Bajaj Chetak 2903 EV: చేతక్ కొత్త ఈ-స్కూటర్.. పోలీసుల కోసమే ప్రత్యేకంగా..

బజాజ్ చేతక్ 2903 పేరుతో దానిని తీసుకొస్తోంది. కాగా దీనిని ఇప్పుడు పోలీసులకు మొదట అందుబాటులోకి తీసుకొచ్చింది. అందుకోసం కేంద్రీయ పోలీస్ కల్యాన్ భాండార్(కేపీకేబీ)తో కలిసి బజాజ్ పనిచేస్తోంది. కేంద్ర హోం శాఖ ఆధర్వంలో ఈ ఒప్పందం జరిగింది. దీని కారణంగా చేతక్ 2903 ఎలక్ట్రిక్ స్కూటర్ దేశ వ్యాప్తంగా ఉన్న కేపీకేబీ లబ్ధిదారులకు అందుబాటులోకి రానుంది.

Bajaj Chetak 2903 EV: చేతక్ కొత్త ఈ-స్కూటర్.. పోలీసుల కోసమే ప్రత్యేకంగా..
Bajaj Chetak 2903 Ev
Follow us
Madhu

|

Updated on: Sep 25, 2024 | 1:22 PM

మన దేశంలో డిమాండ్ ఉన్న ఎలక్ట్రిక్ స్కూటర్లలో బజాజ్ చేతక్ ఒకటి. ఇటీవల దాని నుంచి కొత్త మోడల్ ను ప్రకటించింది. బజాజ్ చేతక్ 2903 పేరుతో దానిని తీసుకొస్తోంది. కాగా దీనిని ఇప్పుడు పోలీసులకు మొదట అందుబాటులోకి తీసుకొచ్చింది. అందుకోసం కేంద్రీయ పోలీస్ కల్యాన్ భాండార్(కేపీకేబీ)తో కలిసి బజాజ్ పనిచేస్తోంది. కేంద్ర హోం శాఖ ఆధర్వంలో ఈ ఒప్పందం జరిగింది. దీని కారణంగా చేతక్ 2903 ఎలక్ట్రిక్ స్కూటర్ దేశ వ్యాప్తంగా ఉన్న కేపీకేబీ లబ్ధిదారులకు అందుబాటులోకి రానుంది. కేపీకేబీ, బజాబ్ మధ్య ఒప్పందం 2024, సెప్టెబర్ 18 నుంచి వర్కింగ్ లో ఉంది. కేపీకేబీలో లిస్ట్ అయిన మొట్టమొదటి ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ దారుగా బజాజ్ నిలిచింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

స్కూటర్ల అమ్మకం ఇలా..

కేపీకేబీతో బజాజ్ చేసుకున్న ఈ ఒప్పందం కారణంగా చేతక్ 2903 స్కూటర్లు కేపీకేబీ లబ్ధిదారులకు అందుబాటులోకి వచ్చింది. దేశంలోని చేతక్ ఎక్స్ పీరియన్స్ సెంటర్(సీఈసీ)లలో ప్రత్యేకమైన ధరలకు ఈ చేతక్ 2903 అందుబాటులో ఉంటుంది. అర్హతగల సిబ్బంది చెల్లుబాటు అయ్యే డిపార్ట్మెంటల్ గుర్తింపు కార్డుతో సమీపంలోని అనుబంధ భాండార్ లేదా మాస్టర్ డార్ నుంచి అధీకృత లేఖను సమర్పించడం ద్వారా ఈ ఆఫర్ నుండి ప్రయోజనం పొందవచ్చు. అనుమతి పొందిన తర్వాత, ఎలక్ట్రిక్ స్కూటర్ ను డీలర్ నుంచి కొనుగోలు చేయవచ్చు.

ఎవరు అర్హులు..

కేపీకేబీలో ఉన్న సిబ్బంది అందరూ దీనిని తీసుకునేందుకు అర్హులే. కేంద్రీయ పోలీస్ కల్యాన్ భాండార్(కేపీకేబీ)లో ఎవరు ఉంటారంటే.. బీఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్, సీఐఎస్ఎఫ్, ఐటీబీపీ, ఎస్ఎస్బీ, అసోం రైఫిల్స్ వంటి కేంద్ర సాయుధ పోలీసు బలగాలకు సేవలను అందించడానికి కేంద్ర హెూం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో 2006లో కేంద్రీయ పోలీస్ కల్యాణ్ భాండార్ స్థాపించింది. ఈ పథకం ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ), బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ (బీపీఆర్డీ), నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) వంటి కేంద్ర పోలీసు సంస్థలను కూడా కవర్ చేస్తుంది.

లక్ష్యం అదే..

ఈ సందర్భంగా అర్బనైట్ బిజినెస్ యూనిట్ ప్రెసిడెంట్ ఎరిక్ వాస్ మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా వివిధ విభాగాల్లో పనిచేస్తున్న ధైర్యవంతులైన సిబ్బందికి చేతక్ 2903ను అందించడానికి కేంద్రీయ పోలీస్ కల్యాణ్ భాండార్తో భాగస్వామ్యం కావడం ఆనందంగా ఉందన్నారు. ఈ సహకారం తమ అధునాతన ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రయోజనాలను విస్తృత ప్రేక్షకులకు అందించడానికి ఉపయోగపడుతుందని చెప్పారు. ఈ స్కూటర్ బలమైన డిజైన్, ఉన్నతమైన ఫీచర్లతో, డిపార్ట్మెంటల్ సిబ్బందికి, వారి కుటుంబాలకు బెస్ట్ ఆప్షన్ కాగలదని తాము నమ్ముతున్నట్లు పేర్కొన్నారు. ప్రతి వినియోగదారుడు చేతక్ లోని సౌలభ్యం, విశ్వసనీయత, పర్యావరణ అనుకూలతను అనుభవించేలా చూడడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..