Income Tex: ఎల్‌ఐసీకి షాకిచ్చిన ఆదాయపు పన్ను శాఖ.. రూ.84 కోట్ల జరిమానా విధిస్తూ నోటీసులు
ఆదాయపు పన్ను శాఖ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్‌ఐసీ) కి షాకిచ్చింది. పన్నుకు సంబంధించిన నోటీసులు జారీ చేసింది. భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్‌ఐసి)కి రూ.84 కోట్ల జరిమానా విధిస్తూ ఆదాయపు పన్ను శాఖ నోటీసు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇది మూడు అసెస్‌మెంట్ సంవత్సరాలలో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్‌ఐసీ) చెల్లించని పన్ను మొత్తం. గత వారం..
ఎల్‌ఐసీ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఇండియా ద్వారా కోట్లాది మంది బీమా పాలసీలను పొందుతుంటారు. ప్రజల కోసం ఈ ఎల్‌ఐసీ కంపెనీ రకరకాల పాలసీలను రూపొందిస్తోంది. ఈ నేపథ్యంలో ఆదాయపు పన్ను శాఖ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్‌ఐసీ) కి షాకిచ్చింది. పన్నుకు సంబంధించిన నోటీసులు జారీ చేసింది. భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్‌ఐసి)కి రూ.84 కోట్ల జరిమానా విధిస్తూ ఆదాయపు పన్ను శాఖ నోటీసు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇది మూడు అసెస్‌మెంట్ సంవత్సరాలలో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్‌ఐసీ) చెల్లించని పన్ను మొత్తం. గత వారం (సెప్టెంబర్ 29) ఐటీ నోటీసు అమల్లోకి వచ్చింది. ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఎల్‌ఐసీ కోర్టును ఆశ్రయించాలని నిర్ణయించింది. ఎల్‌ఐసీ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో ఈ విషయాన్ని వెల్లడించింది.
2012-13, 2018-19, అలాగే 2019-20 అసెస్‌మెంట్ సంవత్సరాల లో పన్ను చెల్లించనందుకు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఇండియా (ఎల్‌ఐసీ)కి కి జరిమానా విధించబడింది. 2012-13 అసెస్‌మెంట్ సంవత్సరానికి, అంటే 2011-12 ఆర్థిక సంవత్సరంలో రూ.12.61 కోట్ల జరిమానా విధించారు. 2018-19 అసెస్‌మెంట్ సంవత్సరానికి రూ. 33.82 కోట్లు, 2019-20 ఆర్థిక సంవత్సరానికి రూ. 37.58 కోట్ల జరిమానా విధించబడింది. ఐటీ చట్టం 1961లో ని సెక్షన్లు 271(1)(సి), 270 ఏ నిబంధనలను ఎల్‌ఐసీ ఉల్లంఘించిందని, జరిమానా విధించినట్లు సెప్టెంబర్ 29 న దాఖలు చేసిన నోటీసు లో ఆదాయపు పన్ను శాఖ పేర్కొంది.
గత నెలలో రూ.290 కోట్ల చెల్లింపునకు జీఎస్టీ నోటీసు:
గత సెప్టెంబర్‌లో ఎల్‌ఐసీకి జీఎస్‌టీ నోటీసు ఇచ్చింది. మొత్తం రూ.290 జీఎస్టీ చెల్లించాలని నోటీసులో పేర్కొన్నారు. జీఎస్టీ బేస్ అమౌంట్ రూ.166.8 కోట్లు, పన్ను రూ.107.1 కోట్లు, పెనాల్టీ రూ.16.7 కోట్లు మొత్తం రూ.290 కోట్లు చెల్లించాలని పన్ను శాఖ డిమాండ్ చేసింది. ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్‌ను దుర్వినియోగం చేయడంతో పాటు ఎల్‌ఐసి వివిధ ఉల్లంఘనలకు పాల్పడినట్లు ఆరోపణలు ఆరోపణలు రావడంతో ఆదాయపు పన్ను శాఖ వివరాలను తెలుసుకుని ఈ పన్ను నోటీసులను జారీ చేసినట్లు తెలుస్తోంది.
ఇక ఆ తర్వాత ఎల్‌ఐసీ షేర్లు నష్టాలను చవిచూశాయి. సెప్టెంబర్ 28 నుండి దాని షేరు ధర నిరంతరం పడిపోతుంది. రూ.650 ఉన్న దీని షేరు ధర ఇప్పుడు రూ.639కి పడిపోయింది. ఎల్‌ఐసీ భారతదేశపు నంబర్ వన్ బీమా కంపెనీ మే 2022లో స్టాక్ మార్కెట్‌లో జాబితా చేయబడింది. రూ.826 ఉన్న షేరు ప్రారంభ ధర ఇప్పుడు రూ.186కు పైగా పడిపోయింది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి