Ayodhya Ram Mandir: రామ మందిర ప్రతిష్టోత్సవానికి ఏర్పాట్లు.. ఈ కంపెనీ షేర్లకు జోష్.. కారణమేమిటి?
అయోద్య రామ మందిర నిర్మాణం పూర్తయ్యింది. 2024, జనవరి 22న ప్రతిష్టా కార్యక్రమం అట్టహాసంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ తేదీ, సంవత్సరం, ఘడియలు చరిత్ర పుస్తకాలలో చిరస్థాయిగా నిలిచిపోనున్నాయి. ఈ వేడుకకు ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు ప్రముఖులు హాజరు కానున్నారు. ఈ ప్రారంభోత్సవాన్ని మెగా ఈవెంట్ గా విజయవంతం చేసేందుకు దేశంలోని అనేక కంపెనీలు కృషి చేస్తున్నాయి. దీంతో ఆయా కంపెనీలకు షేర్లు స్టాక్ మార్కెట్లో గణనీయంగా వృద్ధి చెందుతున్నాయి.

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఉత్తర ప్రదేశ్ లోని అయోద్య రామ మందిర నిర్మాణం పూర్తయ్యింది. 2024, జనవరి 22న ప్రతిష్టా కార్యక్రమం అట్టహాసంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ తేదీ, సంవత్సరం, ఘడియలు చరిత్ర పుస్తకాలలో చిరస్థాయిగా నిలిచిపోనున్నాయి. ఈ వేడుకకు ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు ప్రముఖులు హాజరు కానున్నారు. ఈ ప్రారంభోత్సవాన్ని మెగా ఈవెంట్ గా విజయవంతం చేసేందుకు దేశంలోని అనేక కంపెనీలు కృషి చేస్తున్నాయి. దీంతో ఆయా కంపెనీలకు షేర్లు స్టాక్ మార్కెట్లో గణనీయంగా వృద్ధి చెందుతున్నాయి. ఆ రోజుల్లో వాటి షేర్లు బాగా లాభపడే అవకాశం ఉందని నిపుణులు సైతం అంచనా వేస్తున్నారు. ఎంటా కంపెనీలు? వాటికి ఏ విధంగా లాభం చేకూరనుంది? నిపుణులు చెబుతున్న అంశాలను తెలుసుకుందాం..
ఇండిగో.. భారతదేశపు అతిపెద్ద విమానయాన సంస్థ అయిన ఇండిగో రామ మందిర టూరిస్టుల కోసం జనవరి 15 నుంచి అయోధ్యకు విమాన సర్వీసులను ప్రారంభించనుంది. ముంబై నుంచి అయోధ్యకు రోజువారీ విమానాలను ప్రారంభించనుంది. ఇంతకుముందు, ఇండిగో డిసెంబరు 30, 2023న ఢిల్లీ నుండి అయోధ్యలోని మర్యాద పురుషోత్తం శ్రీ రామ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కార్యకలాపాలను ప్రకటించింది. ఈ చర్యల కారణంగా ఇండిగో స్టాక్స్ పై సానుకూల ప్రభావం చూపించిందని నిపుణులు పేర్కొంటున్నారు. షేర్ ప్రైస్ టార్గెట్ – ధర రూ. 3150- రూ. 3180 జోన్ వైపు దాని ప్రబలమైన ట్రెండ్‌ను తిరిగి ప్రారంభించి అలాగే కొనసాగుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఐఆర్‌సీటీసీ.. రామ మందిర ప్రారంభోత్సవం కోసం ఐఆర్సీటీసీ ప్రత్యేక 1000 రైళ్లను నడపాలని యోచిస్తోంది. భారతీయ రైల్వేల కోసం ఐఆర్ సీటీసీ టికెటింగ్, క్యాటరింగ్, టూరిజం సేవలను అందిస్తోంది. ఈ రైళ్లు మందిరం ప్రారంభమైన నాటి నుంచి మొదటి 100 రోజులు నడుస్తాయి. రైల్వే స్టాక్‌పై ఇది బలమైన ట్రెండ్ ను క్రియేట్ చేయగలుగుతుందని చెబుతున్నారు. బుల్లిష్ టోన్ కొనసాగుతుందని, స్వల్పకాలంలో ధర రూ. 950-975 స్థాయిల వైపు దూసుకుపోతుందని, 870 జోన్ స్టాక్‌కు ఊరటనిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇండియన్ హోటల్స్ (ఐహెచ్సీఎల్).. టాటా గ్రూప్ కంపెనీ వివాంటా, జింజర్ బ్రాండ్స్ కింద టెంపుల్ టౌన్‌లో 2 లగ్జరీ హోటళ్లను నిర్మించడానికి ఒప్పందం కుదుర్చుకున్నాయి. దీంతో షేర్ ధరలో బుల్లిష్ బయాస్ ఉంది. ఇది ప్రైమరీ అప్ ట్రెండ్‌ని సూచిస్తూ అధిక గరిష్టాలు, కనిష్ట స్థాయిల శ్రేణిని ఏర్పరుస్తుందని నిపుణులు చెబుతున్నారు.
ప్రవేగ్.. ఈ కంపెనీ అయోధ్యలో మరో రిసార్ట్‌ను నిర్మిస్తోంది. ఇది క్యూ4లో పని చేస్తుంది. ప్రస్తుత ఉన్న రిసార్ట్‌లో కూడా రామమందిరం ప్రారంభానికి ముందు భారీగా బుకింగ్‌లు జరుగుతున్నాయి. గత మూడు నెలలుగా ఈ కంపెనీ స్టాక్ లుకూడా పుంజుకున్నాయని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.
ఈజ్ మై ట్రిప్.. ఈ సంస్థ యాత్రికుల టూర్ ప్యాకేజీలను అందజేస్తుంది. భవిష్యత్తులో అయోధ్యకు ఉండే భారీ గిరాకీని ఇది అందిపుచ్చుకునేందుకు ప్రయత్నిస్తోంది. దీంతో ఈ స్టాక్ కొంతకాలంగా వేగంగా ముందుకు కదులుతోంది.
థామస్ కుక్.. ఇది కూడా ఒక ట్రావెల్ ఏజెన్సీ. దీనికి ముంబైలో ప్రధాన కార్యాలయం ఉంది. ప్రయాణ సేవలను అందిస్తుంది. దీని షేరు కూడా బలమైన అప్‌ట్రెండ్‌ను కొనసాగిస్తోంది. ఇటీవలి స్వల్ప కరెక్షన్ తర్వాత 135 జోన్ సమీపంలో మద్దతుని పొందడం ద్వారా మంచి పుల్‌బ్యాక్‌ను పొందిందని నిపుణులు చెబుతున్నారు. రాబోయే రోజుల్లో మరింత పెరుగుదలను ఊహించవచ్చంటున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..