Viral Video: హాయ్ ప్రెండ్స్.. ఇదిగో మా హనీమూన్.. వీడియో వైరల్.!
ఈ రోజుల్లో, ఇన్‌స్టాలో లైకులు, వ్యూస్ కోసం ఎంతకైనా తెగిస్తున్నారు కొందరు. సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యే ప్రయత్నంలో భాగంగా కొంతమంది జంటలు రొమాంటిక్ వీడియోలను షేర్ చేస్తూ వార్తల్లో నిలిస్తున్నారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఆ స్టోరీ ఏంటో తెలుసుకుందామా..

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన దగ్గర నుంచి.. నెట్టింట ఫేమస్ అయ్యేందుకు ఎంతోమంది ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. కొందరు లైకుల కోసం స్టంట్స్ చేస్తుంటే.. మరికొందరు ప్రాంక్ వీడియోలు.. ఇంకొందరు వింత వింత డ్యాన్సులతో ఇలా ఎవరికి వచ్చింది వారు తమ ప్రతిభకు తగ్గ ప్రదర్శనలు ఇస్తుంటారు. అయితే ఇంకో బ్యాచ్.. లైకుల కోసం.. వ్యూస్ కోసం.. తమ జీవితాన్నే అందరి ముందు బహిర్గతం చేస్తున్నారు. నాలుగు గోడల మధ్య జరగాల్సిన విషయాలను కూడా నలుగురు ముందుకు తెచ్చేస్తున్నారు. పెళ్లైన ఓ జంట సోషల్ మీడియాలో ఫేమస్ కావడం కోసం ఒక్క అడుగు మరింత ముందుకు వేసి.. ఏకంగా వారి ఫస్ట్ నైట్ వీడియోను రికార్డు చేశారు. ఇక దీనిపై నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు.
ఇది చదవండి: దేవుడు కలలో కనిపించి పొలంలో తవ్వమన్నాడు.. తీరా తవ్వి చూడగా
వైరల్ వీడియో ప్రకారం.. మనాలీలో హనీమూన్‌ను ప్లాన్ చేసుకున్న నూతన వధూవరులు. తమ రొమాంటిక్ డేట్ నైట్, లవ్లీ మూమెంట్స్‌ను సోషల్ మీడియాలో నెటిజన్లతో పంచుకున్నారు. ‘స్పెషల్ డిన్నర్ ఇన్ మనాలీ’ అంటూ క్యాప్షన్ పెట్టారు. ‘shaonmitra’ అనే నెటిజన్ ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయగా.. అందులో ఓ హోటల్ గదిలో కేక్ కట్ చేస్తున్న నవ వధూవరులను, అలాగే వారి హనీమూన్ స్టే కోసం పూలతో డెకరేట్ చేసుకున్న బెడ్‌ను మీరు చూడవచ్చు. కాగా, ఇన్‌స్టాలో అప్‌లోడ్ చేసిన ఈ వీడియో పాతది కాగా.. మరోసారి ఇది క్షణాల్లో వైరల్‌గా మారింది. ఇప్పటిదాకా ఈ వీడియోకు 2 మిలియన్ వ్యూస్ వరకు వచ్చాయి. వ్యూస్ కోసం ఇలా ప్రైవేట్ విషయాలను సైతం సోషల్ మీడియాలో చూపించాల్సిన అవసరం ఉందా అంటూ నెటిజన్లు తిట్టిపోస్తున్నారు. లేట్ ఎందుకు మీరూ వీడియోపై ఓ లుక్కేయండి.
View this post on Instagram
ఇది చదవండి: కూకట్‌పల్లి మెట్రో స్టేషన్ వద్ద అనుమానాస్పదంగా ఇద్దరు వ్యక్తులు.. ఆపి చెక్ చేయగా