AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Job Scam: అమెజాన్‌లో జాబ్ అంటూ ఇన్‌స్టాలో పోస్ట్.. రూ.1.94 లక్షలు హాంఫట్

ఇటీవల కాలంలో ఆన్‌లైన్ మోసాలు బాగా పెరిగాయి. ముఖ్యంగా కరోనా తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్‌లను డిమాండ్ పెరిగింది. అలాగే పార్ట్ టైమ్ జాబ్స్ చేయడానికి గృహిణులు ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ కొందరు జాబ్స్ పోస్ట్ చేస్తున్నారు. అయితే ఇలా జాబ్ పోస్ట్స్ ద్వారా కేటుగాళ్లు మోసానికి తెరలేపారు. ఈ నేపథ్యంలో ఇన్‌స్టా జాబ్ పోస్ట్ మోసానికి గురైన యువతి గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

Job Scam: అమెజాన్‌లో జాబ్ అంటూ ఇన్‌స్టాలో పోస్ట్.. రూ.1.94 లక్షలు హాంఫట్
Fraudgpt
Nikhil
|

Updated on: Nov 19, 2024 | 3:15 PM

Share

కర్ణాటకలోని ఉడిపికి చెందిన 25 ఏళ్ల అర్చన అనే యువతి ఇన్‌స్టాలో షేర్ చేసిన లింక్‌పై క్లిక్ చేసి రూ.1.94 లక్షలు పోగొట్టుకుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో స్క్రోలింగ్ చేస్తున్నప్పుడు అధిక జీతం ఆఫర్ చేస్తూ ఉన్న ఉద్యోగ ప్రకటన  వచ్చింది. వెంటనే ఆ లింక్‌ను క్లిక్ చేయగా పెట్టుబడి పేరుతో మోసానికి గురైంది. అర్చన పార్ట్‌టైమ్ ఉద్యోగావకాశాల కోసం వెతుకుతున్నప్పుడు ఆమె “అమెజాన్ ఫ్రెషర్స్ జాబ్ ఇన్ ఇండియా”ని ప్రచారం చేస్తూ ఒక ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌ను వచ్చింది. ఈ ఆఫర్‌పై ఆసక్తిగా ఉన్న ఆమె లింక్‌పై క్లిక్ చేసింది. కొద్దిసేపటి తర్వాత ఆమెకు సాధారణ ఆన్‌లైన్ టాస్క్‌ల కోసం లాభదాయకమైన రిటర్న్‌లను అందిస్తామంటూ అన్‌నోన్ పర్సన్స్ నుంచి వాట్సాప్‌లో మెసేజ్‌లు వచ్చాయి. ఇనిషియల్ టాస్క్స్ చేశాక కొంత రాబడిని అందుకుంది. అయితే ఇంకా ఎక్కువ ఆదాయం కావాలంటే పెట్టుబడుతలతో సాధ్యమని మోసగాళ్లు ఆమెను సంప్రదించారు. 

ఈ ఆఫర్‌ని నమ్మిన బాధితురాలు సులభంగా డబ్బు సంపాదించే అవకాశంగా భావించింది. ఆమె వారి సూచనలను శ్రద్ధగా అనుసరించింది. అలాగే స్కామర్‌లు అందించిన వివిధ యూపీఐ ఐడీలకు నిధులను బదిలీ చేయడం ప్రారంభించింది. అక్టోబర్ 18 నుంచి అక్టోబర్ 24 మధ్య ఆమె మొత్తం రూ.1.94 లక్షలు బదిలీ చేసింది. అయితే, ఆమె లాభాలను ఉపసంహరించుకోవడానికి ప్రయత్నించినప్పుడు, ఆమె మోసపోయానని గ్రహించింది. డబ్బును విత్‌డ్రా చేసేందుకు ఆమె చేసిన ప్రయత్నాలు విఫలంకావడంతో పోలీసులను ఆశ్రయించింది. 

ఇటీవలి కాలంలో చాలా మంది వ్యక్తులు సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో ఇలాంటి మోసాలకు గురి అవుతున్నారని పోలీసులు చెబుతున్నారు. స్కామర్లు అదనపు ఆదాయాన్ని సంపాదించాలనే ప్రజల కోరికనే పెట్టుబడిగా ఎంచుకుని అలాంటి వారిని మోసగిస్తున్నారు. ఇలాంటి మోసాలపై ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు ఎప్పటికప్పుడు హెచ్చరిస్తున్నప్పటికీ పెద్దగా ఫలితం ఉండడం లేదు. ముఖ్యంగా సోషల్ మీడియా లేదా మెసేజింగ్ యాప్‌లలో షేర్ చేసే జాబ్ ఆఫర్‌ల ప్రామాణికతను ఎల్లప్పుడూ క్రాస్ చెక్ చేయాలని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా కంపెనీలు లింక్డ్‌ఇన్ వంటి అధికారిక వెబ్‌సైట్‌లు లేదా వారి సొంత వెబ్‌సైట్‌లు, రిక్రూట్‌మెంట్ కోసం ఇమెయిల్ కమ్యూనికేషన్‌లను ఉపయోగిస్తాయని పేర్కొంటున్నారు. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి