Winter driving: పొగమంచులో డ్రైవింగ్ చేస్తున్నారా..? ఈ జాగ్రత్తలు తీసుకోకుంటే ప్రమాదమే..!

శీతాకాలం మొదలు కావడంతో దేశంలో ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గిపోతున్నాయి. నిన్నామొన్నటి వరకూ ఎండలు, ఉక్కబోతతో ఇబ్బంది పడిన ప్రజలు చల్లని వాతావరణంతో సేదతీరుతున్నారు. దక్షిణాదితో పోల్చితే ఉత్తరాదిలో చలి ఎక్కువగా ఉంటుంది.

Winter driving: పొగమంచులో డ్రైవింగ్ చేస్తున్నారా..? ఈ జాగ్రత్తలు తీసుకోకుంటే ప్రమాదమే..!
Winter Car Driving
Follow us
Srinu

|

Updated on: Nov 14, 2024 | 3:00 PM

ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీలో చలి తీవ్రత ఎక్కువగా ఉంది. దట్టమైన పొగమంచు కమ్ముకోవడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఎదురుగా వచ్చే వాహనం కూడా కనిపించడం లేదు. ఢిల్లీతో పాటు నోయిడా, ఎన్సీఆర్ ఇతర ప్రాంతాలలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో వాహనాలను చాలా జాగ్రత్తగా నడపాలి. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే పొగమంచులోనూ సురక్షితంగా డ్రైవింగ్ చేయవచ్చు. పొగమంచులో వాహనాలను నడిపేవారు చాలా నెమ్మదిగా, స్థిరంగా వెళ్లడం చాలా ముఖ్యమైన నియమం. పొగమంచు కారణంగా మీ ముందు ఉండే వాహనం తప్ప, ఆపై ఉండే వాహనాలు కనిపించవు. మీరు నెమ్మదిగా వెళ్లడం వల్ల సురక్షితంగా ఉండవచ్చు. ఎదురుగా ఆకస్మాత్తుగా వాహనం వచ్చినా మన వాహనాన్ని నియంత్రించుకోవచ్చు. కాబట్టి డ్రైవింగ్ చేసేటప్పుడు చాాలా అప్రమత్తంగా ఉండాలి.

పొగమంచు సమయంలో ముందు వెళుతున్న వాహనాలను ఓవర్ టేక్ చేసేందుకు అసలు ప్రయత్నించకూడదు. దాదాపు 90 శాతం ప్రమాదాలు దీని వల్లే జరుగుతున్నాయి. మంచు కారణంగా కంటిచూపు పరిధి బాగా తగ్గిపోతుంది. ముందున్న వాహనాలను సరిగ్గా గుర్తించలేం. రోడ్డుపై ఉండే లైన్ల కూడా సరిగ్గా గమనించలేం. ఈ సమయంలో ముందున్న వాహనాలను ఓవర్ టేక్ చేయడం వల్ల యాక్సిడెంట్లు అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. వాహనాల మధ్య దూరం పాటించడం చాలా అత్యవసరం. ముందు వెళుతున్న వాహనం ఏదైనా కారణంతో ఆకస్మాత్తుగా ఆగిపోతే వెనుక వచ్చే వాహనం దాన్ని ఢీకొనే ప్రమాదం ఉంది. మంచు కారణంగా సరిగ్గా కనిపించక ఇలా ప్రమాాదాలు జరిగి అవకాశం ఉంది. కాబట్టి మీ ముందు వెళుతున్న వాహనానికి కొంచె దూరం పాటిస్తూ డ్రైవింగ్ చేయాలి. ఇది పొగమంచులోనే కాదు ఎండల సమయంలోనూ తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్త.

పొగమంచు ఏర్పడినప్పడు బయటకు వెళ్లకపోవడమే ఉత్తమం. అయితే అత్యవసర సమయంలో బయటకు వెళ్లాల్సి వచ్చినప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఫాగ్ లైట్లు, ఇండికేటర్ లైట్లను ఆన్ చేయాలి. దీని వల్ల ముందూ వెనుక వాహనాల డ్రైవర్లకు మన వాహనం కనిపిస్తుంది. అలాగే అవసరమైనప్పుడు హార్న్ ను కూడా ఉపయోగిస్తూ ఉండాలి. శీతాకాలంలో వాహనాల అద్దాలపై మంచు పేరుకుపోతుంది. దీనివల్ల ఎదురుగా వచ్చే వాహనాలను గమనించలేం. కాబట్టి పొగమంచు వాతావరణంలో వాహనం అద్దాలను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. విండ్ షీల్ద్, కిటికీలను శుభ్రం చేస్తూ ఉండాలి. డీఫాగర్ లేదా హీటర్ ను ఉపయోగించుకోవాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..