Bajaj chetak: బజాజ్ చేతక్ కొత్త లుక్ చూశారా? అతి తక్కువ ధరలో మరో వేరియంట్..
దేశంలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు ఆదరణ రోజు రోజుకూ పెరుగుతోంది. కొత్త కొత్త ఫీచర్లతో వాహనాలు ఎంతో ఆకట్టుకుంటున్నాయి. అయితే వాటి ధరలు దాదాపు రూ.లక్షకు పైగా ఉన్నాయి. దీంతో సామాన్య, మధ్య తరగతి వర్గాలు వాటిపై ఆసక్తి చూపడం లేదు. ఈ నేపథ్యంలో తక్కువ ఫీచర్లతో తక్కువ ధరకు వాహనాన్ని అందించడానికి బజాజ్ చేతక్ చర్యలు తీసుకుంది. విడుదల చేయడానికి ముందే డీలర్ల కోసం ప్రదర్శనకు ఉంచింది.

బజాజ్ చేతక్ నుంచి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ త్వరలో మార్కెట్ లోకి రానుంది. వినియోగదారులకు తక్కువ ధరకు దీనిని అందించడానికి ఈ కంపెనీ చర్యలు తీసుకుంది. తక్కువ ఫీచర్లతో రూపొందిస్తున్న ఈ వేరియంట్ ను లాంచింగ్ కు ముందు డీలర్ల కోసం ప్రదర్శించారు. ఓలా ఎస్1 ఎక్స్ ప్లస్, ఏథర్ రిజ్టా, టీవీఎస్ ఐక్యూబ్, సింపుల్ డాట్ వన్ తదితర వాటికి ఈ కొత్త బజాజ్ చేతక్ వేరియంట్ పోటీగా ఉంటుందని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.
కొత్త వేరియంట్ ప్రత్యేకతలు..
భవిష్యత్తులో ఉపయోగపడేలా హైడ్రోజన్ తో నడిచే వాహనాన్ని బజాజ్ చేతక్ అభివృద్ధి చేస్తోంది. దానికి ముందు ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో ఓలా ఎస్ 1 ఎక్స్ ప్లస్ కు పోటీగా కొత్త వేరియంట్‌ను రూపొందించడానికి సంకల్పించింది. దానిలో భాగంగానే కొత్త వేరియంట్ ను మార్కెట్ లోకి విడుదల చేయనుంది. డీలర్ల కోసం ప్రదర్శంచిన కొత్త వేరియంట్ లో ప్రత్యేకతలను తెలుసుకుందాం.
సామాన్యులకు అందుబాటులో..
దేశంలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు ఆదరణ రోజు రోజుకూ పెరుగుతోంది. కొత్త కొత్త ఫీచర్లతో వాహనాలు ఎంతో ఆకట్టుకుంటున్నాయి. అయితే వాటి ధరలు దాదాపు రూ.లక్షకు పైగా ఉన్నాయి. దీంతో సామాన్య, మధ్య తరగతి వర్గాలు వాటిపై ఆసక్తి చూపడం లేదు. ఈ నేపథ్యంలో తక్కువ ఫీచర్లతో తక్కువ ధరకు వాహనాన్ని అందించడానికి బజాజ్ చేతక్ చర్యలు తీసుకుంది. విడుదల చేయడానికి ముందే డీలర్ల కోసం ప్రదర్శనకు ఉంచింది. దీనిలోని ఫీచర్లపై అనేక విషయాలు బయటకు వచ్చాయి.
ఆకట్టుకునే రంగులలో..
అనేక కొత్త రంగులతో చవకైన వేరియంట్ ను రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రదర్శనకు ఉంచి వాహనం సియాన్ షేడ్ తో ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా యువతను ఆకర్షించేలా దీనిని రూపొందించినట్టు తెలుస్తోంది. దీనిలోని ప్రధాన హార్డ్ వేర్ మార్పులు, తగ్గించిన ఫీచర్ల కారణంగా అర్బనే వేరియంట్ కన్నా తక్కువ ధరకు అందించడానికి సహయపడతాయి.
ఫీచర్లు ఇవే..
కొత్త చవకైన వేరియంట్ కు అల్లాయ్ వీల్స్, డిస్క్ బ్రేక్‌లు లేవు, వాటి స్థానంలో స్టీల్ వీల్స్, డ్రమ్ బ్రేక్‌లను ఏర్పాటు చేశారు. చేతక్ ప్రీమియంలో కనిపించే డిజిటల్ టీఎఫ్ టీ ఇన్‌స్ట్రుమెంట్ స్క్రీన్‌కు బదులు వృత్తాకార ఎల్ సీడీ యూనిట్ రీప్లేస్ చేశారు. లాక్ చేసుకునే గ్లోవ్‌బాక్స్ కు బదులు రెండు ఓపెన్ కావిటీలు కనిపిస్తున్నాయి. స్మార్ట్ కీ స్లాట్ బదులు కన్వన్సినల్ కీ హోల్ ఉంది. అండర్ సీట్ స్టోరేజ్, ముందు, వెనుక సింగిల్ సైడ్ సస్పెన్షన్ సిస్టమ్‌లు కనిపిస్తుంది. బ్యాటరీ, మోటారు విషయానికొస్తే ఇతర వేరియంట్లలో మాదిరిగా కొత్త దానిలో శక్తివంతంగా ఉండదనే విమర్శలు ఉన్నాయి. కానీ చేతక్ అర్బేన్ వేరియంట్ బ్యాటరీ, మోటార్ ను దీనిలో ప్లాన్ చేసే అవకాశం కూడా ఉంది. అర్బేన్ వేరియంట్ 2.9 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీని కలిగి ఉంది. దీని పరిధి 113 కిలోమీటర్లు, అలాగే గరిష్ట వేగం గంటకు 73 కిలోమీటర్లు.
రూ.1 లక్షకన్నా తక్కువేనా?
బజాజ్ చేతక్ చవకైన వేరియంట్ మిడ్ డ్రైవ్ మోటారు ద్వారా శక్తిని పొందుతున్నట్లు కనిపిస్తోంది. చేతక్ అర్బనేలోని 2.9 kWh యూనిట్ బ్యాటరీ కూడా ఇందులో వాడే అవకాశం ఉంది. ఇది 113 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది. లేకపోతే ఇంకా కొంచెం తగ్గే అవకాశం ఉంది. టాప్ స్పెక్ చేతక్ ప్రీమియం లో 3.2 kWh బ్యాటరీ ఉంది. దీనిని ఒక్కసారి చార్జి చేస్తే 126 కిలోమీటర్లు వస్తుంది. బేస్ అర్బేన్ రూ.1.23 లక్షలు, టాప్ స్పెక్ ప్రీమియం రూ.1.47 లక్షలకు అందుబాటులో ఉన్నాయి. కొత్త చవకైన వేరియంట్ రూ.లక్షలోపు ఉంటుందని భావిస్తున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




