FD Interest Rates Hike: డిపాజిటర్లకు బజాజ్ ఫైనాన్స్ గుడ్ న్యూస్.. భారీగా వడ్డీ రేట్ల పెంపు.. సీనియర్ సిటిజన్లకు ఎంతంటే?

బజాజ్ ఫైనాన్స్ తన ఫిక్స్‌డ్ డిపాజిట్ రేట్లను 40 బేసిస్ పాయింట్ల వరకు పెంచింది. ఇది సీనియర్ సిటిజన్‌లకు సంవత్సరానికి 8.60 శాతానికి, 44 నెలల ప్రత్యేక పదవీకాలానికి వర్తిస్తుందని ఆ కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. బజాజ్ ఫైనాన్స్ 36 నెలల నుంచి 60 నెలల వరకు మెచ్యూరిటీ ఉన్న డిపాజిట్లపై ఈ సవరించిన రేట్లు వర్తిస్తాయి.

FD Interest Rates Hike: డిపాజిటర్లకు బజాజ్ ఫైనాన్స్ గుడ్ న్యూస్.. భారీగా వడ్డీ రేట్ల పెంపు.. సీనియర్ సిటిజన్లకు ఎంతంటే?
Fixed Deposit
Follow us
Srinu

|

Updated on: May 12, 2023 | 4:30 PM

సాధారణంగా రిటైరయ్యాక వచ్చే సొమ్మును సీనియర్ సిటిజన్లు నమ్మకమైన రాబడి కోసం ఫిక్స్‌డ్ డిపాజిట్లు చేస్తూ ఉంటారు. మే2022 నుంచి ఆర్‌బీఐ తీసుకున్న చర్యల కారణంగా అన్ని బ్యాంకులు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెంచుతున్నాయి. ఇటీవల ఆర్‌బీఐ రెపో రేట్ యథాతథంగా ఉంచడంతో ఈ పెంపు కొంతమేర బ్యాంకులు తగ్గించాయి. అయినా కొన్ని బ్యాంకింగ్ సంస్థలు మాత్రం కస్టమర్లను ఆకట్టుకోవడానికి ఇంకా ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచుతున్నాయి. తాజాగా బజాజ్ ఫైనాన్స్ తన ఫిక్స్‌డ్ డిపాజిట్ రేట్లను 40 బేసిస్ పాయింట్ల వరకు పెంచింది. ఇది సీనియర్ సిటిజన్‌లకు సంవత్సరానికి 8.60 శాతానికి, 44 నెలల ప్రత్యేక పదవీకాలానికి వర్తిస్తుందని ఆ కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. బజాజ్ ఫైనాన్స్ 36 నెలల నుంచి 60 నెలల వరకు మెచ్యూరిటీ ఉన్న డిపాజిట్లపై ఈ సవరించిన రేట్లు వర్తిస్తాయి. అలాగే ఈ కొత్త రేట్లు మే 10, 2023 నుంచి అమలులోకి వస్తాయని బజాజ్ ఫైనాన్స్ ప్రతినిధులు పేర్కొంటున్నారు. అలాగే 60 ఏళ్ల లోపు ఉన్న డిపాజిటర్లు ఏడాదికి 8.05 శాతం వరకు, సీనియర్ సిటిజన్లు 36 నెలల నుంచి 60 నెలల వరకు డిపాజిట్లపై ఏడాదికి 8.30 శాతం వరకు వడ్డీని పొందుతారని కంపెనీ తెలిపింది. అలాగే ఈ రూ.5 కోట్ల లోపు ఫిక్స్‌డ్ డిపాజిట్లకే ఈ సవరించిన రేట్లు అందుబాటులో ఉండనున్నాయి. అయితే బజాజ్ ఫైనాన్స్ అందించే వడ్డీ రేట్లు సీఆర్ఐఎస్ఐఎల్‌కు చెందిన ఏఏఏ స్టేబుల్ రేటింగ్‌తో వస్తాయని గమనించాలి. ఇవి ఆర్‌బీఐ డీఐసీజీసీ పరిధిలోకి రావు.

బజాజ్ ఫైనాన్స్ వడ్డీ రేట్లు

12-23 నెలల ఎఫ్‌డీలపై సాధారణ పౌరులకు 7.4 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.65 శాతం. 15-23 నెలల 7.5 శాతం, 7.75 శాతం, 24 నెలల ఎఫ్‌డీలపై 7.55 శాతం, 7.8 శాతం, 25-35 నెలల ఎఫ్‌డీలపై 7.6 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.65 శాతం 36-60 నెలల ఎఫ్‌డీలపై 8.05 శాతం, 8.3 శాతం వడ్డీ అందిస్తుంది.

బజాజ్ ఫైనాన్స్ ప్రత్యేక వడ్డీ రేట్లు

15 నెలల  ఎఫ్‌డీలపై సాధారణ పౌరులకు 7.45 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.7 శాతం, 18 నెలల ఎఫ్‌డీలపై 7.4 శాతం, 7.65 శాతం, 22 నెలల ఎఫ్‌డీలపై 7.5 శాతం, 7.75 శాతం 30 నెలల ఎఫ్‌డీలపై 7.45 శాతం,  7.7 శాతం 33 నెలల ఎఫ్‌డీలపై సాధారణ పౌరులకు 7.75 శాతం, సీనియర్ సిటిజన్లకు 8 శాతం, 44 నెలల ఎఫ్‌డీలపై 8.35 శాతం, సీనియర్ సిటిజన్లకు 8.60 శాతం లభిస్తుంది. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!