Home Loan: హోమ్‌లోన్ తీసుకుంటున్నారా..? ఆ విషయాలు తెలుసుకోకపోతే మీ సొమ్ము ఫసక్
సొంత ఇల్లు అనేది ప్రతి ఒక్కరికీ ఓ సెంటిమెంట్. అయితే ఇల్లు కొనడం అనేది కేవలం ఆర్థిక నిర్ణయం మాత్రమే కాదని ప్రతిష్టాత్మకమైన కలను నెరవేర్చడానికి ఒక ప్రయాణమని నిపుణులు చెబుతున్నారు. కానీ పెరిగిన ఖర్చుల నేపథ్యంలో ఇల్లు కొనుగోలు అనేది చాలా కష్టతరమైన పనిగా ఉంటుంది. అందువల్ల కచ్చితంగా ఇల్లు కొనుగోలుకు చాలా మంది గృహ రుణాలపై ఆధారపడుతూ ఉంటారు. ఈ నేపథ్యంలో హోమ్ లోన్ తీసుకునే సమయంలో ఏ అంశాలను పరిగణలోకి తీసుకోవాలి? అనే విషయాలను ఓ సారి తెలుసుకుందాం.
సొంత ఇల్లు కొనుగోలుకు బ్యాంకు రుణాలపై ఆధారపడే వారి సంఖ్య బాగా పెరిగింది. ముఖ్యంగా భారతదేశంలో ఉద్యోగుల సంఖ్య ఎక్కువ కాబట్టి నెలనెలా సమాన వాయిదాల రూపంలో చెల్లించేందుకు గృహ రుణాలను తీసుకుంటున్నారు. అయితే ఇలా హోమ్ లోన్ తీసుకునే సమయంలో చేసే తప్పుల వల్ల పెద్ద ఎత్తున నష్టపోవాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి రుణం తీసుకునే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం.
రుణ మొత్తం
మీరు బ్యాంకు లేదా రుణదాత నుంచి తీసుకునే రుణ మొత్తంపై అవగాహనతో ఉండాలి. మీ అవసరానికి అనుగుంగా మాత్రమే మీరు రుణం తీసుకోవాలి. ఎక్కువ తీసుకుంటే అధిక వడ్డీలతో ఇబ్బంది పడాల్సి ఉంటుంది.
ఈఎంఐ
రుణాన్ని తిరిగి చెల్లించడానికి మీరు చేసే నెలవారీ చెల్లింపు. ఇందులో అసలు, వడ్డీ రెండూ ఉంటాయి. అధిక లోన్ మొత్తం తీసుకునే అధిక వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది.
వడ్డీ రేటు
మీరు డబ్బును రుణం తీసుకోవడానికి అనుమతించినందుకు రుణదాత విధించిన రుసుము. ఇది రెండు రకాలుగా ఉండవచ్చు: స్థిర రేటు అంటే లోన్ వ్యవధిలో ఇది మారదు. ఫ్లోటింగ్ రేట్ అంటే మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా మార్పులు, మీ ఈఎంలు పెరగవచ్చు లేదా తగ్గవచ్చు.
రుణ కాల వ్యవధి
మీరు రుణాన్ని తిరిగి చెల్లించే కాలం. సాధారణంగా భారతదేశంలో గృహ రుణ కాలపరిమితి 5 నుండి 30 సంవత్సరాల వరకు ఉంటుంది. ఎక్కువ కాలం అంటే చిన్న ఈఎంఐలు పెట్టుకుంటే రుణ మొత్తం మీద ఎక్కువ వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది.
లోన్-టు-వాల్యూ రేషియో
బ్యాంక్ రుణం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న ఆస్తి విలువ శాతం. ఉదాహరణకు ఆస్తి విలువ రూ. 50 లక్షలుగా ఉంటే బ్యాంక్ 80% ఎల్‌టీవీను అందిస్తే మీరు రూ. 40 లక్షల రుణాన్ని పొందవచ్చు. మిగిలిన రూ.10 లక్షలు మీ డౌన్ పేమెంట్‌గా చెల్లించాల్సి ఉంటుంది.
ప్రాసెసింగ్ రుసుము
మీ లోన్ అప్లికేషన్‌ను ప్రాసెస్ చేయడానికి బ్యాంక్ విధించే ఛార్జీ. ఇది సాధారణంగా 0.25 శాతం నుండి 1 శాతం వరకు ఉంటుంది.
ముందస్తు చెల్లింపులు
పదవీకాలం ముగిసేలోపు మీ లోన్‌లో కొంత భాగాన్ని చెల్లించడం. ఇలా చేయడం ద్వారా మీ ప్రధాన మొత్తంపై వడ్డీని తగ్గింపును పొందవచ్చు. అలాగే లోన్ పదవీకాలం ముగిసేలోపు మొత్తం లోన్ మొత్తాన్ని చెల్లిస్తే ఫోర్ క్లోజర్ అంటారు. కొన్ని బ్యాంకులు ముందస్తు చెల్లింపుపై ఫెనాల్టీని వసూలు చేస్తాయి.
క్రెడిట్ స్కోర్
మీ క్రెడిట్ స్కోర్ మీ క్రెడిట్ యోగ్యతను ప్రతిబింబిస్తుంది. హౌసింగ్ లోన్‌లకు ఆకర్షణీయమైన వడ్డీ రేట్లను పొందడానికి 750 కంటే ఎక్కువ స్కోర్ అనువైనది.
మార్జిన్ మనీ
మీరు మీ సొంతంగా ఏర్పాటు చేసుకోవలసిన మొత్తం ఆస్తి విలువలో సాధారణంగా 10–20% ఉంటుంది. బ్యాంకులు ఈ భాగాన్ని కవర్ చేయవు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి