Atal Pension: అటల్ పెన్షన్ యోజనలో కేంద్రం కీలక మార్పులు.. అవేంటో తెలుసుకోండి!
Atal Pension Yojana: దేశవ్యాప్తంగా ఉన్న పోస్టాఫీసులన్నీ ఇక నుంచి కొత్త ఫారమ్ ఉపయోగించి అటల్ పెన్షన్ స్కీమ్ కోసం దరఖాస్తులను స్వీకరించాలని పోస్టాఫీసులను ఆదేశించింది. వారు ఈ మార్పు గురించి కస్టమర్లకు తెలియజేయాలి. అలాగే సంబంధిత సమాచారాన్ని వారి నోటీసు బోర్డులలో ఉంచాలి.

Atal Pension Yojana: భారత ప్రభుత్వం అటల్ పెన్షన్ యోజన (APY)లో మార్పులు చేసింది. ఈ మార్పులలో భాగంగా రిజిస్ట్రేషన్ ప్రక్రియలో మార్పులు జరిగాయి. అక్టోబర్ 1, 2025 నుండి అమలులోకి వచ్చేలా అటల్ పెన్షన్ యోజన కోసం పాత ఫారమ్‌లు ఇకపై ఆమోదించమని పోస్టల్ శాఖ జారీ చేసిన అధికారిక నోటిఫికేషన్ పేర్కొంది.
ఇక నుంచి కొత్త ఖాతా తెరవడానికి సవరించిన ఫారమ్ మాత్రమే అంగీకరిస్తున్నట్లు తెలిపింది.పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ మార్పులు చేశారు. పెన్షన్ సంబంధిత సేవలను మెరుగుపరచడానికి ఈ మార్పులు చేసినట్లు నోటిఫికేషన్ పేర్కొంది.
ఇది కూడా చదవండి: School Holidays: విద్యార్థులకు గుడ్‌న్యూస్.. దీపావళికి భారీగా సెలవులు.. ఎన్ని రోజులో తెలుసా?
కొత్త నియమాలు ఏమిటి?
ప్రభుత్వం అందించిన సమాచారం ప్రకారం.. ఇప్పటి నుండి అటల్ పెన్షన్ యోజన ప్రయోజనాలను పొందడానికి దరఖాస్తుదారులు కొత్త ఫారమ్‌ను ఉపయోగించి దరఖాస్తు చేసుకోవాలి. ఫారమ్‌లో కొన్ని మార్పులు చేశారు. దరఖాస్తుదారులు తమ విదేశీ పౌరసత్వం గురించి సమాచారాన్ని కొత్త ఫారమ్‌లో అందించాల్సి ఉంటుంది. అంటే వారు ఏదైనా ఇతర దేశ పౌరులా కాదా అని పేర్కొనాల్సి ఉంటుంది. ఈ మార్పు వెనుక ప్రభుత్వ ఉద్దేశ్యం APY ప్రయోజనాలను భారతీయ పౌరులకు విస్తరించడం. అదనంగా అటల్ పెన్షన్ యోజన కోసం పొదుపు ఖాతాలు పోస్టాఫీసుల ద్వారా ఓపెన్ చేయవచ్చు.
దేశవ్యాప్తంగా ఉన్న పోస్టాఫీసులన్నీ ఇక నుంచి కొత్త ఫారమ్ ఉపయోగించి అటల్ పెన్షన్ స్కీమ్ కోసం దరఖాస్తులను స్వీకరించాలని పోస్టాఫీసులను ఆదేశించింది. వారు ఈ మార్పు గురించి కస్టమర్లకు తెలియజేయాలి. అలాగే సంబంధిత సమాచారాన్ని వారి నోటీసు బోర్డులలో ఉంచాలి.
అటల్ పెన్షన్ యోజన గురించి తెలుసుకోండి:
అటల్ పెన్షన్ యోజన (APY) అనేది భారత ప్రభుత్వం పథకం, ఇది అసంఘటిత కార్మికులకు పెన్షన్ ప్రయోజనాలను అందిస్తుంది. వ్యాపారులు, గిగ్ వర్కర్లు సహా పెన్షన్ పథకం పరిధిలోకి రాని ఉద్యోగులు ఈ పథకాన్ని పొందవచ్చు. దీని ద్వారా పెన్షన్ పొందవచ్చు. 18-40 సంవత్సరాల మధ్య వయస్సు గల ఏ భారతీయ పౌరుడైనా ఈ పథకంలో చేరవచ్చు. 60 ఏళ్ల వయస్సు వచ్చిన తర్వాత రూ.1,000 నుండి రూ.5,000 వరకు పెన్షన్ మొత్తం అందుతుంది. మీరు జమ చేసే మొత్తంపై మీ పెన్షన్ ఆధాపడి ఉంటుంది.
ఇది కూడా చదవండి: Jio Plan: 365 రోజుల చెల్లుబాటుతో చౌకైన ప్లాన్ జియో ప్లాన్.. బెనిఫిట్స్ ఇవే!
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి








