Bajaj EV Auto: నయా ఈవీ ఆటో రిలీజ్ చేసిన బజాజ్.. ఆ సమస్యలకు చెక్ పెట్టినట్టేనా?
ప్రపంచవ్యాప్తంగా ఈవీ వాహనాల డిమాండ్ రోజురోజుకూ పెరుగుతుంది. ఈ నేపథ్యంలో టాప్ కంపెనీల నుంచి స్టార్టప్ కంపెనీల వరకు తమ ఈవీలను లాంచ్ చేస్తున్నాయి. అయితే టూ వీలర్, ఫోర్ వీలర్స్‌లోనే ప్రస్తుతం ఈవీలు అధికంగా అందుబాటులో ఉన్నాయి. కానీ ప్రముఖ కంపెనీ బజాజ్ త్రీ వీలర్‌లో కూడా ఈవీను లాంచ్ చేసింది.

బజాజ్ ఆటో లిమిటెడ్ బజాజ్ గోగో అనే ఎలక్ట్రిక్ త్రీ-వీలర్ బ్రాండ్‌ను విడుదల చేసింది. ఈ త్రీవీలర్ ఆటోను ఓ సారి ఛార్జ్ చేస్తే 251 కిలోమీటర్ల పరిధిని అందిస్తుందని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు ఇప్పటికే బజాజ్ కంపెనీ మూడు ప్యాసింజర్ వేరియంట్‌లను ఆవిష్కరించింది. పీ5009, పీ5012,పీ7012 అని మూడు ప్యాసింజర్ వాహనాలను రిలీజ్ చేశారు. పీ 5009 ధర రూ.3,26,797, పీ7012 ధర రూ.3,83,004 (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) నుంచి ప్రారంభమవుతుంది. అయితే కొత్త బజాజ్ గోగో గురించి దేశవ్యాప్తంగా ఉన్న అన్ని బజాజ్ ఆటో డీలర్‌షిప్‌లలో బుకింగ్‌లు ప్రారంభమయ్యాయి. గోగో లైన్ మెరుగైన పనితీరు కోసం రెండు-స్పీడ్ ఆటోమేటెడ్ ట్రాన్స్‌మిషన్‌ను పరిచయం చేస్తుంది.
పీ అంటే ప్యాసెంజర్ వాహనాలను సూచిస్తాయని, ’50’, ’70’ పరిమాణ వర్గాలను సూచిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ’09’, ’12’ వరుసగా 9 కేడబ్ల్యూహెచ్, 12 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ సామర్థ్యాలను సూచిస్తాయని వివరిస్తున్నారు. ఈ వాహనాలు పూర్తి మెటల్ బాడీ నిర్మాణం, ఆటో హజార్డ్, యాంటీ-రోల్ డిటెక్షన్ వంటి అధునాతన భద్రతా వ్యవస్థలను కలిగి ఉంటాయని పేర్కొంటున్నారు. ఎల్ఈడీ లైటింగ్, హిల్ హోల్డ్ అసిస్ట్ కార్యాచరణ, ఐదు సంవత్సరాల బ్యాటరీ వారెంటీ ఉన్నాయని నిపుణులు వివరిస్తున్నారు. మెరుగైన సామర్థ్యాలను కోరుకునే ఆపరేటర్ల కోసం బజాజ్ రిమోట్ ఇమ్మొబిలైజేషన్, రివర్స్ అసిస్ట్ వంటి అదనపు ఫీచర్లతో ‘ప్రీమియం టెక్‌ప్యాక్’ను అందిస్తుంది.
బజాజ్ ఆటో లిమిటెడ్‌లోని ఇంట్రా సిటీ బిజినెస్ యూనిట్ ప్రెసిడెంట్ సమర్‌దీప్ సుబంధ్ మాట్లాడుతూ బజాజ్ గోగో శ్రేణి త్రిచక్ర వాహనాల విలువపరంగా ది బెస్ట్ అని నిపుణులు వివరిస్తున్నారు. 251 కిలోమీటర్ల వరకు ధృవీకరించిన శ్రేణి, సెగ్మెంట్ ఫస్ట్ ఫీచర్లతో పాటు బజాజ్ విశ్వసనీయత, బజాజ్ గోగో ఆదాయాలను పెంచుకోవాలని పేర్కొంటున్నారు. అలాేగ డౌన్‌టైమ్, నిర్వహణ ఇబ్బందులను తగ్గించాలని చూస్తున్న కస్టమర్లకు సమగ్ర పరిష్కారాన్ని అందిస్తుందని వివరిస్తున్నారు. బజాజ్ ప్రస్తుతం ఈవీ ప్యాసింజర్ వాహనాలపై దృష్టి పెడుతుంది. బజాజ్ రాబోయే నెలల్లో కార్గో వేరియంట్లు రిలీజ్ చేసే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి








