Ayushman Bharat Yojana: 5 లక్షల వరకు ఉచిత చికిత్స కోసం ఆయుష్మాన్ కార్డు.. దరఖాస్తు చేయడం ఎలా..?

Ayushman Bharat Yojana: ఆయుష్మాన్ భారత్ యోజన కార్డ్: దేశంలోని ప్రతి పేద వర్గానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ రకాల పథకాలను అందుబాటులోకి తీసుకువస్తున్నాయి..

Ayushman Bharat Yojana: 5 లక్షల వరకు ఉచిత చికిత్స కోసం ఆయుష్మాన్ కార్డు.. దరఖాస్తు చేయడం ఎలా..?
Ayushman Bharat Yojana
Follow us
Subhash Goud

|

Updated on: Sep 24, 2022 | 3:28 PM

Ayushman Bharat Yojana: ఆయుష్మాన్ భారత్ యోజన కార్డ్: దేశంలోని ప్రతి పేద వర్గానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ రకాల పథకాలను అందుబాటులోకి తీసుకువస్తున్నాయి. ఈ పథకాలు చాలా వరకు మహిళలు, పిల్లలు, రైతులు, విద్యార్థుల కోసం అమలు అమలు చేస్తున్నాయి ప్రభుత్వాలు. నేటికీ భారతదేశంలోని అధిక జనాభాకు మెరుగైన ఆరోగ్య సౌకర్యాలు అందుబాటులో లేవు. పేదలకు మెరుగైన సేవలు అందించేందుకు కేంద్రం ఎన్నో చర్యలు చేపడుతోంది. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న పేదలకు మెరుగైన వైద్యం అందించే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.

అటువంటి పరిస్థితిలో దేశంలోని ప్రతి పేదవాడు కూడా మంచి ఆరోగ్య సదుపాయాలను పొందేలా కేంద్ర ప్రభుత్వం ఒక గొప్ప పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం పేరు ఆయుష్మాన్ భారత్ యోజన (ప్రధాన మంత్రి జన్-ఆరోగ్య యోజన). ఈ పథకం కింద ప్రతి లబ్దిదారుడికి ఆరోగ్య కార్డు లభిస్తుంది, దీని ద్వారా అతను రూ. 5 లక్షల వరకు ఉచిత ఆరోగ్య చికిత్స (ఆరోగ్య బీమా) పొందుతాడు. ఈ ఆరోగ్య కార్డును ఆయుష్మాన్ గోల్డెన్ కార్డ్ అని కూడా పిలుస్తారు.

దేశంలోని వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ పథకాన్ని తమ స్వశక్తితో అమలు చేస్తున్నాయి. మీరు కూడా ఆయుష్మాన్ గోల్డెన్ కార్డ్ పొందాలనుకుంటే, దీని కోసం నమోదు చేసుకోవచ్చు. ఆయుష్మాన్ భారత్ స్కీమ్ కింద దరఖాస్తు చేసుకోవడానికి అర్హత, పథకం వివరాల గురించి తెలుసుకోవడం ఎంతో ముఖ్యం.

ఇవి కూడా చదవండి

ఈ వ్యక్తులు ఆయుష్మాన్ యోజన కోసం దరఖాస్తు చేసుకోవచ్చు:

తక్కువ ఆదాయం కలిగిన వ్యక్తులు ఈ ఆయుష్మాన్ భారత్ కార్డును పొందవచ్చు. దరఖాస్దితు చేసుకోవడం ద్వారా ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. నిరుపేదలు, భూమిలేని వారు, షెడ్యూల్డ్ కులాలు లేదా తెగకు చెందిన వారు, గ్రామీణ ప్రాంతంలో నివసిస్తున్నవారు, దారిద్య్రరేఖకు దిగువన నివసిస్తున్న వారు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. మీరు కూడా ఈ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకోవాలనుకుంటే, దీని కోసం మీరు మీ సమీపంలో ఉండే పబ్లిక్ సర్వీస్ సెంటర్‌కు వెళ్లవచ్చు. అక్కడ మీరు ఫారమ్‌ను నింపి పూర్సతి వివరాలు సమర్పించాల్సి ఉంటుంది. దీని తర్వాత మీరు ఇచ్చిన సమాచారాన్ని క్రాస్ చెక్ చేయడం ద్వారా అధికారులు మీకు ఆయుష్మాన్ భారత్ పథకంకు చెందిన గోల్డెన్ కార్డును జారీ చేస్తారు. మీకు ఆ కార్డు అందాలంటే సుమారు 15 రోజుల పడుతుంది.

దరఖాస్తు చేయడం ఎలా..?

☛ ఆయుష్మాన్ భారత్ గోల్డెన్ కార్డ్ పొందడానికి సమీపంలోని పబ్లిక్ సర్వీస్ సెంటర్‌ను సందర్శించాలి.

