Health Insurance: మీరు ఇన్సూరెన్స్‌ తీసుకుంటున్నారా..? ఈ రూల్స్‌ తెలుసుకోవడం చాలా ముఖ్యం

ముందుగా కవరేజ్ వివరాలు వస్తాయి. ఆ పాలసీలో కవర్ అయ్యే వ్యాధులు - వెయిటింగ్ పిరియడ్ పై చాలా శ్రద్ధ వహించండి. ఎందుకంటే మీకు పాలసీ తీసుకున్న వెంటనే ఇన్సూరెన్స్ కంపెనీ కవర్ ఇవ్వడం స్టార్ట్ చేయదు. పాలసీ కవర్ కావడానికి 3 రకాల వెయిటింగ్ పీరియడ్‌లు ఉన్నాయి. మొదటిది ప్రామాణికమైనది. దీనికి 30-రోజుల వ్యవధి ఉంటుంది. ఈ వెయిటింగ్ పిరియడ్..

Health Insurance: మీరు ఇన్సూరెన్స్‌ తీసుకుంటున్నారా..? ఈ రూల్స్‌ తెలుసుకోవడం చాలా ముఖ్యం
Health Insurance
Follow us
Subhash Goud

|

Updated on: Oct 05, 2023 | 5:11 PM

చాలా మందికి మన హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీల ఫైన్ ప్రింట్ చదవడం చాలా కష్టం. పాలసీలో కవరేజ్ వివరాలు, ప్రీమియంలు, పాలసీ పరిమితులు, క్లెయిమ్‌ల ప్రక్రియ – రెన్యూవల్/టర్మినేషన్ క్లాజుల కోసం తనిఖీ చేయడం చాలా కీలకమని ఆరోగ్య బీమా నిపుణుడు భక్తి రసాల్ చెప్పారు. అందుకోసం ఆ డాక్యుమెంట్ లోని అన్ని నిబంధనలను వివరించే కీ డెఫినిషన్ విభాగాన్ని చదవడం నుంచి ప్రారంభించడం మంచిది. ఆ తర్వాత, మీ ఆరోగ్య బీమాను బాగా అర్థం చేసుకోవడానికి ఈ విభాగాలను చదవండి.

ముందుగా కవరేజ్ వివరాలు వస్తాయి. ఆ పాలసీలో కవర్ అయ్యే వ్యాధులు – వెయిటింగ్ పిరియడ్ పై చాలా శ్రద్ధ వహించండి. ఎందుకంటే మీకు పాలసీ తీసుకున్న వెంటనే ఇన్సూరెన్స్ కంపెనీ కవర్ ఇవ్వడం స్టార్ట్ చేయదు. పాలసీ కవర్ కావడానికి 3 రకాల వెయిటింగ్ పీరియడ్‌లు ఉన్నాయి. మొదటిది ప్రామాణికమైనది. దీనికి 30-రోజుల వ్యవధి ఉంటుంది. ఈ వెయిటింగ్ పిరియడ్ లో రోడ్డు ప్రమాదానికి సంబంధించిన క్లెయిమ్‌లు మినహా, ఇతర క్లెయిమ్‌లు వేటినీ అంగీకరించరు.

రెండవది ముందుగా ఉన్న వ్యాధుల కోసం వేచి ఉండే కాలం. పాలసీని తీసుకోవడానికి ముందు నుంచీ మీరు మధుమేహంతో బాధపడుతున్నారని అనుకోండి. ఆటువంటి పరిస్థితిలో డయాబెటిస్ కి సంబంధించిన ఏవైనా క్లెయిమ్‌లు ఈ సమయం దాటిన తర్వాత మాత్రమే మీ బీమా సంస్థ ద్వారా ఆమోదిస్తారు. ఐఆర్‌డీఏఐ నియమాల ప్రకారం, ఈ వ్యవధి 48 నెలలకు మించకూడదు.

ఇవి కూడా చదవండి

మూడవదిగా నిర్దిష్ట వ్యాధులు – విధానాల కోసం వేచి ఉండే కాలం ఉంది. ఉదాహరణకు కొన్ని పాలసీలు జాయింట్ రీప్లేస్‌మెంట్ సర్జరీకి 3 ఏళ్ల వెయిటింగ్ పీరియడ్, కంటిశుక్లం ఆపరేట్ చేయడానికి 2 ఏళ్లు అలాగే డయాలసిస్ అవసరమయ్యే కిడ్నీ ఫెయిల్యూర్‌ను కవర్ చేయడానికి రెండేళ్లు ఉంటాయి. అన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు వెయిటింగ్ పిరియడ్ ను నిర్దిష్ట వ్యాధులను ఈ వ్యవధి ముగిసిన తర్వాత మాత్రమే కవర్ చేయడం ప్రారంభిస్తాయి.

తర్వాత మీ పాలసీ అందించే యాడ్స్ అండ్ ఎక్సమ్షన్స్ ఏమిటో చెక్ చేయండి. యాడ్స్ ఏమి కవర్ అవుతాయో మీకు తెలియజేస్తాయి. అయితే ఎక్సమ్షన్స్ కవర్ కాసాని వాటిని లిస్ట్ చేస్తాయి. కొన్ని సాధారణ మినహాయింపులలో సాహస క్రీడలు, సౌందర్య సాధనాలు, బరువు తగ్గించే శస్త్రచికిత్సల సమయంలో తగిలిన గాయాలు ఉంటాయి.

మరొక ముఖ్యమైన విభాగం పాలసీ పరిమితులు. ఈ విభాగంలో నిర్దిష్ట సేవ లేదా చికిత్స కోసం బీమా కంపెనీ చెల్లించే గరిష్ట మొత్తాన్ని మీరు చూడొచ్చు. ఇది చాలా ముఖ్యం ఎందుకంటే దీనిని వదిలివేస్తే ఈ పరిమితులు మీ జేబులను ఖాళీ చేస్తాయి. ఇవి సాధారణంగా రూమ్ రెంట్, అంబులెన్స్ కవర్, ఆసుపత్రిలో చేరే ముందు అలాగే పోస్ట్ హాస్పిటలైజేషన్ ఖర్చులపై వర్తిస్తాయి.

ప్రీమియం – సహ-చెల్లింపునకు సంబంధించిన నిబంధనలను కూడా చెక్ చేయండి. ప్రీమియం చెల్లింపు ఫ్రీక్వెన్సీని గమనించండి. అది వార్షికంగా, నెలవారీగా చెల్లించాల్సిన అవసరం ఉందా లేదా అన్నది గమనించండి. నో-క్లెయిమ్ బోనస్, గడువు తేదీలు – ప్రీమియం చెల్లింపులో డిఫాల్ట్‌గా ఉన్న పరిణామాల కోసం నిబంధనలను చెక్ చేయండి.

అంతేకాకుండా మీ పాలసీకి కోపేమెంట్ నిబంధన ఉందో లేదో ప్రత్యేకంగా గమనించండి. కోపేమెంట్అంటే బీమా సంస్థ మొత్తం ఖర్చులో కొంత శాతాన్ని మాత్రమే చెల్లించడానికి అంగీకరిస్తుంది. మొత్తం డబ్బు కాదు. ఉదాహరణకు, మీ పాలసీకి 10% కో పేమెంట్ నిబంధన ఉందనుకోండి.. మీరు రూ. 2,00,000 క్లెయిమ్ చేస్తే కనుక ఇన్సూరెన్స్ కంపెనీ రూ.1,80,000 మాత్రమే చెల్లిస్తుంది. మిగిలిన రూ.20,000 మీరే భరించాల్సి ఉంటుంది.

తర్వాత, క్లెయిమ్ ఫైల్ చేసేటప్పుడు అనుసరించాల్సిన విధానం, డాక్యుమెంటేషన్ అలాగే టైమ్‌లైన్ కోసం చెక్ చేయండి. దీన్ని అర్థం చేసుకోవడం ద్వారా దీన్ని మీరు సజావుగా నావిగేట్ చేయడంలో సహాయపడుతుంది. మీరు అర్హులైన ప్రయోజనాలను పొందారని నిర్ధారించుకోండి.

ఒకవేళ మీరు మీ పాలసీని రద్దు చేయాలనుకుంటే, టైమ్‌లైన్‌ను చెక్ చేయండి దానితో పాటు మీకు రీఫండ్ వచ్చే ప్రీమియం కూడా చెక్ చేసుకోవాలి. చాలా సందర్భాలలో మీరు 180 రోజులలోపు కంపెనీని తెలియజేయకుంటే ఏ మొత్తం తిరిగి చెల్లించరు. మీరు పాలసీ ప్రారంభించిన 3 నెలల్లోపు బీమా సంస్థకు తెలియజేసినట్లయితే మీరు మీ ప్రీమియంలో 50% వరకు తిరిగి పొందవచ్చు. ఫ్రీ-లుక్ పీరియడ్ వ్యవధిని కూడా గమనించండి. మీరు ఈ వ్యవధిలోపు పాలసీని రద్దు చేయాలని నిర్ణయించుకుంటే, మీరు మొత్తం ప్రీమియం మొత్తాన్ని తిరిగి పొందవచ్చు. హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ప్రస్తుత పరిస్థితిలో అత్యవసరం. అయితే, మీరు పాలసీ తీసుకునే ముందు కంపెనీ నిబంధనలు తెలుసుకోకపోతే కనుక భారీగా నష్టపోయే అవకాశం ఉంటుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
పూనకాలు లోడింగ్.. పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ మామూలుగా ఉండదు మరి..
పూనకాలు లోడింగ్.. పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ మామూలుగా ఉండదు మరి..
చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?
చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన
కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్
కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్
పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..
పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.ఇలా మారిపోయింది ఏంటి
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.ఇలా మారిపోయింది ఏంటి
పుష్ప2 పై తప్పుడు ప్రచారం.. అవేమీ నమ్మకండి.! మూవీ టీం క్లారిటీ..
పుష్ప2 పై తప్పుడు ప్రచారం.. అవేమీ నమ్మకండి.! మూవీ టీం క్లారిటీ..
టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్ భార్య.
టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్ భార్య.
దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట.! SJ సూర్య మాటలు వింటే గూస్బంప్స్.
దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట.! SJ సూర్య మాటలు వింటే గూస్బంప్స్.