స్మార్ట్‌ఫోన్‌ వినియోగదారులకు హెచ్చరిక..! రేపట్నించి గూగుల్, యూట్యూబ్ సేవలన్నీ బంద్..? వీరు ఫోన్‌ మార్చుకోవాల్సిందే..

Google Alert: ప్రపంచంలోని అతి పెద్ద సెర్చ్ ఇంజిన్ గూగుల్. తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 27 నుంచి గూగుల్ మ్యాప్స్, యూట్యూబ్, జి మెయిల్ వంటి

స్మార్ట్‌ఫోన్‌ వినియోగదారులకు హెచ్చరిక..! రేపట్నించి గూగుల్, యూట్యూబ్ సేవలన్నీ బంద్..? వీరు ఫోన్‌ మార్చుకోవాల్సిందే..
Google Maps
Follow us

|

Updated on: Sep 26, 2021 | 5:46 PM

Google Alert: ప్రపంచంలోని అతి పెద్ద సెర్చ్ ఇంజిన్ గూగుల్. తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 27 నుంచి గూగుల్ మ్యాప్స్, యూట్యూబ్, జి మెయిల్ వంటి సేవలు కొన్ని స్మార్ట్‌ఫోన్లలో పనిచేయవు. వినియోగదారులు తమ ఫోన్‌ను అప్‌డేట్ చేయాలి లేదా కొత్త మొబైల్ ఫోన్ అయినా వాడాలి. గూగుల్ తీసుకున్న ఈ నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది ఆండ్రాయిడ్ వినియోగదారులపై ప్రభావం చూపుతుంది. రేపటి నుంచి 2.3 వెర్షన్ డివైజ్‌లలో గూగుల్ యాప్స్‌లో లాగిన్ కాలేరు. యూజర్ నేమ్, పాస్‌వర్డ్ ఎర్రర్ చూపిస్తుంది.

ఆండ్రాయిడ్ 2.3 వెర్షన్(Android 2.3 Version) లేదా అంతకంటే తక్కువ వెర్షన్ ఫోన్లలో ఈ సేవలు నిలిచిపోనున్నాయి. యూజర్ల భద్రత, డేటా పరిరక్షణ అంశాల్ని దృష్టిలో ఉంచుకుని గూగుల్ ఈ నిర్ణయం తీసుకుంది. అందుకే పాత స్మార్ట్‌ఫోన్ వినియోగిస్తున్నవారంతా తక్షణం సాఫ్ట్‌వేర్ అప్‌గ్రేడ్ చేసుకోవల్సిందే లేదా ఫోన్ మార్చుకోవాలి. ప్రస్తుతం ఆండ్రాయిడ్‌లో 11 వెర్షన్, ఐఫోన్లలో ఐవోఎస్ 15 నడుస్తోంది. 2010 నుంచి గూగుల్ ఒక్కొక్క వెర్షన్‌ను విడుదల చేస్తోంది.

2017లో ఆండ్రాయిడ్ 2.3 ఫోన్లకు గూగుల్ పే సేవలు నిలిచిపోయాయి. ఆండ్రాయిడ్ 2.3 వెర్షన్‌తో ఇప్పటికీ నడుస్తున్న కొన్ని ఫోన్ల జాబితా ఇలా ఉంది. Sony Xperia Advance, Lenovo k800, Sony Xperia Go, Vodafone Smart, Samsung Galaxy S2, Sony Xperia P, LG Spectrum, Sony Xperia S, LG Prada 3.0, HTC Velocity, HTC Evo 4G, Motorola Fire, Motorola XT532. ఇవి కొన్ని మాత్రమే ఇంకా చాలా ఉన్నాయి. పాత వెర్షన్ల వల్ల హ్యాకర్లు రెచ్చిపోతున్నారు. అందుకే గూగుల్ ఈ నిర్ణయం తీసుకుంది.

BECIL Recruitment 2021: డేటా ఎంట్రీ ఆపరేటర్, సూపర్ వైజర్‌ పోస్టులకు నోటిఫికేషన్ జారీ.. ఎలా అప్లై చేయాలంటే..?

Second Hand Phone: సెకండ్ హ్యాండ్ మొబైల్ ఫోన్ కొనాలంటే ఈ విషయాలు చెక్ చేసుకోవడం తప్పనిసరి..లేదంటే దొరికిపోతారు!

Puri Jagannadh: పూరి నుంచి బాలయ్య సినిమా అప్డేట్ రానుందా.. డైనమిక్ డైరెక్టర్ బర్త్ డే కోసం ఫాన్స్ వెయిటింగ్..