Audi India: భారతదేశంలో ఆడి సూపర్ రికార్డు.. లక్ష కార్ల అమ్మకమే టార్గెట్
ప్రపంచవ్యాప్తంగా కారు లవర్స్‌కు ఆడి కారు అంటే ఓ ప్రత్యేక. ఈ బ్రాండ్ భారతదేశంలో కూడా తన సత్తా చాటుతుంది. ప్రఖ్యాత జర్మన్ లగ్జరీ కార్ బ్రాండ్ ఆడి 2024 సంవత్సరానికి 5,816 యూనిట్ల రిటైల్ విక్రయాలను ప్రకటించింది. సంవత్సరం ప్రథమార్ధంలో సరఫరా సవాళ్లు ఉన్నప్పటికీ మెరుగైన సరఫరా స్థాయిల కారణంగా మూడో త్రైమాసికంతో పోలిస్తే నాలుగో త్రైమాసికంలో అమ్మకాల్లో ఏకంగా 36 శాతం పెరుగుదలను నమోదు చేసింది.
ఆడి ఇండియా 2024 మొదటి ఆరు నెలల్లో సరఫరా సంబంధిత సవాళ్లను ఎదుర్కొందని ఆడి ఇండియా ప్రతినిధలు చెబుతున్నారు. అయినప్పటికీ ఆడి ప్రొడెక్ట్స్‌కు ఉన్న డిమాండ్ దృష్ట్యా సంవత్సరంలోని ద్వితియార్థంలో మెరుగైన సరఫరాతో కీలక మైలు రాయిని చేరుకున్నామని పేర్కొంటున్నారు. ముఖ్యంగా 2024 మూడో త్రైమాసికంతో పోలిస్తే ఆడి కార్ల వాల్యూమ్‌లు నాలుగో త్రైమాసికంలో 36 శాతం మెరుగుపడిందని వివరిస్తున్నారు. ముఖ్యంగా 2024వ సంవత్సరంలో 5816 కార్ల అమ్మకాలు చేసినట్లు స్పష్టం చేశారు. అలాగే 2025 సంవత్సరంలో అమ్మకాలతో భారతదేశంలో 100,000 కార్లు విక్రయించేలా పలు కీలక చర్యలను తీసుకుంటున్నట్లు పేర్కొంటున్నారు.
ఆడికి సంబంధించి ప్రీ-ఓన్డ్ కార్ల విభాగాన్ని ఆడి ఆమోదించడంతో మునుపటి సంవత్సరంతో పోలిస్తే కార్ల అమ్మకాలు 2024లో 32 శాతం వృద్ధిని సాధించారు. ఆడి బ్రాండ్ తన అతిపెద్ద లగ్జరీ యూజ్డ్ కార్ షోరూమ్‌ను ఈశాన్య ప్రాంతంలో గౌహతిలో, మంగళూరులో ప్రారంభించింది. భారతదేశంలో కీలక నగరాల్లో 26 షోరూమ్‌లతో, ప్రీ-ఓన్డ్ లగ్జరీ కార్ల కోసం పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా ఆడి మరింత విస్తరించాలని యోచిస్తోంది. ప్రత్యేక ‘100 డేస్ ఆఫ్ సెలబ్రేషన్’ క్యాంపెయిన్‌తో భారతదేశంలో లక్ష కార్ల అమ్మకాలను సాధించేలా ప్రణాళికలను సిద్ధం చేస్తుంది.
ప్రీమియం కస్టమర్లను ఆకట్టుకునే విధంగా ఆడి క్యూ8, ఆడి క్యూ7 కార్లతో లగ్జరీ ఎస్‌యూవీ మార్కెట్‌లో తమ బ్రాండ్ ప్రత్యేకతను తెలిపేలా చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్లు ఆడి ప్రతినిధులు చెబుతున్నారు. ఆడి ఇండియాకు సంబంధించిన ప్రస్తుత ఉత్పత్తి లైనప్‌లో ఆడి ఎ4, ఆడి ఎ6, ఆడి క్యూ3, ఆడి క్యూ3 స్పోర్ట్‌బ్యాక్, ఆడి క్యూ5, ఆడి క్యూ7, ఆడి క్యూ8, ఆడి ఎస్5 స్పోర్ట్‌బ్యాక్, ఆడి ఆర్ఎస్ క్యూ8, ఆడి క్యూ8 ఇ-ట్రాన్, ఆడి క్యూ8 ఇ-ట్రాన్ స్పోర్ట్‌బ్యాక్, ఆడి ఇ-ట్రాన్ జీటీ, ఆడి ఆర్ఎస్ ఇ-ట్రాన్ జీటీ వంటి కార్లు ఉన్నాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి