Bank Rules: ఆటో డెబిట్ ఆప్షన్ లో బిల్లులు చెల్లిస్తున్నారా? అయితే త్వరలో రాబోతున్న ఈ పెద్ద మార్పు గురించి తెలుసుకోండి..
మీ బ్యాంకు ఎకౌంట్ నుంచి ఆటోమేటిక్ గా డెబిట్ అయ్యేలా ఏదైనా ఈఎంఐ లేదా ఇతర చెల్లింపులు ఉంటే మీకోసం ఈ అలెర్ట్. వచ్చేనెల అంటే అక్టోబర్ 1వ తేదీ నుంచి ఆటో డెబిట్ ఆప్షన్ విధానంలో మార్పులు వస్తున్నాయి.
Bank Rules: మీ బ్యాంకు ఎకౌంట్ నుంచి ఆటోమేటిక్ గా డెబిట్ అయ్యేలా ఏదైనా ఈఎంఐ లేదా ఇతర చెల్లింపులు ఉంటే మీకోసం ఈ అలెర్ట్. వచ్చేనెల అంటే అక్టోబర్ 1వ తేదీ నుంచి ఆటో డెబిట్ ఆప్షన్ విధానంలో మార్పులు వస్తున్నాయి. అప్పటినుంచి మీ ఎకౌంట్ నుంచి ఏదైనా ఆటో డెబిట్ కావాలంటే మీ అనుమతి తప్పనిసరి. అంటే, మీరు ఏదైనా ఆటో చెల్లింపు కోసం బ్యాంకుకు ముందే సూచనలు ఇచ్చినప్పటికీ.. అలా ఆటోమేటిక్ గా చెల్లింపు జరగాల్సిన ప్రతిసారీ మీరు మళ్ళీ బ్యాంకుకు మీ అనుమతి తప్పనిసరిగా చెప్పాలి. లేదంటే.. ఆ విధమైన చెల్లింపులు జరగవు. ఈ విషయంలో జాగ్రత్త పడకపోతే డెబిట్-క్రెడిట్ కార్డులపై అటో డెబిట్ సదుపాయాన్ని వినియోగించుకునే కస్టమర్ల లావాదేవీలు విఫలం అయ్యే అవకాశాలు ఉన్నాయి. అసలు ఈ మార్పు ఏమిటి? మీ ఆటో డెబిట్ లావాదేవీలు సజావుగా సాగాలంటే మీరు ఏమి చేయాలి వంటి విషయాలు తెలుసుకుందాం.
వినియోగదారులను ఫ్రాడ్ లావాదేవీల నుంచి కాపాడటం కోసం ఆర్బీఐ కొత్త ఏర్పాటు చేస్తోంది. దీనికోసం కొత్త భద్రతా చర్యలు ఏర్పాటు చేసింది. ఇప్పటికే ఈ విషయాన్ని యాక్సిస్, హెచ్‌డిఎఫ్‌సి వంటి బ్యాంకులు తమ వినియోగదారులకు ఈ కొత్త విధానాన్ని గురించి తెలియచేయడం ప్రారంభించాయి. దీని ప్రకారం.. 1 అక్టోబర్ 2021 నుండి, ఆర్‌బిఐ కంప్లైంట్ ప్రక్రియ ప్రకారం తప్ప, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ క్రెడిట్ కార్డ్ / డెబిట్ కార్డ్‌లో మర్చంట్ వెబ్‌సైట్ / యాప్‌లో ఇచ్చిన స్టాండింగ్ ఇన్‌స్ట్రక్షన్ (మళ్ళీ..మళ్ళీ.. చెల్లింపుల ప్రాసెసింగ్ కోసం ఇ-ఆదేశం) బ్యాంక్ ఆమోదించదు.” అని HDFC బ్యాంక్ తన వెబ్‌సైట్‌లో పేర్కొంది. ”RBI యొక్క పునరావృత చెల్లింపు మార్గదర్శకాల ప్రకారం, wef 20-09-21, పునరావృత లావాదేవీల కోసం మీ యాక్సిస్ బ్యాంక్ కార్డ్ (ల) పై స్టాండింగ్ సూచనలు గౌరవించడం జరగదు. నిరంతర సేవ కోసం మీరు మీ కార్డును ఉపయోగించి వ్యాపారికి నేరుగా చెల్లించవచ్చు,” అని యాక్సిస్ బ్యాంక్ తన కస్టమర్లకు సందేశాన్ని పంపించింది.
పునరావృత చెల్లింపులపై ఆర్‌బిఐ కొత్త ఆర్డర్ ఏమిటి?
పునరావృతమయ్యే ఆన్‌లైన్ లావాదేవీలపై ఇ-ఆదేశాలను ప్రాసెస్ చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) ఒక ఫ్రేమ్‌వర్క్‌ను విడుదల చేసింది. డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులు, UPI, ఇతర ప్రీపెయిడ్ చెల్లింపు పరికరాలు (PPI లు) ₹ 5,000 కంటే తక్కువ పునరావృతమయ్యే లావాదేవీలకు AFA (ధృవీకరణ యొక్క అదనపు కారకం) తప్పనిసరి చేసింది. మొబైల్, యుటిలిటీ, ఇతర రికరింగ్ బిల్లులు అలాగే OTT స్ట్రీమింగ్ సర్వీసుల వంటి సబ్‌స్క్రిప్షన్ చెల్లింపుల కోసం కస్టమర్ల కార్డ్‌ల (క్రెడిట్/డెబిట్/ప్రీపెయిడ్) నుండి స్వయంచాలకంగా డెబిట్ చేయబడిన అన్ని పునరావృత చెల్లింపులకు ఈ ఆదేశం వర్తిస్తుంది.
ఇది ఎలా జరుగుతుంది?
ప్రతి ఆటో డెబిట్ లావాదేవీకి ముందు బ్యాంకులు కస్టమర్‌కు SMS, ఇమెయిల్ ద్వారా నోటిఫికేషన్ పంపుతాయి. కస్టమర్‌లకు డెబిట్ చేయడానికి 24 గంటల ముందు బ్యాంకులు ఈ విషయం తెలియచేస్తాయి. చెల్లింపును మార్చడానికి లేదా రద్దు చేయడానికి వినియోగదారుకు తగినంత సమయం లభిస్తుంది. ఈ నోటిఫికేషన్‌లో వ్యాపారి పేరు, లావాదేవీ మొత్తం, డెబిట్ తేదీ, లావాదేవీ రిఫరెన్స్ నంబర్, డెబిట్ కారణం గురించిన వివరాలు ఉంటాయి. ఇప్పుడు కార్డు దారుడు ఆ లావాదేవీని ఆమోదించ వచ్చు లేదా తిరస్కరించవచ్చు.
అయితే, మీరు మీ మొబైల్ నెంబర్ మీ డెబిట్ లేదా క్రెడిట్ కార్డుతో లింక్ చేసుకుని ఉండాలి. అప్పుడే మీ మొబైల్ కు ఈ లావాదేవీలకు సంబంధించిన మెసేజ్ వస్తుంది. మెసేజ్ వచ్చిన వెంటనే మీరు దానిని ఆ లావాదేవీ సరైనది అనుకుంటే ఆమోదించవచ్చు లేదా తిరస్కరించవచ్చు. మీరు ఆమోదం తెలిపితేనే ఆటో డెబిట్ ప్రక్రియ పూర్తి అవుతుంది. లేకపోతే కనుక దానిని బ్యాంకు నిలిపివేస్తుంది.
Also Read: PM Modi in US: ఢిల్లికి చేరుకున్న ప్రధాని మోడీ.. ఘన స్వాగతం పలికిన ప్రజలు..
Ayushman Bharat: రూ .5 లక్షల ఉచిత ఆరోగ్య బీమా.. ఎవరు అర్హులో తెలుసుకోండి..