☛ అక్కడ అధికారి మీ పేరు లిస్టులో ఉందో లేదో చెక్ చేస్తారు.

☛ మీ పేరు లబ్ధిదారుల జాబితాలో ఉంటే, మీ ఆధార్ కార్డ్, రిజిస్టర్డ్ మొబైల్ నంబర్, రేషన్ కార్డ్ ఫోటోకాపీని సమర్పించాలి.

☛ దీని తర్వాత మీరు పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోను కూడా సమర్పించాలి.

☛ మీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత రిజిస్ట్రేషన్ నంబర్, పాస్‌వర్డ్ ఇస్తారు.

☛ ఆ తర్వాత మీరు 15 రోజులు వేచి ఉండాల్సి ఉంటుంది.

☛ 15 రోజుల తర్వాత మీ ఇంటి చిరునామాకు ఆయుష్మాన్ భారత్ గోల్డెన్ కార్డ్ వస్తుంది.

☛ ఆ తర్వాత మీరు ఏదైనా వైద్యపరమైన అత్యవసర పరిస్థితుల్లో ఏ ఆసుపత్రిలోనైనా రూ. 5 లక్షల వరకు ఉచిత చికిత్సను పొందవచ్చు.

☛ ఈ కార్డు ద్వారా దేశంలోని బడుగు బలహీన వర్గాలకు ఆరోగ్య సౌకర్యాలు చేరవేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

ఆయుష్మాన్ గోల్డెన్ కార్డ్‌ని డౌన్‌లోడ్ చేయడం ఎలా

☛ ముందుగా  వెబ్‌సైట్‌ను క్లిక్ చేయండి.

☛ మీ లాగిన్ ID, పాస్‌వర్డ్‌ను నమోదు చేయండి.

☛ మీరు ఆధార్ నంబర్ ను నమోదు చేయాలి.

☛ ఆమోదించబడిన లబ్ధిదారు ఎంపికపై క్లిక్ చేయండి.

☛ అక్కడ గోల్డెన్ కార్డుల జాబితాను తనిఖీ చేయండి.

☛ అందులో మీ పేరును తనిఖీ చేయండి.

☛ తర్వాత మీరు CSC వాలెట్‌పై క్లిక్ చేసి మీ పాస్‌వర్డ్‌ను నమోదు చేయాలి.

☛ తర్వాత పిన్ ఎంటర్ చేయండి.

☛ ఆయుష్మాన్ కార్డ్‌ని డౌన్‌లోడ్ చేసుకునే ఆప్షన్ మీకు కనిపిస్తుంది.

☛ ఆయుష్మాన్ గోల్డెన్ కార్డ్‌పై క్లిక్ చేయడం ద్వారా డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆయుష్మాన్ గోల్డెన్ కార్డ్ కోసం కావలసిన పత్రాలు

☛ దరఖాస్తుదారు ఆధార్ కార్డ్

☛ పాస్‌పోర్ట్ సైజు ఫోటో

☛ రేషన్ కార్డు

☛ మొబైల్ నంబర్

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
సఫల ఏకాదశి వ్రతం మహత్యం.. పూజ శుభ సమయం? విధానం ఏమిటంటే..
సఫల ఏకాదశి వ్రతం మహత్యం.. పూజ శుభ సమయం? విధానం ఏమిటంటే..
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ లక్ష్యంగా తెంబా మాస్టర్ ప్లాన్..!
టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ లక్ష్యంగా తెంబా మాస్టర్ ప్లాన్..!
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
జస్ప్రీత్ బుమ్రా @ 200.. మెల్‌బోర్న్‌లో డబుల్ సెంచరీ
జస్ప్రీత్ బుమ్రా @ 200.. మెల్‌బోర్న్‌లో డబుల్ సెంచరీ
పిలిభిత్‌లో ఎన్‌కౌంటర్ లో గాయపడిన ముగ్గురు ఖలిస్తానీ ఉగ్రవాదులు
పిలిభిత్‌లో ఎన్‌కౌంటర్ లో గాయపడిన ముగ్గురు ఖలిస్తానీ ఉగ్రవాదులు
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
BBLలో సామ్ కాన్స్టాస్ మెరుపులు..IPL 2025లో ఆ జట్టులోకి..?
BBLలో సామ్ కాన్స్టాస్ మెరుపులు..IPL 2025లో ఆ జట్టులోకి..?
మహా కుంభమేళలో నాల్గవ రాజ స్నానం ఎప్పుడు? శుభ సమయం తెలుసుకోండి
మహా కుంభమేళలో నాల్గవ రాజ స్నానం ఎప్పుడు? శుభ సమయం తెలుసుకోండి