Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IT Returns: ఆదాయ పన్ను చెల్లించాలా? అయితే ఈ ఫారం గురించి తెలుసుకోవాల్సిందే.. లేకుంటే ఇబ్బందిపడతారు!

ఏడు రకాల ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫామ్స్‌ అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో ఎక్కువ మందికి ఉపయోగపడే ఫారమ్ ఐటీఆర్ 1. దీనినే సహజ్ అని కూడా పిలుస్తారు. దీనిని ఎవరు దాఖలు చేయాలి? ఎవరు చేయకూడదు? ఎలా చేయాలి? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

IT Returns: ఆదాయ పన్ను చెల్లించాలా? అయితే ఈ ఫారం గురించి తెలుసుకోవాల్సిందే.. లేకుంటే ఇబ్బందిపడతారు!
Taxpayers
Follow us
Madhu

|

Updated on: Mar 24, 2023 | 12:00 PM

ఆదాయ పన్ను చట్టం ప్రకారం.. ఒక ఆర్థిక సంవత్సరంలో ఆర్జించిన సంపదపై ట్యాక్స్ స్లాబ్స్ ప్రకారం పన్ను చెల్లించాలి. ఇన్ కమ్ ట్యాక్స్ ఫైలింగ్ అనేది సామాన్య ప్రజలకు ఓ బ్రహ్మ పదార్థంలా కనిపిస్తుంటుంది. దానిలోని నియమాలు, నిబంధనలు, క్లాజ్లు ఓ పట్టాన అర్థం కావు. అయితే ఈ ప్రక్రియను సులభతరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఎన్నో కొత్త సంస్కరణలు చేపడుతోంది. వీటిల్లో చాలా రకాల ఫారమ్స్ ఉంటాయి. వాటిల్లో ఏది ఎవరు తీసుకోవాలి అనే విషయంలో గందరగోళం ఉంటుంది. అందుకే ప్రభుత్వం దీనిని సరళీకృతం చేసేందుకు ఆదాయం, ఇన్‌కమ్ సోర్స్ ఆధారంగా ట్యాక్స్ పేయర్స్‌ను అనేక విభాగాలుగా వర్గీకరించింది. ఒక్కో వర్గం వారికి నిర్ధిష్ట నియమ, నిబంధనల ప్రకారం ట్యాక్స్ రూల్స్ వర్తిస్తాయి. వీటి ప్రకారమే వ్యక్తులు ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయాలి. ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేయాలంటే పన్ను చెల్లింపుదారులందరూ తమ ఆధార్ కార్డును వారి పాన్‌తో లింక్ చేయడం తప్పనిసరి.

ఐటీఆర్ ఫామ్ రకాలు..

ఏడు రకాల ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫామ్స్‌ అందుబాటులో ఉన్నాయి. ఐటీఆర్ 1 నుంచి ఐటీఆర్ 7 వరకు ఉన్నాయి. ఇది పన్ను చెల్లింపు దారుడికి వర్తించే ఫారమ్ ను అతని ఆదాయం, వర్గం వంటి వివిధ అంశాల ద్వారా నిర్ణయించబడుతుంది. వీటిల్లో ఎక్కువ మందికి ఉపయోగపడే ఫారమ్ ఐటీఆర్ 1 దీనినే సహజ్ అని కూడా పిలుస్తారు. దీనిని ఎవరు దాఖలు చేయాలి? ఎవరు చేయకూడదు? ఎలా చేయాలి? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

ఐటీఆర్-1 లేదా సహజ్‌ను ఎవరు ఫైల్ చేయాలి?

ఒక ఆర్థిక సంవత్సరంలో మొత్తం ఆదాయం రూ.50 లక్షలకు మించని వారు ఐటీఆర్-1 ఫైల్ చేయాలి. శాలరీ, హౌస్ ప్రాపర్టీ, ఫ్యామిలీ పెన్షన్ ఆదాయం, వ్యవసాయ ఆదాయం (రూ. 5000 వరకు)తో పాటు కొన్ని ఇతర సోర్సెర్స్ నుంచి ఆదాయం ఆర్జించేవారు సహజ్ ఫారం సమర్పించాలి. ఈ లిస్ట్‌ ఇదే..

