AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: నాగుపామును ముద్దు పెట్టుకోవాలనుకున్నాడు.. కట్ చేస్తే.. గురుడికి సీన్ సితారయ్యింది

Viral Video: ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అలాగే ప్రజలు దీనిపై వివిధ రకాల ప్రతిచర్యలతో స్పందిస్తున్నారు. చాలా మంది వినియోగదారులు ఇటువంటి ప్రమాదకరమైన విన్యాసాలు ప్రాణాంతకం కావచ్చని వ్యాఖ్యానించారు. మరికొందరు ఆ యువకుడు సోషల్ మీడియాలో హీరో..

Viral Video: నాగుపామును ముద్దు పెట్టుకోవాలనుకున్నాడు.. కట్ చేస్తే.. గురుడికి సీన్ సితారయ్యింది
Subhash Goud
|

Updated on: Oct 07, 2025 | 5:37 PM

Share

Viral Video: ఈ రోజుల్లో సోషల్ మీడియాలో ఒక షాకింగ్ వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఒక యువకుడు చేతిలో పామును పట్టుకుని ముద్దు పెట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు చూడవచ్చు. మొదట్లో అంతా సాధారణంగానే అనిపించినా, క్షణాల్లోనే పాము వెనక్కి తిరిగి ఆ యువకుడి పెదవులపై కాటేసింది. ఈ దృశ్యం భయంకరంగా ఉంది. పక్కన ఉన్నవాళ్లు కూడా భయంతో వణికిపోయారు.

ఆ వీడియోలో ఆ యువకుడు తన స్నేహితుల మధ్య ధైర్యంగా ఉండేందుకు ప్రయత్నించాడు. అతను కెమెరా ముందు పాముతో ఆడుకుంటాడు. తరువాత నెమ్మదిగా దానిని తన ముఖానికి దగ్గరగా తీసుకున్నాడు. దీంతో క్షణాల్లోనే పాము అతను పెదవులపై కాటేసింది. ఆ యువకుడి ముఖం తక్షణమే నొప్పితో పడిపోయాడు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి: Hyderabad’s First Tesla EV: తెలంగాణలో మొట్టమొదటి టెస్లా ఎలక్ట్రిక్‌ కారును కొన్నది ఎవరో తెలుసా?

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అలాగే ప్రజలు దీనిపై వివిధ రకాల ప్రతిచర్యలతో స్పందిస్తున్నారు. చాలా మంది వినియోగదారులు ఇటువంటి ప్రమాదకరమైన విన్యాసాలు ప్రాణాంతకం కావచ్చని వ్యాఖ్యానించారు. మరికొందరు ఆ యువకుడు సోషల్ మీడియాలో హీరో కావడానికి తన ప్రాణాలను పణంగా పెడుతున్నాడని చెప్పుకొచ్చారు. మరి కొందరేమో అతని తిక్క కుదిరింటూ కామెంట్‌ చేశారు.

ఈ సంఘటన ఎక్కడ జరిగిందో ఇంకా తెలియదు కానీ.. సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. ఇలాంటి వాళ్లపై అటవీ శాఖ అధికారులు చర్యలు తీసుకోవానలి డిమాండ్‌ చేస్తున్నారు కొందరు.

ఇది కూడా చదవండి: Multibagger Stock: అద్భుతం సృష్టించిన స్టాక్‌.. రూ.1 లక్ష పెట్టుబడిని రూ.1.84 కోట్లుగా మార్చింది!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి