకర్యాలు కల్పించారు. కానీ ఆమె నిర్ణయం వేరేలా ఉండడంతో ఆ రంగం నుంచి బయటకు వచ్చేసింది. ఆమె ఎప్పుడూ పొదుపు చేయడానికి ప్రాధాన్యం ఇచ్చేది. తన తల్లి చెప్పిన మాటల ప్రకారం డబ్బులను చాలా జాగ్రత్తగా ఖర్చు చేసేది. టెక్‌ రంగంలో ఎన్నో అవకాశాలు ఉన్నప్పటికీ ఈ-కామర్స్ స్టార్టప్‌లో హెడ్ ఆఫ్ ప్రొడక్ట్‌గా చేరాలని నిర్ణయించుకుంది. ఆమెకు సొంతంగా వ్యాపారం చేయాలనే ఆలోచనకు పునాది వేసింది.

సొంతంగా వ్యాపారం..

మిఠాయి దుకాణం నిర్వహించాలనే కోరిక ఆమె చాలా ఏళ్లుగా ఉంది. ఆమె టీనేజీలో యునైటెడ్ స్టేట్స్‌లో పెరిగారు. ఆ సమయంలో తన సహ విద్యార్థులతో కలిసి తరచూ కొరియన్ స్నాక్స్‌ తినేది. అలాగే వివిధ సంస్కృతులకు చెందిన వారికి సంబంధించి అనేక రుచులను ఆస్వాదించింది. ఇలా ఆమెకు అంతర్జాతీయ స్వీట్లపై మక్కువ పెరిగింది. ఇతర ప్రాంతాలకు ప్రయాణం చేసినప్పుడు అక్కడి రుచులను పరిశీలించేది. ఇలా ప్రపంచవ్యాప్తంగా మిఠాయి దుకాణాలను అన్వేషించింది. తన ప్రయాణాల సమయంలో కొన్న మిఠాయిలను ఇంటికి తీసుకువచ్చినప్పుడు వాటిని తిని స్నేహితులు, సభ్యులు మెచ్చుకునేవారు. అంతర్జాతీయ క్యాండీలకు పెరుగుతున్న జనాదరణను ఆమె గమనించింది. తన కలను సాకారం చేసుకోవడానికి ఇదే సరైన సమయం అని భావించింది. తన భర్తతో కలిసి ఫిజికల్ స్టోర్, ఇ-కామర్స్ ప్లాట్‌ఫాం రెండింటినీ ప్రారంభించింది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..