ఇవి కూడా చదవండి
  • సేవింగ్స్ అకౌంట్స్ నుంచి అందే వడ్డీ
  • బ్యాంక్, పోస్టాఫీస్, కోఆపరేటివ్ సొసైటీ వంటి సంస్థల్లో డిపాజిట్ల నుంచి అందే వడ్డీ
  • ఆదాయపు పన్ను వాపసు (Tax Refund) నుంచి వడ్డీ
  • ఎన్‌హ్యాన్స్‌డ్ కాంపెన్షేషన్‌పై పొందిన వడ్డీ
  • ఏదైనా ఇతర వడ్డీ ఆదాయం
  • ఫ్యామిలీ పెన్షన్
  • జీవిత భాగస్వామి ఆదాయం (పోర్చుగీస్ సివిల్ కోడ్ కింద కవర్ అయ్యేవి కాకుండా) లేదా మైనర్ ఆదాయం (ఇన్‌కమ్ సోర్స్ పేర్కొన్న విధంగా పేర్కొన్న పరిమితుల్లో ఉంటే మాత్రమే).

మీరు అనర్హులు..

బిజినెస్ ద్వారా డబ్బు సంపాదించే వారు, స్వయం ఉపాధి పొందుతున్న వారు, క్యాపిటల్ గెయిన్స్ పొందే వారు, రూ.10 లక్షలకు పైగా డివిడెంట్ ఆదాయం కలిగిన వారు, వివరణ ఇవ్వని ఆదాయం కలిగిన వారు, అగ్రికల్చర్ ఆదాయం రూ.5 వేలు దాటిన వారు, భారత్ వెలుపల ఆదాయం కలిగిన వారు ఈ ఫామ్‌ను సమర్పించడానికి వీలుండదు. వార్షిక ఆదాయం రూ. 50 లక్షల కన్నా ఎక్కువ ఉన్న వారు, నాన్ రెసిడెంట్ ఇండియన్లు, లాటరీ, రేసుగుర్రాలు, చట్టపరమైన జూదం మొదలైన వాటి నుంచి డబ్బు సంపాదిస్తున్నవారు కూడా ఈ ఫామ్ సమర్పించకూడదు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ట్రైన్ టికెట్ కాన్సిల్ చేస్తే.. డబ్బులు రిఫండ్‌ పొందటం ఎలా?
ట్రైన్ టికెట్ కాన్సిల్ చేస్తే.. డబ్బులు రిఫండ్‌ పొందటం ఎలా?
హైదరాబాద్​లో యాపిల్ పాడ్స్ తయారీ !! కానీ మన కోసం కాదు
హైదరాబాద్​లో యాపిల్ పాడ్స్ తయారీ !! కానీ మన కోసం కాదు
ఓటు కార్డు-ఆధార్‌ లింకుతో దేశంలో విప్లవాత్మక మార్పు రాబోతోందా ??
ఓటు కార్డు-ఆధార్‌ లింకుతో దేశంలో విప్లవాత్మక మార్పు రాబోతోందా ??
లోహపు గుండెతో 105 రోజులు.. వైద్య చరిత్రలోనే సంచలనం
లోహపు గుండెతో 105 రోజులు.. వైద్య చరిత్రలోనే సంచలనం
పాముతో పసిపిల్లవాడు ఆటలా ?? ఏమైనా జరిగితే.. నెటిజన్స్‌ మండిపాటు
పాముతో పసిపిల్లవాడు ఆటలా ?? ఏమైనా జరిగితే.. నెటిజన్స్‌ మండిపాటు
ప్రేమించి పెళ్ళాడిన భర్తను ముక్కలుగా నరికేసిన భార్య
ప్రేమించి పెళ్ళాడిన భర్తను ముక్కలుగా నరికేసిన భార్య
ఈ వ్యాధి ఉన్నవారు బెల్లం తింటే కిడ్నీలు పాడవుతాయా..?
ఈ వ్యాధి ఉన్నవారు బెల్లం తింటే కిడ్నీలు పాడవుతాయా..?
నన్ను కూడా లైంగికంగా వేధించారు అంటూ.. షోలోనే ఏడ్చిన హీరోయిన్
నన్ను కూడా లైంగికంగా వేధించారు అంటూ.. షోలోనే ఏడ్చిన హీరోయిన్
ఫ్లోలో SSMB29 గురించి చెప్పి.. అందరికీ షాకిచ్చిన పృథ్వీరాజ్‌
ఫ్లోలో SSMB29 గురించి చెప్పి.. అందరికీ షాకిచ్చిన పృథ్వీరాజ్‌
దేవరను పూజిస్తున్న జపాన్ అమ్మాయిలు.. అది తారక్‌ క్రేజ్ అంటే!
దేవరను పూజిస్తున్న జపాన్ అమ్మాయిలు.. అది తారక్‌ క్రేజ్ అంటే!