Business Idea: చాలా తక్కువ మందికి తెలిసిన బిజినెస్.. భారీగా ఆదాయం..
ప్రస్తుతం వ్యాపారం చేయాలనుకుంటున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అయితే అందరు చేసే వ్యాపారం కాకుండా కొత్తగా ఆలోచిస్తే లాభాలు భారీగా ఆర్జించవచ్చు. అలాంటి ఎన్నో మంచి బిజినెస్ ఐడియాలు ఉన్నాయి. అలాంటి బెస్ట్ బిజినెస్ ఐడియాల్లో ఒక దాని గురించి ఈ రోజు తెలుసుకుందాం..
మారిన మార్కెట్ అవసరాలకు అనుగుణంగా వ్యాపారాలు ప్రారంభిస్తే భారీగా లాభాలు ఆర్జించవచ్చని వ్యాపార నిపుణులు చెబుతుంటారు. ప్రస్తుం మార్కెట్లో జూట్ బ్యాగులకు భారీగా డిమాండ్ ఉంటోంది. ముఖ్యంగా పర్యావరణ పరిరక్షణ నేపథ్యంలో ప్లాస్టిక్ వినియోగం తగ్గించే ఉద్దేశంతో జూట్ బ్యాగులను ఎక్కువగా ఉపయోసిస్తున్నారు.
ఇలా ఎంతో స్కోప్ ఉన్న జూట్ బ్యాగుల తయారీని ప్రారంభించడం ద్వారా మంచి లాభాలు ఆర్జించవచ్చు. అయితే ఇందులోనూ కస్టమైజ్ బ్యాగులను తయారు చేయడం వల్ల ఈ రంగంలో ఉన్న పోటీని కూడా తట్టుకొని మార్కెట్‌లో నిలబడొచ్చు. ముఖ్యంగా పుట్టిన రోజులకు, ఫంక్షన్లకు రిటర్న్ గిఫ్టులు.. దుకాణాలకు వారి లోగోను ప్రింట్ చేసిన బ్యాగులను తయారు చేయొచ్చు.
ఈ వ్యాపారం మొదలు పెట్టడానికి ముందుగా క్లాత్‌తో పాటు జిప్పులు వంటి రా మెటీరియల్స్‌ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. చిన్న మొత్తంతోనే ఈ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. ఇందుకోసం మిషిన్ అవసరపడుతుంది. రా మెటీరియల్స్ అందిస్తున్న సంస్థలు ఎన్నో అందుబాటులో ఉన్నాయి. బ్యాగ్ క్లాత్‌పై లోగోలను ప్రింట్ చేసి బ్యాగ్‌లను విక్రయించవచ్చు. మొబైల్ పౌచ్‌లు మొదలు, టిఫిన్ బ్యాగ్‌ల వరకు అన్నింటిని తయారు చేయొచ్చు. ల్యాప్‌టాప్ బ్యాగ్‌లను కూడా తయారు చేయొచ్చు.
జూట్ బ్యాగ్ తయారీని రూ. 2 లక్షల ప్రారంభ పెట్టుబడితో ప్రారంభించవచ్చు. ముఖ్యంగా మహిళలకు ఇంట్లో ఉంటూనే ఈ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. ఆఫ్‌లైన్‌తో పాటు, ఆన్‌లైన్‌లో కూడా ఈ బ్యాగులను విక్రయించుకోవచ్చు. ఇక లాభాల విషయానికొస్తే హోల్‌సేల్‌లో ఒక్కో బ్యాగ్‌పై తక్కువలో తక్కువ రూ. 5 నుంచి రూ. 10 లాభం ఆర్జించవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..