RBI ATM Alert: మీరు ఏటీఎం నుంచి డబ్బులు విత్‌డ్రా చేస్తున్నారా..? ఈ విషయాలు గుర్తించుకోండి.. ఆర్బీఐ హెచ్చరిక

ఏటీఎంల విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాలి. ఏటీఎంలలో విత్‌డ్రా చేసుకునేవారు కొన్ని పొరపాట్లు చేయడం వల్ల మోసాల్లో పడిపోతుంటారు..

RBI ATM Alert: మీరు ఏటీఎం నుంచి డబ్బులు విత్‌డ్రా చేస్తున్నారా..? ఈ విషయాలు గుర్తించుకోండి.. ఆర్బీఐ హెచ్చరిక
ATM
Follow us
Subhash Goud

|

Updated on: Nov 10, 2022 | 7:38 AM

ఏటీఎంల విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాలి. ఏటీఎంలలో విత్‌డ్రా చేసుకునేవారు కొన్ని పొరపాట్లు చేయడం వల్ల మోసాల్లో పడిపోతుంటారు. అలాంటి వారి కోసం రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) పలు హెచ్చరికలు జారీ చేస్తోంది. ఏటీఎం నుంచి నగదు విత్‌డ్రా చేసేటపుడు చాలా సార్లు ఇలాంటి పొరపాట్లు చేస్తుంటారు. దీని వలన ప్రజలు మోసానికి గురవుతారు.

మారుతున్న కాలంతో పాటు, ఏటీఎం వినియోగదారుల సంఖ్య వేగంగా పెరిగింది. ఈ రోజుల్లో ప్రజలు బ్యాంకులకు వెళ్లే బదులు ఏటీఎం కార్డు నుండి నగదు తీసుకోవడానికి ఇష్టపడుతున్నారు. పెరుగుతున్న ఏటీఎంల వినియోగంతో దానికి సంబంధించిన మోసాలు కూడా వేగంగా పెరుగుతున్నాయి. ఈరోజుల్లో ఏటీఎం కార్డులను క్లోనింగ్ చేసి మోసగాళ్లు కూడా పెరిగిపోతున్నారు. ఏటీఎం మోసాల నుండి కస్టమర్లను సురక్షితంగా ఉంచడానికి ఆర్‌బీఐ కొన్ని భద్రతా చిట్కాలను సూచించింది.

  1. మీ ఏటీఎం పిన్‌ను ఎవరితోనూ షేర్ చేయవద్దు. దీనితో పాటు, ఎక్కడైనా రాసి కూడా సేవ్‌ చేసుకోవద్దు. మొబైల్‌లో కూడా ఏటీఎం పిన్‌లను సేవ్‌ చేసుకోవద్దు.
  2. దీనితో పాటు ఏటీఎం మెషీన్‌లో పిన్‌ను నమోదు చేసేటప్పుడు, మీ చేతులతో పిన్‌ కీప్యాడ్‌ను కవర్ చేయండి. డబ్బు విత్ డ్రా చేసుకునేందుకు తెలియని వ్యక్తుల సహాయం తీసుకోకండి. దీని వల్ల మీరు మోసపోయే ప్రమాదం ఉంది.
  3. ఇవి కూడా చదవండి
  4. ఇది కాకుండా, నగదు ఉపసంహరణ తర్వాత మీరు తప్పనిసరిగా క్యాన్సిల్‌ బటన్‌ను నొక్కాలి. విత్‌డ్రా ప్రాసెస్‌ అయిన తర్వాత డబ్బులు, ఏటీఎం కార్డును తీసుకోవడం మర్చిపోవద్దు.
  5. మీ ఏటీఎం మెషీన్‌లో కార్డ్ చిక్కుకుపోయినట్లయితే, వెంటనే మీ బ్యాంకుకు కాల్ చేసి దాని గురించి తెలియజేయండి. నగదు బయటకు రాకపోయినా, మీరు దాని గురించి బ్యాంకుకు తెలియజేయవచ్చు.
  6. ఏటీఎంలో డబ్బులు తీసుకునే సమయంలో ఏదైనా సమస్య ఏర్పడి అకౌంట్‌ నుంచి డబ్బులు కట్‌ అయి ఏటీఎంలో డబ్బులు రాకపోతే బ్యాంకును సంప్రదించి ఫిర్యాదు చేయాలి. ఇలాంటి సమస్య తలెత్తితో ఒక రోజులో డబ్బులు మీబ్యాంకు అకౌంట్‌కు మళ్లీ బదిలీ అవుతాయి. అయినా ముందస్తుగా బ్యాంకును సంప్రదించి ఫిర్యాదు చేస్తే బాగుంటుందని గుర్తించుకోండి.
  7. ఏటీఎం వద్ద డబ్బులు విత్‌డ్రా చేసే సమయంలో ఎట్టి పరిస్థితుల్లో ఇతర వ్యక్తులతో డ్రా చేయించకూడదు. మీకు తెలియపోతే మీ ఇంట్లో వ్యక్తులను వెంట తీసుకెళ్లాలి తప్ప గుర్తు తెలియని వ్యక్తులకు ఎలాంటి సమాచారం ఇవ్వవద్దని ఆర్బీఐ హెచ్చరిస్తోంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇప్పుడు గ్లామర్‏తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి..
ఇప్పుడు గ్లామర్‏తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి..
సంగీత ప్రపంచంలో యార్కర్ల కింగ్ మలింగ...
సంగీత ప్రపంచంలో యార్కర్ల కింగ్ మలింగ...
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు