Bank Account: మీకు ఎక్కువ బ్యాంకు ఖాతాలున్నాయా..? ఏ అకౌంట్‌కు ఆధార్ లింకైందో తెలుసుకోండిలా!
Bank Account: ఈ రోజుల్లో చాలా మందికి ఒకటి కంటే ఎక్కువ బ్యాంకు అకౌంట్లు ఉంటున్నాయి. అన్ని అకౌంట్లకు ఆధార్ నెంబర్‌ను లింక్ చేయడం తప్పనిసరి..
ఈ రోజుల్లో చాలా మందికి ఒకటి కంటే ఎక్కువ బ్యాంకు అకౌంట్లు ఉంటున్నాయి. అన్ని అకౌంట్లకు ఆధార్ నెంబర్‌ను లింక్ చేయడం తప్పనిసరి అనే విషయం అందరికి తెలిసిందే. ఈ రోజుల్లో అన్ని డాక్యుమెంట్లలో ఆధార్ తప్పనిసరి. ఇది లేనిది ఏ పని జరగదు. ఎక్కువ బ్యాంకు అకౌంట్లు ఉన్న వారికి ఆధార్ నెంబర్ లింకై ఉందా..? లేదా? అనే విషయం తెలిసి ఉండదు. అలాంటి సమయంలో ఏ బ్యాంకుకు ఆధార్ కార్డు లింకు అయ్యి ఉందో తెలుసుకోవడం ఎంతో ముఖ్యం. అలాంటి సమయంలో బ్యాంకుకు వెళ్లి తెలుసుకోకుండానే ఇంట్లోనే ఉండి ఏ బ్యాంకుకు ఆధార్ లింక్ అయ్యిందో తెలుసుకోవచ్చు. ప్రతి ఒక్కరు బ్యాంకు అకౌంట్‌కు ఆధార్‌ను లింక్ చేసుకోవాలని ప్రభుత్వాలు, బయాంకు అధికారులు పదేపదే చెబుతున్నారు. అయితే రెండు మూడు, ఇంకా అంతకంటే ఎక్కువ బ్యాంకుల్లో అకౌంట్లు ఉన్నవాళ్లు తమ ఆధార్ నెంబర్ ఏ బ్యాంకు ఖాతాకు లింక్ అయిందో తెలియక సతమతమవుతుంటారు.
యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) ఈ సేవలను అందిస్తోంది. యూఐడీఏఐ అధికారిక వెబ్‌సైట్ లో మీరు మీ ఆధార్ నెంబర్‌ను ఏ బ్యాంక్ అకౌంట్‌కు లింక్ చేశారో తెలుసుకోవచ్చు. అయితే ముందుగా మీ ఆధార్ నెంబర్‌కు మొబైల్ నెంబర్ లింక్ అయి ఉండాలి. అలాంటి సమయంలోనే ఈ వివరాలు తెలుస్తాయి. ఒకవేళ మీ ఆధార్ నెంబర్‌కు మొబైల్ నెంబర్ లింక్ లేకపోతే చేసుకోవాలి.
ఆధార్ ఏ బ్యాంకుకు లింక్ అయ్యిందో తెలుసుకోవడం ఎలా..?
- ముందుగా యూఐడీఏఐ (UIDAI) అధికారిక వెబ్‌సైట్ ఓపెన్ చేయండి.
- హోమ్ పేజీలో Aadhaar Services పైన క్లిక్ చేయండి.
- Check Aadhaar Bank Linking Status లింక్ పైన క్లిక్ చేయండి.
- కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
- ఆధార్ నెంబర్ లేదా వర్చువల్ ఐడీ ఎంటర్ చేయండి.
- సెక్యూరిటీ కోడ్ ఎంటర్ చేయండి.
- ఆ తర్వాత Send OTP పైన క్లిక్ చేయండి.
- మీ ఆధార్ నెంబర్‌తో లింక్ అయిన మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది.
- ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయాలి.
మీ ఆధార్ నెంబర్ ఏ బ్యాంకు అకౌంట్‌కు లింక్ అయిందో వివరాలు కనిపిస్తాయి. మీ ఆధార్ నెంబర్ చివరి నాలుగు అంకెలు, బ్యాంక్ లింక్ స్టేటస్, ఎప్పటి నుంచి బ్యాంక్ అకౌంట్‌కు ఆధార్ నెంబర్ లింక్ అయింది.. ఏ బ్యాంకుతో ఆధార్ నెంబర్ లింక్ అయిందో వివరాలు తెలుసుకోవచ్చు. ఒక వేళ మీ ఆధార్ నెంబర్ ఏ బ్యాంక్ అకౌంట్‌కు లింక్ కానట్లయితే మీరు మీ ఖాతా ఉన్న బ్యాంకు వెబ్‌సైట్‌లో ఆధార్ నెంబర్ లింక్ చేసుకోవచ్చు.
మరిన్ని బిజిెనెస్ న్యూస్ కోసం